All You Need To Know About The Tenali Handicraft Company That Is Providing Employment To Several Women!

 

ఈ జీవన పరుగు పందెంలో మనం ఎంత కష్టపడితే మనకు మన కంపిటీటర్ కు అంత వ్యత్యాసం ఉంటుంది.. షేక్ అబ్దుల్ ముజీబ్ ఈ సంస్థను తొలిసారి ప్రారంభించడానికి చాలా రీసేర్చ్ చేశాడు. భారతదేశంలో ఇలాంటి వస్తువుల తయారీలో ఉన్నత స్థాయిలో ఉన్న అస్సాంలో ఈ హ్యాండ్ మేడ్ వస్తువుల గురించి పూర్తిగా నేర్చుకున్నాడు.. ఆంధ్రప్రదేశ్ తెనాలి అనే ఒక ఊరిలో సంస్థను స్థాపించడానికి ఈ స్థాయిలో రీసెర్చ్ అవసరం లేదు ఇక్కడే ఏదో చోట నేర్చుకోవచ్చు కదా అంటే ఏది చేసినా గొప్పగా చేయాలి అనేదే నా ఉద్దేశం అంటూ ముందుకు సాగిపోతున్నాడు.

Untitled-design-41

 

షేక్ ముజీబ్ ఏది చేసినా తనకు, ఈ సమజానికి ఉపయోగపడాలనే ఆశిస్తాడు, ఈ ‘అల్లిక'(9948703646) అనే స్టార్టప్ స్టార్ట్ చేయడానికి కూడా అదే కారణం. మన పేద, మధ్య తరగతి మహిళల దగ్గర ఎంతో శక్తి ఉన్నా ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతుంటారు ఈ అవస్థలను చూసి వీరికి ఉపయోగపడాలని, అలాగే తన కెరీర్ కు ఉపయోగపడాలనే ఈ సంస్థను స్టార్ట్ చేశాడు. ఈ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అన్ని ఒకే ఒక్క మెటీరియల్ తో తయారు చేస్తారు అదే గుర్రపు డెక్క నార(Water Hyacinth) అనే మొక్క నుండి వస్తువులను తయారు చేస్తున్నారు.

11063921_1385225408442859_2120636078247106545_n

 

1509108_1378860559079344_3814518536744497372_n

 

15622580_1425976167701116_1578265937099194428_n

 

allika_crafts

 

ఇందులో చేరాలనుకునే మహిళలకు సంస్థ వారే శిక్షణను ఇప్పించి ఉద్యోగం ఇస్తారు. ఇప్పటి వరకు ఈ శిక్షణ ద్వారా తెనాలి ప్రాంతంలో ఎంతోమంది లాభపడుతున్నారు. రూ.150 నుండి రూ.2000 వరకు ఉండే ఈ వస్తువులను కొనడానికి ముందుగా ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కున్నా కాని ఇకో ఫ్రెండ్లి ఇంకా నాణ్యత, స్టైల్ నచ్చడంతో ఇప్పుడు బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. హైదరాబాద్ లామాకాన్, ఆర్గానిక్ స్టోర్స్, శిల్పరామంలో ఈ వస్తువులు లభిస్తాయి. అల్లిక సంస్థ మొబైల్ పౌచ్, డైనింగ్ మాట్స్, హ్యాండ్ బ్యాగ్స్, లంచ్ బాక్స్ బ్యాగ్స్, హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ లాంటి వెన్నో తయారుచేస్తున్నారు. గుర్రపై డెక్క నారతో తయారు చేసిన ఈ వస్తువులు చాలా ధృడంగా ఉంటాయి 12కేజీల వరకు బరువు మోయగలవు 15సంవత్సరాల వరకు మన్నికగా ఉండగలవు.

11692582_1385021585129908_4940140111247331097_n

 

11707517_1385225331776200_999328677645826133_n

 

14601020_1417117085253691_4339718655200462713_n

 

15621891_1425838581048208_6288120219747417684_n

 

12540655_1395815460717187_7024975330867472081_n

 

11709399_1385225158442884_5616754927954575376_n

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , ,