Here’s Why Rao Gopal Rao Is One Of The Legendary Actors In Telugu Cinema

 

“నటుడు” అంటే అన్ని రకాలైన పాత్రలు చేయగలిగుండాలి.. ఇప్పుడంటే ముంబాయి నుండి ఇతర రాష్ట్రాల నుండి విలన్లను దిగుమతి చేసుకుంటున్నాం గాని వారిలో దాదాపు అందరూ కేవలం ఒకే తరహా పాత్రలలో మాత్రమే నటించగలుగుతున్నారు. విలన్ గా చేసినవారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమేడియన్ గా ఇలా అన్ని రకాల పాత్రలు చేసేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. కాని మన తెలుగు నటులు అలా కాదు అన్ని రకాల పాత్రలు చేయగలరు.. గుమ్మడి, ఎస్.వి రంగారావు కైకాల సత్యనారాయణ గారి దగ్గరి నుండి కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి, రావు రమేశ్ ఇలాంటి మహానటులు మన తెలుగువారి సొంతం. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమేడియన్ గా, కామెడి విలన్ గా, భగవంతునిగా మొదలైన అన్నిరకాల పాత్రలతో తన విలక్షణ గొంతుతో మనతెలుగు వారి హృదయాలలో నిలిచిపోయారు స్వర్గీయ రావు గోపాలరావు గారు.

విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. ఎన్.టి.రామారావు గారు, చిరంజీవి గారి దగ్గరి నుండి రాజేంద్రప్రసాద్ గారి వరకు హీరో క్యారెక్టర్ కు తగ్గట్టు ధీటైన ప్రతినాయకుడిగా నటించి కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ అందించారు రావు గోపాల్ రావు గారు. రావు గోపాల్ రావు గారు అంటే మనకు టక్కున గుర్తొచ్చేది ఆయన డైలాగ్ డిక్షన్. మొదట ఇండస్ట్రీలో ఆయన విలక్షణ గొంతు బాగుండదని ఇతరుల చేత డబ్బింగ్ చెప్పించారట. కాని ఏదైతే తన లోపమని పరిగనిస్తున్నారో ఆ లోపాన్నే ఆయన తన ప్రధాన బలంగా మార్చుకున్నారు. “ఇది పనికిరాని గొంతు” అని అన్నవారి చేతే వన్స్ మోర్ అని తన డైలగ్స్ కి చప్పట్లు కొట్టించుకున్న గొప్ప నటుడు. రావు గోపాల్ రావు గారి గురించి ప్రధానంగా చెప్పుకోవలసింది “Improvisation”. కేవలం డైరెక్టర్ చెప్పినట్టు, రచయిత చెప్పినట్టు మాత్రమే కాకుండా Setలో అవసరమైన చోట తనదైన శైళిలో తన క్యారెక్టర్ ను, డైలాగ్స్ లను Improvise చేసేవారు. ఈ ప్రత్యేక లక్షణం మూలంగా కూడ తన పాత్రలపై ఒక బలమైన ముద్రవేశారు.

 

రావు గోపాల్ రావు గారు పోషించిన పాత్రలలో కొన్ని ఎప్పటికి నిలిచిపోయినవి..


గోరంత దీపం

RGR-5

 


కలియుగ రావణాసురుడు

RGR-12

 


అభిలాష

RGR-6

 


యమగోల

RGR-8

 


యముడికి మొగుడు

RGR-9

 


బొబ్బిలి బ్రహ్మన్న

RGR-10

 


ఆ ఒక్కటి అడక్కు

RGR

 


గ్యాంగ్ లీడర్

RGR-11

 


ఛాలెంజ్

RGR-1

 


ఖైదీ

RGR-2

 


భక్త కన్నప్ప

RGR-3

 


ముత్యల ముగ్గు

RGR-4

 

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,