కాలగమనం లో కనుమరుగై పోయిన కాలాతీత కవితల రచయిత - కాళోజి!

Updated on
కాలగమనం లో కనుమరుగై పోయిన కాలాతీత కవితల రచయిత - కాళోజి!

"అది వార్తలు కూడా సెన్సార్ అవుతన్న రోజులు, చాలా ఉక్క పోతగా ఉండేది...", కంగారు పడకండి కాపి కొట్టిన డైలాగే కాని సిచువేషన్ కి సింక్ అవుద్దని వాడాను. అలాంటి ఛాయ్ తప్ప బిస్కెట్ దొరకని రోజుల్లో, చదువు కేవలం గొప్ప వాళ్ళకే సంభందించిన వస్తువు గా పరిగనించబడే కాలంలో తెలుగు, ఉర్దూ, కన్నడ, మరాఠీ భాషల్లో ఉద్డండుడి గా ఉంటూ తెలుగు వచన కవిత్వం లో కొత్త మార్గం సృష్టించిన "ప్రజా కవి" మన కాళోజి నారాయణ రావు గారు.

సినిమాటిక్ గా చెప్పాలంటే... ఏ మహా కవి పేరు చెపితే ఎక్కువ మంది గుర్తుపట్టరో... ఎవ్వరి కాలాతీత రచనలు ఎక్కువ మందికి తెలియవో... ఎవడు నైజాం నవాబు కారు మీద బాంబు వేసాడో... అతనే మన "రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామరాజ్ కాళోజి", క్లుప్తంగా 'కాళోజి నారాయణ రావు' అలియాస్ 'కాళన్న'.

ఆయన రచనలు పరిచయం చేయాలని రాస్తున్నాము కాబట్టి, ఆయన వ్యక్తిగత జీవితం గురించిన విషయాలు చెప్పటం లేదు. మీకు ఆసక్తి ఉంటే గూగుల్ తల్లిని ప్రార్దించగలరని మనవి.

రచయిత, కవి, కధకుడు... పేరేదైనా పని ఒక్కటే. తమ మస్తిష్కం లో ఉన్న మాటలను నోటితో కాకుండా కలంతో ప్రజల మనస్సులో నిలిచిపోయేలా చేయటం. కాని ఎంతమంది రచనలు.. పొలం లో పైరు నాటే వాడికి, ఎండలో రాళ్ళు కొట్టే వాడికి, నీళ్ళలో చేపలు పట్టే వాడికి, అడవుల్లో కట్టెలు కొట్టే వాడికి అర్ధం అవుతాయ్!? వీళ్ళకు సైతం సులభంగా అర్ధమయ్యేలా ఉంటాయి కాళోజి రచనలు.

పండితులకు మాత్రమే అర్ధం అయ్యేలా రచనలు చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళుగా ప్రశస్తి పొందారు, కాళోజి అలా చేయలేదు కనుకే ఇప్పటికీ పరిచయం చేయాల్సి వస్తుంది. ఆయన రచనల్లో ఛందస్సు, ఉపమానాలు, ఉపమేయాలు వంటివి ఏమి ఉండవు. ఆయనకు రాకా అంటే... "నాకు తెలీక కాదు, అందరికి తెలీదు కనుక" అనే వారట ఆయన.

ఆయన "మాట శూలం, ఎంతో సూటిగా ఉండేది. మనసు వెన్నె కన్నీరు పెట్టిన సందర్బాలు బోలెడు. రచన వచన సాహిత్యానికే వన్నె". ఆయన రచనలు చదివితే ఆయన అంతరంగం ఏమిటో ఇట్టే అర్ధం అవుతుంది. దాదాపుగా ప్రజల సమస్యలు అన్నిటిపైన ఆయన రచన చేసారు. ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే వారు, రచనలు చేసే వారు కనుక ఆయనకు "ప్రజా కవి" అనే పేరు వచ్చింది.

తెలుగు భాషంటే ఎనలేని అభిమానం, తెలంగాణా యాసంటే ప్రాణం.

అప్పట్లో తెలుగు వాళ్ళు ఆంగ్ల బాషాపై మక్కువ మిక్కిలి ఎక్కువగా చూపిస్తుంటే, కోపం తో...
Andhruda chava venduku ra
*ఆంధ్రుడు అంటె తెలుగు మట్లాడెవారని ఆయన ఉద్దేశం.

స్వతంత్ర భారతం లో ప్రజాస్వామ్యాన్ని రాజకీయ నాయకులు నవ్వులపాలు చేస్తుంటే...

tala bodi chestivi

ఆనాటి సమాజం లోని అసమానతల పై

Annapu raasulu

మనుషుల లోని అంతరంగిక విషయాలపై

kanapadda prateedani

లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ మరణించిన వేళ!

Puttuka Needi

వివిధ మతాలూ వాటి ఆచరణల పై

naama roopalu anantam

ఆనాటి సమాజం లోని బిన్న ధోరణులపై

yedu marina eedu mudirina

ప్రజల బాధలకు తానేమి చేయలేక నిస్పృహ తో

enduko na hrudini

ఆయన రచనల్లో గొప్పది గా చెప్పబడే .. నా గొడవ లో

na godava

నైజాం నుండి తెలంగాణా వేరు కావాలని కోరుతూ..

telangana veraite

ఆయన స్వగతం లో

poola vaasanalu nindina

ఆనాడు అవినీతి చేస్తున్న రాజకీయ నాయకుల పై వ్యంగ్యం గా

ragupati ragava

మానవ స్వభావం పై

manishi enta manchivadu

ఆయన తన సహచరులతో ఎప్పుడూ "మనిషిని మనిషి మాదిరిగా మన్నించలేనంత మలినమైనదీ జగతి మలినమైనది" అంటూ ఆవేదన వ్యక్తపరిచే వారట.

ఆయన గురించి ఒక్క మాట లో "ఆయన ఎప్పుడూ ఎవ్వరిని అనుకరించలేదు, ఆయన్ని ఎప్పటికి ఎవ్వరు అనుకరించలేరు".