టాలెంట్ కు సామాజిక బాధ్యత తోడైనప్పుడు సృష్టించబడే వస్తువుకు గుర్తింపు గౌరవం దక్కుతాయి.. సనత్ కుమార్ గారు ఒక సైకత శిల్పి, తనే మట్టిలోని వెలువడిన ఒక సైకత శిల్పం. చిన్నప్పుడు కొంతమంది స్నేహితులతో "ఇసుకతో జాతీయ నాయకుల శిల్పాలను చెక్కుతానని చెబితే, నీ వల్ల కాదు అని వారు హేళన చేశారట" అప్పుడే నేనేంటో నిరూపించాలని వారిముందే నాయకుల శిల్పాలను అద్భుతంగా రూపొందించారు. ముందు స్నేహితులు మెచ్చుకోవడంతో మొదలైన ప్రశంసలు తర్వాత ఊరు, జిల్లా, రాష్ట్రం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సనత్ గారు బీ ఎస్సి బయోటెక్నాలజీ పూర్తిచేసి ఉద్యోగం చేసుకుంటూ సమాజాన్ని జాగృతం చేసేటువంటి సైకత శిల్పాలను ఒక్కో ఇసుక రేణువుతో నిర్మిస్తున్నారు..
1. నన్ను రక్షించు అని అడుగుతున్నది తల్లి కాదు..
2. గాంధేయ మార్గమే శాంతికి రహదారి