కారణాలు ఎప్పుడు బలమైనవి కాదు, బలమైనవి కారణాలుగా మిగిలిపోవు- A Short Story

Updated on
కారణాలు ఎప్పుడు బలమైనవి కాదు, బలమైనవి కారణాలుగా మిగిలిపోవు- A Short Story

Contributed by Bharadwaj Godavarthi

Part-1 Part-2

అరుణ్: కారణాలు ఎప్పుడూ బలమైనవి కాదు బ్రదర్, బలమైనవి ఎప్పుడూ కారణాలుగా మిగిలిపోవు. నేను: వాళ్ళు విడిపోడానికి 'స్వేచ్ఛ' కన్నా గొప్ప కారణం ఏముంటుంది అనుకున్న నాకు, 'స్వేచ్ఛ' కారణం కాదు అని, తను వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమకి సజీవ రూపం కలిపించిన 'పేగుబంధం' అంటూ లేని 'బంధం' అని తెలుసుకున్నాను. మొదటిసారి అరుణ్ ప్రేమకధలో ప్రేక్షకుడిగా కాకుండా పాత్రగా ఉండి ఉంటే వాళ్ళ జీవితంలో ఇంకో కోణం తెలుసుకునే అవకాశం దొరికేదేమో అని అనిపించింది. కానీ "స్వేచ్చని కాపాడిన వాళ్ళ ప్రేమ, వారిద్దరి మధ్య బంధాన్ని ఎందుకు కాపాడలేకపోయిందో అర్ధం కావట్లేదు"? గడియారం అలారమ్ ని మేలుకొలిపే సమయం అవుతున్నా వాళ్ళ ఆలోచనలు నన్ను వదిలి వెళ్లడం లేదు. ఇంక తప్పని పరిస్థులలో అరుణ్ కి ఫోన్ చేసేసా. నేను: Sorry for disturbing you at this time bro, but I just need to know why you part away? I completely understand it's not the right time, but 'స్వేచ్ఛ' విషయంలో చాలా ఉన్నతంగా వ్యవహరించిన మీరు, మరే కారణం వల్ల విడిపోయారో తెలుసుకోకుండా ఉండలేకపోతున్నాను. అరుణ్: "ఉన్నతమైన ఆలోచనలను కనే అదే మనిషి, అహాన్ని కూడా కంటాడు బ్రదర్". Date: గుర్తువుంది (June 23rd 2017). Time: 5:30 PM(She is Waiting for me for a while). Premises: Acupuncture Therapy Center Canteen.

అరుణ్: Hi, Sorry for being late. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి, Did you consult doctor? తను: Yes Arun, I just consulted him. He told that swecha is slowly started responding to the treatment and suggested us to be patient and give her some more time to respond to the treatment . అరుణ్: OK, Good that she is responding to the treatment and నాకు స్వేచ్ఛ మీద నమ్మకం ఉంది, తను తప్పకుండా recover అవుతుంది. తను: Hope she will recover soon. Are you having a tough day at office? Looking very tired! అరుణ్: Very tough day, last minute deadlines and improper planning. Above all my passion differs from what I am doing. So much mess in my professional life. తను: I know what you are going through Arun. I am sure that one day your writings will win million heart's. అరుణ్: 'Thank you' very much. Hey just keep that professional struggle aside. I have a very good news for both of us. Guess What? తను: Any thing related to our marriage? అరుణ్: Exactly!! Our parents agreed to our marriage and not only that, they agreed swecha along with us. తను: నిజంగానా అరుణ్? అరుణ్: నిజమే. They understood our love and 'స్వేచ్ఛ'. నిన్నే వాళ్ళ decision చెప్పారు. Are you happy now? తను: చాలా సంతోషంగా ఉంది. Super Happy, Just feeling like top of the world. అరుణ్: Exactly, even I have the same feeling!! అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వచ్చేవారం మావాళ్లు వచ్చి 'మిగితా విషయాలు' మీ పేరెంట్స్ తో మాట్లాడుతారు. తను: మిగితా విషయాలు అంటే, ఏంటి అరుణ్? అరుణ్: Just a casual meet to know each other families, to fix marriage date, ఇంకా చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, అదే ఇచ్చిపుచ్చుకోటాలు అవి. తను: ఇచ్చిపుచ్చుకోటాలు ? Are you serious? Does your parents expecting dowry from our Family? అరుణ్: 'Dowry' అని కాదు కానీ, మీరెంత గోల్డ్ పెడతారు, మేమంత పెట్టాలి? పెళ్ళిలో ఎవరెవరి షేర్ ఎంత? Regular discussion's in every marriage. Just be Practical and I don't thing it is wrong when they expect minimum things. తను: Be practical అంటే? నాకు అర్ధం కావట్లేదు అరుణ్? అరుణ్, రెండు కుటుంబాలు పెళ్లి మాటలకు కలుస్తున్నారు అంటే "తాము పెంచిన రెండు మనసుల అభిరుచులు, అవి రూపుదిద్దుకున్న విధానం, ఆలా విభిన్నంగా పెరిగిన 'రెండు మనసులు' కలిసి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఎదురుకునే సమస్యలకు, తమ మద్దతు ఎలా తెలుపుతామో మాట్లాడాలి. అంతేకానీ, పంపకాల కోసం జరిగిన చర్చలాగ ఉండకూడదు. "డబ్బులు తీసుకోని మరీ కొనుకోడానికి నేనేమి అమ్మకపు వస్తువుని కాదు అరుణ్. కలిసిన మనసు కోసం పేగు బంధాన్ని సైతం త్యాగం చేసి, మీ వంశాభివృద్ధి కోసం కన్యాదానం చేయబడిని ఒక ఆడపిల్లని". అరుణ్: What you are saying is theoretically 100% correct, I agree. but practically these words are not going to impact my parents heart! నువ్వు చెప్పింది నాకు చాలా బాగా అర్ధమవుతోంది, కానీ ఇంట్లో కూతురికి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేయాలని భావిస్తూనే, వచ్చే కోడలి నుండి కట్నం ఆశించే వ్యవస్థలో పెరిగి, మనని పెంచుతున్న వాళ్ళకి ఎలా అర్ధం అయ్యేలా చెప్తా?? అయినా సరే నువ్వు చెప్పిన మాటల్లో న్యాయం ఉంది కాబట్టి, ఆ ప్రస్తావనని పెళ్లి మాటలో రానివ్వకుండా చూసే పూచి నాది. ఒక వేళ వస్తే వాళ్ళని ఎదిరించి అయినా నిన్ను పెళ్లి చేసుకుంటా! తను: Thanks for understanding my heart, I just want to assure you one thing Arun. "జీవితంలో ఎప్పుడైనా నాకు నీతో ప్రాబ్లెమ్ వస్తే అది నీ ప్రేమ వల్ల మాత్రమే అవుతుంది కానీ, నువ్వు కొనే వస్తువుల వలనో, లేక మనం ఉండే అంతస్థుల వలనో కాదు". అరుణ్: I know your heart. I will be there with you all the way, but I have a small condition, I know you don't like the word 'Condition', Just consider my words as a small request! తను: చెప్పు అరుణ్? అరుణ్: నువ్వు మా వాళ్ళతో కలిసిపోవాలి, I know you are an introvert and person who likes to keep things so simple. "కానీ పెళ్లి అయ్యాక 'కొంచం మారాలి', మా వాళ్ళకి నచ్చినట్టు 'కొంచం నడుచుకోవాలి'. Dressing style మరీ ఇంత సింపుల్ గా ఉంటె మావాళ్ళకి నచ్చదు, కొన్ని పనులు నేర్చుకోవాలి, మా వాళ్ళకి కొంచం చాదస్తం ఎక్కువ, చనువుతో ఏమైనా అన్నా నువ్వు కొంచం సర్దుకుపోవాలి." You Don't worry I will be there with you and will guide you . తను: నాతో ఉంటావా అరుణ్, నిజంగానా! అరుణ్: అదేంటి ఆలా అడుగుతున్నావు, నమ్మకం లేదా? తను: నువ్వు చెప్పిన మాటలు విన్నాక ఎలా నమ్మకం కలుగుతుంది అరుణ్! అరుణ్: నేనేం చెప్పా నీకు, మా వాళ్ళతో కలిసిపోవాలి అని అంటున్నాను అంతే కదా! తను: అదే చెప్తున్నా అరుణ్, "నాతో నన్ను ఉండనివ్వని నీ ప్రేమ, నావైపు నిన్ను నిలబడేలా ఎలా చేస్తుంది? ఒకవేళ నువ్వు నిలబడ్డ అని భ్రమపడిన, అది నీ రూపాన్ని ప్రతిబింబించే నీ నీడే కానీ, నీ మనసు కాదు"!

అరుణ్: I am not understanding why you are treating this as an issue? అయినా నేనేం అన్నాను, అందరితో కలిసిపోవాలి, కొంచం మావాళ్ళకి తగ్గట్టు మారాలి అన్నాను, ఆలా కోరుకోడంలో తప్పేముంది? నువ్వు కట్నం గురించి నీ అభిప్రాయం చెప్తే అర్ధం చేసుకున్నాను! స్వేచ్ఛ మాత్రమే మన కూతురు ఇంక పిల్లలుకనే ఉద్దేశం లేదు అంటే ఒప్పుకున్నాను! కానీ నిన్ను 'నేను కొంచం మారాలి' అంటే నా ప్రేమనే question చేస్తున్నావు? Above all you always come with your practically non realistic philosophical statements! తను: Practically non realistic statements? You are such an hypocrite Arun? 'నా ఫిలాసఫీ', 'నా ఆలోచనలు', నచ్చి నన్ను ప్రేమించా అన్నావు! ప్రేమించాక ఇప్పుడు నన్ను మార్చాలని ప్రయత్నిస్తున్నావు? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు 'నన్ను, నేను ఇంకా ప్రేమించుకునేలా చేయడం, అంతే కానీ నన్ను నీకు నచ్చినట్టుగా మార్చడానికి ప్రయత్నించడం కాదు'! అరుణ్: What did you just say? Am I a hypocrite? ఓహో! అంతేలే, నిన్ను కొంచం మారమనేసరికి, నేను hypocriteని అయిపోతాను! 'నేను', 'మావాళ్ళు', మాత్రం పెళ్ళికి ముందే స్వేచ్చని ఒప్పుకునేంత మారాలి! మేము మారడం, 'నీ మనసును', 'నీ స్వేచ్ఛను', అర్ధం చేసుకోడం! నిన్ను మారమంటే అది మాత్రం hypocrisy? తను: I never meant that way Arun! అయినా, స్వేచ్ఛ కోసం మీరు మారడం ఏంటి? స్వేచ్చని ' నా' జీవితంలో భాగం చేసుకోడం నా హక్కు! ఆ అభిప్రాయం మీకు నచ్చితే నాతో నడవాలి, లేకపోతే విడిపోవాలి! అంతే కానీ స్వేచ్చని అడ్డుపెట్టుకొని నన్ను మారమనడం ఏంటి? అది కూడా తిడితే పడాలి, మీకు నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలి, మీకు నచ్చిన వంటలు నేర్చుకోవాలి, ఇది మార్పా?లేక 'నన్ను, నేను కోల్పోడం ఎలా' అని మీరు రాసిన పుస్తకమా? నన్ను నేను కోల్పోతున్నాను అని నాకు అనిపించిన క్షణం, ఏ బంధాన్ని అయినా నేను కోల్పోడానికి సిద్ధం. అరుణ్ : ఇప్పుడు నువ్వేం చెపుదామనుకుంటున్నావు? Indirectly you are trying to convey me that you are ready for breakup? OK, do as you wish. This time I am not convinced by your words/philosophy. GOOD BYE. PRESENT: అరుణ్: ఆ తరువాత ఏమైందో నీకు తెలుసు కదా బ్రదర్! తను వచ్చి నాకు 'Break Up' చెప్పడం, ఆ తరువాత నీకు మా జీవితం గురించి చెప్పడం! నేను: నిజంగా, ఏం మాట్లాడాలో నాకు అర్ధం కావట్లేదు బ్రదర్!! స్వేచ్చని అర్ధం చేసుకున్న నువ్వు, 'తన స్వేచ్చని' ఆ క్షణంలో ఎందుకు అర్ధం చేసుకోలేదో ఇప్పటికి అర్ధం కావడంలేదు? అరుణ్: ఇందాకే చెప్పా కదా బ్రదర్, "ఉన్నతమైన ఆలోచనలను కనే అదే మనిషి, అహాన్ని కూడా కంటాడు అని". నేను: ఇంతగా ప్రేమిస్తున్న నువ్వు, తనని వదిలి అసలు ఎలా ఉంటున్నావు? అరుణ్: "గడవపోయే ప్రతి క్షణంలో గడిచిన క్షణంలో ఉన్నమనషులు మనతో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు మనతో పంచుకున్న అనుభూతులు మాత్రం మనతోనే వుంటాయి. మనం ఎక్కడ ఉన్న అవి మన మనసులను తాకుతూనే వుంటాయి"! నేను: నిజమే బ్రదర్! బ్రదర్ అడగడం మర్చిపోయాను, అసలు తన పేరేమిటి, మీరెలా కలుసుకున్నారు? అరుణ్: కచ్చితంగా చెప్తాను బ్రదర్, అప్పటిదాకా పుస్తకాలకే పరిమితమైన వ్యక్తిత్వాన్ని, మొదటిసారిగా కలిసిన క్షణం గురించి చెప్తాను. ఇంతకీ తన పేరేమిటంటే -----------------TO BE ENDED---------------