భగవద్గీత మనం తరుచు పెద్దవాళ్ళ చేతిలోనో, లేదా ఎక్కడైనా భగవద్గీత పోటి జరుగుతుంటే వాటి లో పాల్గొనే పిల్లల చేతిలోనో చూస్తుంటాం. కాని ఆ పుస్తకం చదవాల్సింది 20 - 35 age లో ఉన్న మనం. మన లైఫ్ లో చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఒక్కోసారి “ఏంట్రా ఈ లైఫ్?” అని అనిపిస్తుంది. అలా అనిపించిన ప్రతిసారి ఈ పుస్తకం చదివితే మీకు ఒక సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే మది అడిగే ప్రశ్నలకు మతి చెప్పే సమాధానమే భగవద్గీత.
ఈ గ్రంథం లో మొత్తం 18 అధ్యయాలు ఉన్నాయి. మొత్తం చదవలేక పోయిన కనీసం 2వ అధ్యాయం చదివినా చాలు మన జీవితం పై ఒక స్పష్టత వస్తుంది. కనీసం ఆ స్పష్టత తెచ్చుకునే ప్రశాంతత వస్తుంది. రెండవ అధ్యాయం పేరు "సాంఖ్య యోగం". సాంఖ్య అంటే సందేహం. ఈ అధ్యాయం లో అర్జునిడి కి వచ్చే చాలా సందేహాలు మనకు ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటాయి. అందుకని ఈ అధ్యాయాన్ని ఒక సారన్నా చదవాలి. ఆ అధ్యాయం లోని కొన్ని ముఖ్యమైనా శ్లోకాలు ఇవి....
1. టాక్సీవాలా సినిమా మొదట్లో కనిపించే శ్లోకం ఈ అధ్యాయం లోనిది Full article: Click here
2. Live this moment
3.చిన్నదైన, పెద్దదైన, చేసే పని మీద మనమెంత ఇష్టం శ్రద్ధ పెడుతున్నామన్నదే అన్నిటికన్నా ముఖ్యం. అదే Secret of success.
4. గెలుపు ఓటముల కన్నా, వాటివల్ల మనం నేర్చుకునే పాఠం. దొరికే అనుభవం చాలా అవసరం.
5. సాహు సినిమాలో విన్పించే శ్లోకం ఇది Full article : Click here
6. స్థిత ప్రజ్ఞత గురించి వివరించే శ్లోకాలు ఇవి.
7.
8.
9.
10.
11. ఆలోచనలకి అస్సలు అదుపు లేదు. కానీ వాటిని సరైన దారిలో పెట్టగల నేర్పు అయితే మనకి వస్తుంది.
12. కోపం ఆయుధం లాంటిది. అది సరైన మార్గం లో సరైన సమయం లో ఉపయోగించాలి.
13. ఏది మంచి, ఏది చెడు, ఏది ప్రస్తుతం ఏది అప్రస్తుతం వీటికి తేడా తెలిస్తే, అదే గెలుపుని ఏదైనా సాధించగల నేర్పు ని ఇస్తుంది.
14. అహం, అన్ని అపాయలకి ఆరంభం. ఎన్నో బంధాలు అహం వాళ్ళ దెబ్బ తిన్న కథలు ఎన్నో చూసాం మనం.
భగవద్గీత లో ని 2వ అధ్యాయం లోని శ్లోకాలు మాత్రమే ఇవి. ఇప్పుడు మనం ఎదురుకొంటున్న పరిస్థితులకి ఒక అడ్డం లా గైడ్ లా ఉంటుంది ఈ అధ్యాయం. కోర్టు లో భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు ఎందుకంటే భగవద్గీత సత్యాన్ని, జీవన మార్గాన్ని తెలిపే మహాగ్రంథం. భగవద్గీత ని దేవుడు చెప్పే ఉపదేశం లా కాకుండా . గురువు చెప్పే పాఠం లాంటిదనో, స్నేహితుడు చెప్పే సలహానో, తండ్రి చెప్పే సూచననో అనుకొండి . ఆ పుస్తకం లో “నేను” అన్న పదంతో, మీ మనస్సు ని అన్వయించుకోండి. గీత సారం ఇంకా బాగా అర్ధం అవుతుంది.