Contributed by Rama Bala Pillalamarri
ప్రేమ ని అందరు అందం అయిన, ఆకర్షణీయం అయిన, లేదా మంచి వాటితో నే పోలుస్తారు. అది ఎంత వరకు నిజం...?
పౌర్ణమి చంద్రడు ప్రేమ అయితే... అమావాస్య ఏంటి.. ఆకాశం లో హరివిల్లు ప్రేమ అయితే... మెరుపులు ఏంటి.. జంట చిలుకలు ప్రేమ అయితే... జంట కాకులు ఏంటి.. చల్లటి గాలి ప్రేమ అయితే... ఎడారిలో గాలి ఏంటి..
గల గల పారె నది ప్రేమ అయితే...అడుగు అంటిన బావి ఏంటి.. నిప్పు ప్రేమ అయితే.. మంచు ఏంటి.. పువ్వు ప్రేమ అయితే..పండ్లు ఏంటి.. ఆనందం ప్రేమ అయితే.. బాధ ఏంటి..
ప్రేమ వరం అయితే.. ఏది శాపం.. అస్సలు... ప్రేమ అంటే ఏంటి..?
అందంగా ఉన్నందుకే ప్రేమించడం ప్రేమా...? మనకి నచ్చినట్లుగా మారచడం ప్రేమా..? స్వేచ్ఛ ని తీసెయ్యడం ప్రేమా..? ఆదేశించడం ప్రేమా..?
ఇవ్వని కానే కాదు...
అర్ధం చేసుకోవడం ప్రేమ.. తోడుగా నిలవడం ప్రేమ.. ఏది ఆశించక పోవడం ప్రేమ... సుఖ దుఃఖాలు ని పంచుకోవడం ప్రేమ.. బాధ్యతగా ఉండటం ప్రేమ... మంచి, చెడు రెండిటిని అంగీకరించడం ప్రేమ...
ప్రేమ సముద్రం లో కెరటాలు లాగా.. సంతోషాలు లో ఎక్కువ కనిపిస్తది... కష్ఠాలు లో తక్కువ గా... కానీ, సముద్రం అడుగున కదలిక లేకుండా ఎలా అయితే నిశ్శబ్దంగా గంబిరంగా ఉంటదో... అలా మార్చడమే ప్రేమ..
Love unconditionally….ప్రేమ ప్రాప్తిరస్తు..!