చిరంజీవి రుద్రవీణ సినిమా చూశారా మీరు..? అందులో ఒక వెనుకబడిన గ్రామంలో పుట్టిన ఒక యువకుడు తను పుట్టి పెరిగిన ఊరిని సొంత కుటుంబంలా భావించి బాగు చేస్తాడు.. ఎవరో బాగా బలిసిన సంపన్నుడు వచ్చి మారుస్తాడులే అని కాకుండా ఆ ఊరిలో ఉన్న బాధలను, ఊరికి శనిలా ఉన్న మనుషులను కూడా ప్రేమతో మార్చిన కథాంశంతో నడిచే గొప్పసినిమా రుద్రవీణ. ఆ రుద్రవీణలోని సూర్యనారాయణ శాస్త్రి(చిరంజీవి) పాత్రలాంటి యువకుడే మన లక్ష్మీనరసింహా. లక్ష్మీ నరసింహా, గ్రామస్తుల కలయికతో అన్ని రంగాలలో భారతదేశంలోనే ఉత్తమ గ్రామాలలో ఒకటిగా యాజలిని ఎలా నిర్మించారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
లక్ష్మీ నరసింహా దాదాపు 45 మంది కుటుంబ సభ్యులున్న ఉమ్మడికుటుంబంలో పుట్టారు. తల్లి కన్నా 110 సంవత్సరాలు బ్రతికిన తాతమ్మ దగ్గర నుండి మంచి వ్యక్తిత్వం నిర్మించుకున్న నరసింహా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 2007లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఓ కంపెనీలో జాబ్ సంపాదించారు. చిన్నప్పటి నుండి కుటుంబం అంటే తన కుటుంబం అని మాత్రమేనని కాకుండా కుటుంబం అంటే తన గ్రామమే నా కుటుంబం అంటూ పెరిగిన నరసింహా ఒక సంఘటనతో తన ఊరుని మార్చాలన్న బలమైన సంకల్పాన్ని ఏర్పరుచుకున్నారు.. "కొన్ని నెలల కాలంలో అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు వేరు వేరు Accidents లో చనిపోయారు అదికూడా Drunk & Drive చేస్తున్నప్పుడు".. వారి తల్లిదండ్రల గుండె పగిలే రోదనలను ప్రత్యేక్షంగా చూసిన నరసింహా "యాజలి నా జన్మభూమి"(Yazali Naa Janma Bhoomi) అనే స్వచ్చంధ సంస్థను ప్రారంభించి గ్రామన్నంతటిని మార్చి ప్రతి రంగంలో ఊరిని ది బెస్ట్ గా ఉంచాలని కష్టపడటం మొదలుపెట్టారు..
మొట్టమొదటి కార్యక్రమంగా NG Ranga Agricultural University సహకారంతో గ్రామంలో రోడ్డుకిరువైపులా 2500 చెట్లు నాటారు. ఏదైనా మంచి పనిచేద్దాంరా రండిరా అంటే ఒక్కడు రాడు కాని చెడు చేయడానికి ముందుంటారు.. ఇలాగే లక్ష్మి నరసింహాకు ఎక్కడ మంచిపేరు వస్తుందన్న భయంతో నాటిన చెట్లను కొంతమంది పీకేశారు, అది తెలిసిన నరసింహా వారింటికి వెళ్ళి గొడవ పెట్టుకోకుండా ప్రేమగా పలుకరించి వారిని మార్చి "మీ సహకారం కూడా ఊరికి కావాలి" అంటూ చెడు చేసినవారిని కూడా కలుపుకుని చెట్లు నాటించారు. తర్వాతి కార్యక్రమంగా రైతుల సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు.. గవర్నమెంట్ సహకారంతో 2కోట్ల రూపాయల ఆర్ధిక సహకారంతో దాదాపు 350 ఎకారాల వ్యవసాయ భూమికి అవసరమైన Lift Irrigation సదుపాయాలను ఏర్పాటుచేసి సంవత్సరానికి మూడు పంటలు పండేలా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు.
ప్రభుత్వ పాఠశాల: కూలిపని చేసే పేదవారు కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్ లో చేర్పించే రోజులివి. Infrastructure గొప్పగా లేని గవర్నమెంట్ స్కూల్ లో తెలిసి తెలిసి తమ పిల్లలను చేర్పించడానికి ఎవ్వరు సాహసించడంలేదు, యాజలిలో కూడా అదే పరిస్థితి. 50 విద్యార్ధులకు పడిపోయిన ఆ స్కూల్ లో ఇప్పుడు 500 విద్యార్ధులు చదువుతున్నారు. 10ఎకరాలకు పైగా ఉన్న ఈ పాఠశాలలో డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ లాబ్, సైన్స్ ల్యాబ్ Etc ఇలా ఇక్కడ లేని Facility అంటూ ఏది లేదు. ఇక్కడి విద్యార్ధులు కూడా అత్యుత్తమంగా చదువుతారు. ప్రతి సంవత్సరం ఐఐటికి ఇద్దరు చొప్పున ఎంపిక అవుతారంటేనే అర్ధం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు వివిధ ప్రైవేట్ స్కూల్ విద్యార్ధులు వచ్చి అన్ని విషయాలను నేర్చుకుంటారు. గేమ్స్, భరతనాట్యం, కూచిపూడి వంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ఈ విద్యార్ధులు ముందుంటారు. ఈ ప్రభుత్వ పాఠశాల దేశంలోనే గొప్ప ప్రభుత్వ పాఠశాలలో ఒకటిగా గుర్తించబడినది. మన మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం గారు ఈ పాఠశాల అవలంభిస్తున్న పద్దతులను చూసి ఇక్కడికి రావాలనుకున్నారు కాని ఆలోపే స్వర్గస్తులయ్యారు. ఇంతటి పేరు ప్రఖ్యాతలు ఈ బడికి రావడానికి ప్రధాన కారణం లక్ష్మి నరసింహా ఐతే మరొక కారణం నాగరాజు గారు వీరిద్దరు ఈ స్కూల్ లో చదువుకున్నవారే. వీరిద్దరూ కలిసి ఈ స్కూల్ ని ఇంతలా అభివృద్ధి పరిచారు.
ఇంతేకాకుండా వృద్దులకోసం లక్షల రూపాయలతో ఓల్డ్ ఏజ్ హోం, ఇంకా గ్రామంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలను ఒక పద్దతిగా పుర్తిచేస్తున్నారు.. ఇలా ప్రతి రంగంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దిన లక్ష్మీనరసింహా ప్రస్తుత ధ్యేయం "యాజలి గ్రామానికి ఒక బ్రాండ్ తీసుకురావడం". యాజలిలో పండించే పంటకు, వస్తువులకు ఒక గుర్తింపు రావాలి. యాజలి లోగో ఉన్న వస్తువులను, ఆహార పదార్ధాలను చూడగానే ప్రజలందరికి ఒక నమ్మకం కలగాలి అన్నదే నరసింహా లక్ష్యం, ప్రస్తుతం వీటి మీద విశేషంగా కృషిచేస్తున్న లక్ష్మీనరసింహాకు ఆల్ ది వెరీ బెస్ట్.. నిజంగా ఇలాంటి యువకుడు గ్రామానికి ఒక్కడు ఉన్న దేశం ఎంతో బాగుపడుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.