Intense, Deep & Pure: Here’s The First Part Of Feel Good Love Story – Naa Nuvvu Nee Nenu!

 

నిధి …. లే… లే…. నిధి నన్ను ఓసారి చూడు,కళ్ళు మూసుకోకు,….నిధి …. నేను… నేను… నిధి ,చూడు ఓసారి చూడు,నాతో మాట్లాడు,కళ్ళుమూసుకున్నావంటే చంపేస్తాను, చూడు… చూడు.. నన్ను చూడు,ఒక్కసారి నాతో మాట్లాడు,నేనున్నాను నీకు నేనున్నాను, లే….. లే…. నిధి నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు…. డాక్టర్….. డాక్టర్….. నిధి … తను.. సూసైడ్ అట్టెంప్ట్ ……చేసింది,తనని బతికించండి డాక్టర్,
ఓకే ….గౌతమ్ మేము చూసుకుంటాం,నర్స్ అర్జెంట్గా డాక్టర్ నీలిమని రమ్మనండి,కూల్ గౌతమ్,మేము చేయగలిగింది చేస్తాం,మీరు వెయిట్ చేయండి
దేవుడా…. నిధి బతికేట్టు చూడు,తనని బ్రతికించు,తనే నా ప్రాణం,నా జీవితం,నా సర్వస్వం నా నుండి తనని దూరం చేయకు,నేనెప్పుడూ నిన్ను ఏది అడగలేదు,నా వాళ్ళందరిని నాకు దూరం చేసినా నిన్ను ఆపలేదు,నా నిధి ని నాకిచ్చేసేయ్,నిధి కి ఏమైనా జరిగిందో,దేవుడివి అని కూడా చూడను …. స్వామీ నా నిధిని కాపాడు తనని బ్రతికించు స్వామీ ……..

గౌతమ్………..
చెప్పండి డాక్టర్,
ఆవిడ చాలా రోజుల నుండి లిక్విడ్స్ తప్ప ఫుడ్ ఏమి తీసుకోలేదు,చాలా వీక్గా ఉన్నారు,ఒంట్లో రెసిస్టెన్స్ పవర్ కూడా లేదు, మేమిచ్చే మెడిసిన్స్కి,ట్రీట్మెంట్ కి తను ఎంతవరకు రెస్పాండ్ అవుతారు అనేది మాకు కూడా తెలీదు,కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది,24 గంటలు గడిచాక కాని ఏమీ చెప్పలేము,ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప …….. ఐ మీన్ మా ప్రయత్నం మేం చేస్తాం, ప్రయత్నలోపం లేకుండా మన ప్రయత్నం చేద్దాం,మిగతాది మీరు నమ్మే ఆ రాముడే చూసుకుంటాడు,పాజిటివ్ గా ఉండండి గౌతమ్ . డాక్టర్ గా కాదు,మీ మిత్రుడిగా చెబుతున్నా మీకు మంచే జరగాలి, పేషెంట్ ఐసీయూ లో ఉన్నారు,మీరు చూడడం కుదరదు,గౌతమ్ నేనే దగ్గరుండి ట్రీట్మెంట్ అంతా చూసుకుంటాను, మీరు కాసేపు నా రూమ్ లో రిలాక్స్ అవ్వండి, లేదా పక్కనే గుడి ఉంది,కాసేపు వెళ్లి రండి, నేనున్నాను గౌతం, పర్లేదు,మీరు కాసేపు బయటకి వెళ్లి రండి,టెన్స్ అవ్వకండి………….

పూజారి గారు, సహస్ర నామార్చన చేయించండి,పేరు నిధి ,కౌశిక గోత్రం,పుష్యమి నక్షత్రం
ఓం రాజీవలోచనాయ నమ: ఓం శ్రీమతే నమ:….. ……………………………………
మనోవాంఛ ఫల సిద్ధిరస్తు,… ఎదో ఆందోళనలో ఉన్నటు ఉన్నావు,కాసేపు ఆ స్వామిని చూస్తూ ధ్యానములో కూర్చో,కాస్త ప్రశాంతంగా ఉంటుంది,మనసు కుదుట పడుతుంది,
కళ్ళు మూసుకొని నిధిని కాపాడమంటూ వేడుకుంటున్నాను…………….
ఒక్కసారిగా నా జీవితం అంతా నా కళ్ళ ముందు కదులుతుంది …………

12 సంవత్సరాల వయసు,మొదటి సారి నా జీవితంలో రక్తం చూసాను .ప్రాణంగా ప్రేమించే అమ్మానాన్న, ఒక్క క్షణం కూడా నన్ను వొదిలి ఉండని తమ్ముడు,ఆరేళ్ళు వాడికి ,నా కళ్ళ ముందే,నేను చూస్తుండగానే నన్ను వొదిలేసి వెళ్లిపోయారు,గాయాలతో బయటపడ్డాను, ఒంటికి తగిలిన గాయం మానింది,కానీ నా మనసుకి తగిలిన గాయాన్ని ఇంకా మోస్తూనే ఉన్నా . తమ్ముడు, చాలా చిన్న వాడు అప్పటికి,నా చేతిలోనే అన్నయ్యా నొప్పి ..నొప్పి అంటూ ప్రాణాలొదిలాడు.రక్తపు మడుగులో మాంసపు ముద్దలులాగా అమ్మా నాన్న . ఆ ప్రమాదం నా అనుకున్న వాళ్లందరికీ నన్ను శాశ్వతంగా దూరం చేసేసింది,అప్పుడే బుద్ది తెలుస్తున్న వయసు, తమ్ముడితో ఆడుకోడం, అమ్మ నాన్న దగ్గర కథలు వింటూ పడుకోడం,నవ్వుతూ సాగిపోతున్న జీవితంలో ఒక్కసారిగా చీకటి , అప్పుడు ఒంటరి తనం మొదలయ్యింది. ఆస్తులు, పంపకాల మీద ఉన్న శ్రద్ధ నా ఆలనా పాలన మీద బంధువులెవరికీ లేదు, నాకున్న ఏకైక స్వాంతన వారానికోసారి ఆప్యాయంగా పలకరించే మామయ్యే .

ఒంటరి తనం అలవాటయ్యింది. పండేళ్లవయసులో ఇంట్లో నేనొక్కడినే,ఒంటరిగానే చదుకున్నాను,ఒంటరిగానే స్కూల్కి వెళ్ళాను,ఒంటరిగానే ఆడుకున్నాను,రోజూ రాత్రి డైనింగ్ టేబుల్ మీద అమ్మ నాన్నా తమ్ముడు కలిసి ఉన్న ఫోటోని ఎదురుగా పెట్టుకొని,ఆ రోజు జరిగినవన్నీ వాళ్ళతో చెబుతూ భోంచేసేవాడ్ని ,భయమేస్తే తమ్ముడి టెడ్డీబేర్ బొమ్మని ఒక పక్క,అదే ఫోటోని మరో పక్క పెట్టుకొని పడుకునే వాడ్ని. నాకెవరు పెద్దగా ఫ్రెండ్స్ లేరు,ఒకరో ఇద్దరో తప్ప
ఎందుకో జాలిగా చూసేవాళ్ళు ,నాకది నచ్చేది కాదు,దేవుడికి మా అమ్మా నాన్న అంటే చాల చాలా ఇష్టం,అందుకే తీసుకెళ్లాడు,అయినా వాళ్ళు నాతో ఉన్నారు,ఉంటారు,,నాకేం భయం లేదు,అంటూ చెప్పేవాడిని,నా భాదని పంచుకునేంత స్నేహితులు నాకెవరు లేకపోవంవల్ల, పంచుకుంటే తీరిపోయే భాద కానందువల్ల ఎవరికీ చెప్పేవాడిని కాదు,ఎప్పుడైనా మనసుకి కష్టంగా అనిపిస్తే,నాన్న నాకిచ్చిన డైరీలో నాకు తొచింది రాసుకుంటూ ఉండేవాడిని,. ఎవరికీ చెప్పుకోలేనివి అన్నీ రోజూ డైరీలో రాసుకోడం అలవాటు గా మారింది .అమ్మ నాన్న అది చదువుతారని నా నమ్మకం ..

డైరీలో నేను రాసుకున్న మొదటి మాటలు
ఈ నిశిరాతిరి చీకట్లు తొలగేదెపుడో ……..శశి కాంతుల వెన్నెల వచ్చేదెపుడో
అమ్మా నాన్నా తమ్ముడి తర్వాత మావయ్య అంటే నాకు చాలా ఇష్టం, ఆయనే నన్ను కాస్త ప్రేమగా చూసుకున్నది,కానీ నేను ఇష్టపడ్డ వాళ్ళని నా నుండి దూరం చేసేయడం దేవుడి అలవాటు,ఫారిన్ లో ఉద్యోగం వల్ల మావయ్య కూడా నాకు దూరం గా వెళ్ళిపోయాడు, ఇప్పుడు పూర్తిగా ఒంటరి పక్షిని,ఎలా ఉన్నావ్ అని అడిగే మనిషి కూడా లేడు .. నాకు నేనే తోడు,నాకు నేనే అన్నీ
మనస్ఫూర్తిగా నేను నవ్వి చాలా సంవత్సరాలయింది. నా వాళ్ళు దూరం అయ్యిన చాలా సంవత్సరాలకి, ఆ దేవుని వరమో లేక నా తల్లిదండ్రులే నా ఒంటరి తనాన్ని దూరం చేయడానికి, నా భాదని మరచిపోడానికి,నా దగ్గరికి పంపారో తెలీదు,నన్ను నాకు సరికొత్తగా పరిచయం చేయడానికి,నన్ను నవ్వించడానికి,నన్ను నడిపించడానికి,నన్ను ప్రేమించడానికి నాకోసం వచ్చింది,….నిధి ….నా నిధి

Watchout for PART 2 !

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,