Emotional, Intense And Thrilling : Here’s The Second Part Of Feel Good Love Story – Naa Nuvvu Nee Nenu!

 

Click here to view Part 1

మొదటి సారి తనని చూసినపుడు నాకు తెలీదు,తనే నా జీవితం అవుతుందని,ఇప్పటికీ గుర్తు ఆ రోజు, ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి రోజు, క్లాస్రూమ్ ఎక్కడో తెలియక తిరుగుతున్న నాకు,మీరు ఈఈఈ డిపార్టుమెంటా,ఇదే అనుకుంటా క్లాస్రూమ్,నేను కూడా మీ బ్రాంచే . హాయ్ నేను నిధి ,…అదే మొదటి మాట తను నాతో మాట్లాడింది. తన నవ్వులో ఎదో మాయ ఉంది,తన మాటల్లో ఎదో మాధుర్యం,చూస్తున్న కొద్దీ చూడాలనిపించే అందం,ఒకే కాలేజీ,ఒకే క్లాస్రూమ్ ,ల్యాబ్ లో కూడా ఒకే బ్యాచ్ ,నాకు అమ్మాయిలతో మాట్లాడడం అంటే మహా బెరుకు, నన్నేడిపిస్తూ ఉండేవాడు మాధవ్ గాడు ఇలా ఏంట్రా నువ్వు,నేనైతే మాట్లాడుతూనే ఉండేవాడిని,మాతో బానే ఉంటావ్,అమ్మాయిలు ఎదురుగా మాత్రం ఎందుకురా ఇలా మూగ నోము అంటూ ఆటపట్టించేవాడు .

నిజమే నాకు చాలా దగ్గర అయితే తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాను, ఇక అమ్మాయిల తో మాట్లాడడం అంటే అదో ఫోబియా నాకు ,కానీ నిధి తో మాత్రం ఎందుకో మాట్లాడాలనిపించేది,ఎం మాట్లాడాలో తెలీదు,ఎలా మాట్లాడాలో తెలీదు,ల్యాబ్ లలో చేసే ఎక్సపెరిమెంట్స్ కన్నా, తనని చూడడమే నా పనిగా ఉండేది, తను మాత్రం నాకు పూర్తిగా భిన్నం,అందరితో కలిసిపోతుంది,ఆపకుండా మాట్లాడుతూనే ఉంటుంది, కల్మషం ఉండదు,మొదట్లో క్లాసులో ఎదురైతే పలకరించుకునేవాళ్ళం,ల్యాబ్ లో కాసేపు ఎదో కబుర్లు చెప్పేది, నేను తనని చూస్తూ ఉండిపోయేవాడ్ని, అప్పుడప్పుడు నేనూ ఎదో మాట్లాడేవాడిని,మెల్లిగా మా ఇద్దరి మధ్య ఎదో బంధం చిగురిస్తుంది అనిపించింది,రోజూ తనతో ఎన్నో కబుర్లు చెప్పేవాడిని,అప్పట్లో నోకియా మొబైల్,మెసేజ్ ఆఫర్ ఇవే ఉండేవి, వాటిల్లోనే రాత్రంతా మాట్లాడుకునేవాళ్ళం . ప్రతీ రోజూ ఇదే తంతు,కాలేజీలో ఒకరినొకరం కళ్ళతోనే మాట్లాడుకునేవాళ్ళం,సాయంత్రం మొబైల్ తో కబుర్లు చెప్పుకునే వాళ్ళం.

మా ఇద్దరిది మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అంటే అది అసత్యమే అవుతుంది. ప్రేమ అనే నిర్ధారణకు నేను రాలేకపోయాను,ఇదేదో అంతకు మించిన బంధం. కొన్ని బంధాలు పేరుకే ఉంటాయి కొన్ని బంధాలకి పేరే ఉండదు మా ఇద్దరిది రెండో కోవలోకి వస్తుందేమో అనిపించేది. రెండు శరీరాల మధ్య ఉండే అట్రాక్షన్ కాదిది, రెండు మనసుల కలయిక,మాటలతో కన్నా మౌనంగానే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం . ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం, ఇష్టం ,గౌరవం, అభిమానం, ఆరాధనాభావం, ఇవన్నిటికి మించి పేరు తెలియని ఒక అనుభందం ఇద్దరి మధ్య .తన మనసులో ఏముందో తను చెప్పకముందే నాకు తెలిసేది,తనకీ అంతే, తను నాకోసమే జన్మించింది అని నేను పూర్తిగా నమ్మాను . నా ఒంటరితనాన్ని నాకు దూరం చేసి,నాకు తోడుగా నా జీవితాంతం నాతో ఉండే నీడగా తనని భావించాను,నేను నా ఈ భావనని తనకి చెప్పేలోపే,తనే చెప్పేసింది,తనకి నేనంటే ప్రాణమని,నాతోనే జీవితమని,అప్పటికి మా ఇంజనీరింగ్ చదువు పూర్తయ్యింది.

ఓ రోజున తనని నా ఇంటికి పిలిచాను,అమ్మ నాన్నల ఫొటోలకి తనని పరిచయం చేశాను , నా గురించి పూర్తిగా తెలిసింది తనకి మాత్రమే,తనకి నేనెంతగా దగ్గర అయ్యానంటే, రోజూ అమ్మా నాన్నల ఫొటోతో కబుర్లు చెబుతో భోజనం చేసే నేను కాస్తా తనతో మాట్లాడుతూనే భోంచేసేసాను,తనతో కబుర్లు చెబుతూనే నిద్రలోకి జారుకునేవాడ్ని, తనని నా జీవితం లోకి పంపినందుకు రోజూ ఆ దేవునికి,అమ్మా నాన్నకి కృతజ్ఞతలు చెప్పేవాడిని ,ఎప్పుడూ నా భాదని మాత్రమే రాసుకునే నా డైరీలో నా ఆనందాన్ని కూడా రాసేలా చేసింది,కన్నీరు కారుస్తూ దుఃఖాన్ని దిగమింగుకొని రాసేవాడిని ఒకప్పుడు,తను వొచ్చాక,ఎన్నో సంతోషాలు ఎన్నెన్నో విశేషాలు చిరునవ్వు నవ్వుతూ రాస్తున్నాను.

నిధి తన తల్లిదండ్రులకి నా గురించి చెప్పింది,తనకి నేనంటే ప్రేమని,నన్ను పెళ్లి చేసుకుంటానని తన వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించింది . కానీ నా రాత ,నేను ప్రేమించిందేది నాకు దక్కదు కదా,తన తల్లిదండ్రులు అడ్డు చెప్పారు,ఒప్పుకోలేదు,నిప్పులు కక్కే ఎండాకాలంలో ఒక చిన్న వాన కాస్త ఉపశమనం కలిగించినట్టు,నిధి నా జీవితంలోకి వచ్చింది,ఆ వర్షపు చుక్కల్ని ఒడిసి పట్టాలనుకున్నాను నేను,ఆలా పట్టుకున్నానో లేదో,మళ్ళీ సెగలు కక్కుతూ సూర్యుడు వచ్చి ఆ వర్షపు చినుకుల్ని ఆవిరి చేసేసాడు . కానీ నిధి ని నేను వొదులుకోలేను, తను నేను ప్రేమించిన అమ్మాయి మాత్రమే కాదు,

తను నా మాటకి అర్ధం, నా భాషకి భావం
నా పుస్తకానికి పరిచయం, నా జీవితానికి సంతకం
ఎలాగైనా తన తల్లిదండ్రులను ఒప్పించాలని నిర్ణయించుకున్నాను,కానీ ….విధి నన్ను మళ్ళీ పరీక్షించింది ……..

to be continued

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,