Love & Destiny - Here's The Thrilling Final Episode Of Na Nuvvu Ne Nenu!

Updated on
Love & Destiny - Here's The Thrilling Final Episode Of Na Nuvvu Ne Nenu!

Click here for PART 1:

Click here for PART 2:

Click here for PART 3

నా కళ్ళని నేనే నమ్మలేదు,ఇది కలేమో అనుకున్నాను కానీ ఇది కల కాదు,నా ఎదురుగా నిధి నిధి ఏంటి నువ్వు ఇక్కడ ఏంటి,?ఈ టైంలో ఇక్కడికి ఎలా వచ్చావు,??అసలు ఏంటి అలా ఉన్నావ్,?ముందు లోపలికి రా……ఏంటి ఇంత రాత్రి ఇక్కడికి ఎలా వొచ్చావు? నేనిక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అసలేం జరింగింది?? మాధవ చెప్పాడు,తనే తీసుకొచ్చాడు

వాడెక్కడ ? నేనే వెళ్లిపొమ్మన్నాను ఎందుకు,అసలు ఎందుకు వొచ్చావు ఎం జరిగింది ? ఏమి లేదు గౌతమ్,నిన్నోసారి చూడాలనిపించింది,అందుకే వచ్చాను ఏంటి నన్ను చూడాలనిపించిందా?? అందుకని ఈ రాత్రి వొచ్చావా ??నిజం చెప్పు నిజంగా గౌతమ్,నిన్ను చూడాలని అనిపించింది,అందుకే వచ్చాను, నువ్వేదో దాస్తున్నావ్,నీ మాటల్లో బెరుకు, నీ ఒంట్లో ఎదో వణుకు,నీ కళ్ళు నువ్ ఎదో దాస్తున్నావ్ అని చెప్తున్నాయి ఏంటో చెప్పు

నీకు క్షమాపణ చెప్పాలని వచ్చాను,నేను చేసిన దానికి క్షమించమని అడగడం కూడా నేరమే,తప్పు చేస్తే క్షమించమని అడగాలి,కానీ నేను మోసం చేశాను,నా తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు,కాని నా పశ్చాత్తాపాన్ని నీకు చెప్పాలని వచ్చాను ఏంటి,మోసమా ???క్షమించాలా?? ఎం మాట్లాడుతున్నావ్ నిధి ?? నువ్వెంటి?? నన్ను మోసం చేయడం ఏంటి ?? నేను నిన్ను ఎంతగా భాద పెట్టానో నాకు తెలుసు ,కనీసం నీతో ఒక మాట కూడా చెప్పడానికి కూడా నాకు వీలు లేకుండింది

అవన్నీ ఇప్పుడు ఎందుకు నిధి నన్ను చెప్పనివ్వు గౌతమ్,నాన్న తొ మళ్ళీ ఓసారి మాట్లాడి,అప్పటికి వినకుంటే నీతో వచ్చేద్దామనుకున్నాను, కానీ నన్ను అప్పటికప్పుడే ఢిల్లీ తీసుకెళ్లి,రెండురోజుల్లొనె పెళ్లి చేసేసారు,నేను ఎంతగా పోరాడినా లాభం లేకుండా పోయింది,నువ్వెంత వేదనకి గురైవుంటావో నేను ఊహించగలను,నేనే నీ భాదకి కారణం,నేనే ...అంతా నావల్లే,నన్ను క్షమించు గౌతమ్,నిన్ను అంత కష్టపెట్టినందుకు నాకు తగిన శిక్షే పడింది,

ఏంటి నిధి? ఎం జరిగింది అంత బలవంతం చేసి పెళ్లి చేసేసారు,తనకి నేను కేవలం శారీరక అవసరాలు తీర్చే యంత్రాన్ని మాత్రమే,పెళ్లి జరిగిన మూడేళ్ళలో నాలుగు సార్లు కూడా నాతో మాట్లాడలేదు,తనకి కూడా నాతో పెళ్లి ఇష్టం లేదు,తను వేరెవరినో ఇష్టపడ్డాడు,బలవంతం మీద నన్ను చేసుకున్నాడు,మా పెళ్లి జరిగిన ఏడాదికి తను ఇష్టపడ్డ అమ్మాయి ఫారిన్ నుంచి వచ్చింది ,తనతోనే ఉంటున్నారు, ఏంటి ఇది అని అడిగితే కేవలం మీ నాన్న హోదా చూసి చేసుకున్నాను,ఇప్పుడు మీ నాన్నే లేడు,నాకు నీ అవసరం లేదు, విడాకులిచేస్తాను,ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేస్తాను, నన్నొదిలి వెళ్ళిపో అని చెప్పేసాడు,ఇది న్యాయం కాదంటూ ఎంతో చెప్పిచూసా, వినలేదు, నేనంటేనే తనకి చిరాకు.

వద్దనుకున్నవాడితో ,వదిలించుకోవాలనుకున్న వాడి తో ఉండడం నా వల్ల కూడా అవ్వలేదు .విడాకులు తీసేసుకున్నా,రెండేళ్లుగా నరకం లా ఉంది జీవితం, బలవంతంగా కట్టబెట్టిన నాన్న లేడు,కట్ట్టుకున్నవాడు లేడు .పుణె లోనే ఓ కాలేజీలో లెక్చరరుగా చేరాను,ఈ జీవితం కోసమా నేను మౌనం గా అన్నిటిని భరించింది,ఈ జీవితాన్నా మా నాన్న నాకు ఇవ్వాలి అనుకుంది,ఇందుకోసం నిన్ను ఇంత ఇంత క్షోభ పెట్టింది అని చాలా భాద కలిగేది,మనసులో ఎదో వ్యాకులత,నాకు జీవించే హక్కు లేదు,బ్రతికేందుకు కారణమూ లేదు,చనిపోవాలనుకున్నాను,ఒక్కసారి నిన్ను చూసి,నిన్ను క్షమించమని అడిగి,నా మనసులో భారాన్ని దించుకోవాలనుకున్నా,నాకు ఈ భాద నుండి విముక్తి లేదు,అందుకే బతుకు నుండి ముక్తిని కోరుకున్నా, బతుకు చావులా మారినపుడు చావే మరో బ్రతుకునిస్తుంది . ఆ రాముడి స్పర్శతో రాయి అహల్యగా మారి శాప విమోచనం కలిగినట్టు, నిన్ను ఓసారి చూసి,నీతో మాట్లాడి,నా తనువు చాలించాలనుకున్నా. అందుకే ఇక్కడికి వోచే ముందే poison తీసుకున్నా,నన్ను క్షమించు గౌతమ్

నిధి………………. (గతం తాలుకా జ్ఞాపకాలలో మునిగిన నన్ను ఎవరో పిలవడంతో టక్కున లేచాను ) సర్………….. సర్ …………………. హా ………… డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు,పదండి చెప్పండి డాక్టర్, గౌతమ్ నిజంగా,It’s Unbelievable ,.. పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారు,she is out of danger ఒక రోజు పూర్తిగా ఐసీయూలోనే ఆబ్సెర్వేషన్లో ఉంచాలి,రేపు రూమ్ కి షిఫ్ట్ చేస్తాం,రెండురోజుల్లో డిశ్చార్జ్ చేసేయొచ్చు, థాంక్యూ డాక్టర్,థాంక్స్ ..ఇప్పుడోసారి చూడొచ్చా

దూరం నుంచే ఓసారి చూసి రండి,ఐసీయూలోకి allow చేయడం కుదరదు మరుసటి రోజు ఉదయం,హాస్పిటల్ రూమ్ లో ఏంటి నిధి ,ఎందుకిలా చేసావ్,అసలు నాకు చెప్పకుండానే చనిపోవాల్సింది,నేను ఎవరినో కదా,నీకు నాకు ఏంటి సంబంధం నువ్వెవరో,నేనెవరో కదా , ఏంటి నువ్వు నన్ను మోసం చేసావా?? నిజమే చాల పెద్ద మోసమే చేశావ్ …నాకెప్పుడూ అలా అనిపించలేదు,కానీ ఇప్ప్పుడు ఇలా చేసావ్ చూడు,నిజంగానే నన్ను మోసం చేసావ్ నన్ను వొదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నవ్ కదా,వెళ్ళిపో .. ……నా జీవితంలో నాకు అమ్మ ప్రేమ,నాన్న తోడు,లేని సమయంలో నాకు అన్నీ నువ్వే అయ్యావ్,నా సైన్యం,నా దైర్యం,నా బలం,నా బలహీనత,నా ఆస్తి,నా అవస్థ అన్నీ నువ్వే అయ్యావ్, నువు నాకో అద్భుతం,నువు నాకు అపురూపం నిజమే నువ్వు దూరం అయ్యాక ప్రాణం పోయినట్టే అనిపించింది,నువ్ నాకు ఇచ్చిన అనుభూతులతో కాలం గడిపేస్తున్నాను....

నీ భాద చెప్పుకోడానికి నేను గుర్తొచ్చాను కానీ,నీ భాదని పంచుకోడానికి నేను లేననుకున్నావా,నాకంటూ ఎవరూ లేని ప్రపంచం లో నా లోకమే నువ్వయ్యావ్,నీకు కష్టమొస్తే నేను తోడుండననుకున్నావా, నువ్ చనిపోతే నేను బతికుండగలననుకున్నావా ,ఇదేనా నిధి నన్ను అర్ధం చేసుకుంది…. నీ మనసులో నేను ఉన్నంతకాలం నువ్వు నాదానివే,ఇంకో పాతికేళ్ల తరువాత నువ్వు నా తలుపు తట్టినా నేను ఇదే సమాధానం చెబుతాను, …… మొదట నువ్వు నాతో ఉండాలనుకున్నాను,తర్వాత నువ్ బాగుండాలనుకున్నాను,ఇందాక నువ్ బతికుండాలనుకున్నాను,ఇప్పుడు నీ బతుకులో నేనుండాలనుకుంటున్నా ఉండనిస్తావా??.......నిధి నీతో కలిసి నా ఆనందాన్ని వెతుక్కోవాలి,నీతో నడిచి ప్రపంచం చూడాలని ఉంది,నాతోడుంటావా, నాలుగు రోజుల తరువాత - రోజూ కళా విహీనంగా కనిపించే నా ఇల్లు,ఈ రోజు నిధి రాకతో అందంగా మారాయి,నా ఆనందం,నా సంతోషం నాకు తిరిగొచ్చేశాయి,మళ్ళీ నేను పసివాడిలా మారిపోయాను,నేను ఇరవై ఏళ్ల క్రితం పోగొట్టుకున్న నా తల్లిదండ్రుల ప్రేమ మళ్ళీ నిధి రూపం లో శాశ్వతంగా నాకు దక్కింది,ఇప్పుడు నేను ఒంటరి వాడ్ని కాదు, నేనొక్కడిని కాదు,ఆత్మా, దేహం రెండూ ఒక్కటయ్యాయి మళ్ళీ,ఇప్పుడు నేను, తను కాదు, మేము ..... శ్రీ నిధి గౌతమ్..... కథ సుఖాంతం కథ సమాప్తం