Watched Saaho & Wondering What That Slokam Actually Means ? Read This

Updated on
Watched Saaho & Wondering What That Slokam Actually Means ? Read This

నేను వ్యక్తిగతంగా భగవద్గీత ని ఒక వ్యక్తిత్వ వికాసానికి(personality development) తోడ్పడే గ్రంథంగా భావిస్తాను. భగవద్గీత లో ఉన్న అన్ని అధ్యయాలు చదవక్కర్లేదు. కేవలం 2వ అధ్యాయం సాంఖ్య యోగం చదివిన చాలు, మనలో ఉన్న చాలా సందేహాలకు సమాధానం దొరుకుతుంది.. ఇదే విషయాన్ని టాక్సీవాలా సినిమా లో వచ్చిన శ్లోకం ని వివరిస్తున్నప్పుడు చెప్పాను. Here is the link of that article

ఇలాంటి ఒక శ్లోకము "సాహు" లో కూడా ఉంది...

శ్లోకం స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ । స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ।।

ప్రతిపదార్ధం: స్థితప్రజ్ఞస్య — స్థిరమైన బుద్ది కలవాడు కా — ఏమి? భాషా — మాట్లాడును సమాధి-స్థస్య — తన లక్ష్యం వైపే దృష్టి పెట్టె కేశవ — శ్రీ కృష్ణ, కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా స్థిత-ధీః — జ్ఞాని కిం — ఏమిటి? ప్రభాషేత — మాట్లాడును కిం — ఎలా? ఆసీత — కూర్చుండును వ్రజేత — నడుచును? కిం — ఎలా?

భావం: స్థిత ప్రజ్ఞత (intellectual) కలిగిన వాడి నడవడిక ఎలా ఉంటుంది.. అతను చేసే పనులు ఏంటి? మనం గెలవాలంటే విషయం, వివరం, చేయబోయే పని మీద ఒక అవగాహన, కొంచెం తెలివి, వీటన్నిటితో పాటు సమయానుకూలంగా మన అడుగులు వేయడమే స్థితప్రజ్ఞత్వం. ఒక మనిషి స్థితప్రజ్ఞత్వం కలవాడని ఎలా గుర్తించడం అనే సందేహం అర్జునిడికి వచ్చింది. ఆ సందేహానికి కృష్ణుడు ఇచ్చిన సమాధానం ఇది..

శ్లోకం ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ । ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ।।

ప్రతిపదార్ధం: ప్రజహాతి — త్యజించి (విడిచి పెట్టి) యదా — ఎప్పుడైతే కామాన్ — స్వార్ధ కోరికలు సర్వాన్ — అన్నీ పార్థ — అర్జునుడా,ప్రిథ తనయుడా మనః-గతాన్ — మనస్సు యొక్క ఆత్మని — ఆత్మ యొక్క ఏవ — మాత్రమే ఆత్మనా — పరిశుద్ధ మనస్సు తో తుష్టః — సంతుష్టుడై స్థిత-ప్రజ్ఞః — స్థితప్రజ్ఞుడు తదా — అప్పుడు ఉచ్యతే — అందురు

భావం: మనస్సుని వేధించే అన్నీ స్వార్ధ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను విడిచిపెట్టి, తనకున్న వాటి తో సంతృప్తి పడుతున్నప్పుడు, ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. మనలా ఇంకొకరైతే ఉండరు, మనకున్న ప్రత్యేకత, కళ, గెలుపులు, మనకుంటాయి. వాటిని ఉపయోగించుకుని పైకి రావడమే స్థితప్రజ్ఞత్వం. వేరేవాడి స్థానాన్ని, వేరేవాడి గెలుపు ని, వేరేవాళ్ళ గురించి ఆలోచనలని వదిలేయడమే స్థితప్రజ్ఞత్వం...,

Ee 2 slokaalu chadivaaka naaku ardamayyindi okkate, Neeku nuvve competitor, verevaaditho comparision lu, jealousy assalu workout avvavu nuvvu gelavaalante. Ala nuvvu okaritho compare cheskunna rojunaa neeke telikunda nee life ki villan nuvve aypothaav.

ఈ శ్లోకానికి "సాహొ" సినిమాకి సంబంధం ఏంటని సినిమా చూస్తే అర్దమవుతుంది. కానీ.. సరదాగానో శ్రద్ధ గానో ఓ సారి భగవద్గీత 2వ అధ్యాయం వీలైతే 3వది కూడా చదవండి.. Trust me you will have some peace in your mind and answers to your questions..