A Tribute To PV Narasimha Rao, The Man Who Changed The Face Of India’s Economy!

 

అది 1991వ స౦వత్సర౦. స్వాత౦త్ర్య౦ వచ్చిన తరువాత తొలిసారి దేశ౦ సందిద్దావస్థ లో ఉన్న సమయం.సంక్షోభానికి అడుగు దూరం లో ఉన్న అత్యంత కిష్ట సమయం.
రాజీవ్ గాంధీ మరణం,నాయకత్వ లేమితో సతమతమవుతున్న పరిస్థితి..
ఒక పక్క గల్ఫ్ యుద్ధం తో పెరిగిన ద్రవ్యోల్పణం .
పెద్ద దిక్కు అనుకున్న సోవియెట్ యూనియన్ ముక్కలు అయిపోవడం…
మరోపక్క అమెరికా నుండి లభించని సహకార౦..
పడిపోతున్న రూపాయి విలువ ….క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితి …… ఒక దశలో దేశం దివాళా తెస్తుందేమో అనే అనుమానం
పైగా బలం లేని ప్రభుత్వం ….. ఇంతటి సంక్షోభ పరిస్థితి నుండి దేశాన్ని ఒడ్డుకు చేర్చి ..
అగ్ర రాజ్యలు సైతం మన వైపు చూసేలా……….
మేధావులు కూడా ఔరా అని అనుకునేలా సంస్కరణలు చేపట్టి ఇప్పుడు మన అనుభవిస్తున్న ఈ గ్లోబలైసెషన్ కి నాంది వేసి అస్తిత్వం కొరకు పోరాడే స్థాయి నుండి మనమే ఒకరికి ఆపన్న హస్తం అందించే స్థితి కి చేర్చింది ఒక్కడు
కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థను మారుతున్న ప్రపంచానికి దీటుగా నిలబెట్టిన ఒకే ఒక్కడు
ఆ ఒక్కడు మన తెలుగు వాడు మన పాములపర్తి వెంకట నరసింహారావు

Prime Minster PV Narasimha Rao with Sonia Gandhi at Hyderabad house. Express archive photo


 

5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఏకైక నెహ్రూ కుటుంబం కి చెందని వ్యక్తి పీవీ నరసింహారావు . మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థవతంగా నడిపిన రాజకీయ చతురత ఆయనది

సంక్షోభంతో దివాళా తీయాల్సిన దేశాన్ని ఆర్థికం గా నిలదొక్కుకునేలా చేసిన మేధావి
ప్రస్తుతం మనం అనుభవిస్తున్న Liberalization, Privatization, Globalization ని భారత దేశానికి పరిచయం చేసింది ఆయనే
Economic Reforms ప్రవేశపెట్టి అప్పటి వరకు ఉన్న బ్రష్టు పట్టిన వ్యవస్థ బూజు దులిపి సంస్కరణలు చేప్పట్టిన అభి నవ భారత ఆర్థిక సిద్ధాంతకర్త


 

దేశ రక్షణ వ్యవస్థ ని పటిష్టం చేసి అణు పరిశోధనా రంగం లో భారత్ ఏమాత్రం తక్కువ కాదు అని ప్రపంచానికి తెలిపిన వ్యక్తి
ఇప్పుడు మన దేశంతో ప్రపంచ దేశాలు సఖ్యంగా , స్నేహంగా ఉన్నాయి అంటే అందుకు ఆయన తీసుకున్న విదేశీ విధానాలే కారణం
సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధాని పదవి చేపట్టి తన పరిపాలన దక్షతతో ఆ పదవికే వన్నె తెచ్చారు
రాజకీయం లో అపార చాణక్యుడు ……. ఎత్తుగడలు వేయడంలో తనకి తానే సాటి ఆ రాజకీయ చతురత తోనే పద్మవ్యూహం లాంటి దేశ రాజకీయాలని సమర్థంగా ఎదుర్కొని మైనారిటీ ప్రభుత్వం తో ఐదేళ్లు సమర్ధవంతమైన పాలన అందించారు


 

ఒక్క రాజకీయ రంగం లోనే కాదు ఆయన ఏ రంగం లో అయినా నిష్ణాతుడే
17 భాషలు అనర్గళం గా మాట్లాడగల బహుభాషా సంపన్నుడు . మహాగ్రంధాల అనువాదాలు, ఎన్నో కవితలు ,రచనలు చేసిన సాహితీవేత్త

ఎక్కడో వంగర గ్రామం లో పుట్టి నుండి ఢిల్లీ లో ప్రధాని పీఠ౦ ఎక్కిన సామాన్యుడు
తెలుగువాడి కీర్తిని ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసి
మనం అందరం మరచిపోయిన మన వాడు
మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సిన మహానుభావుడు

PD/DSG/August, 1985, 30/A63(17)The Defence Minister, Shri P.V. Narasimha Rao calling on the president of Tanzania His Excellency Mr. Mwalimu Julius K. Nyerere at Rashtrapati Bhavan New Delhi on August 26, 1985.


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,