This Guy's Anguish At The Way The Telugu Language Is Being Misused Today Will Move You

Updated on
This Guy's Anguish At The Way The Telugu Language Is Being Misused Today Will Move You

ఈ article చదివేవారు ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే " ఇది జస్ట్ ఒక Article కాదు. అందరూ ఆలోచించవలసిన విషయం. ఇది నా సొంత అభిప్రాయం మీద వ్రాసినా, ఇది మాత్రం నిజమ్" అని.

మనందరం పొద్దున్నే లేస్తూ అనేమాట "రామ రామ" కంటే "ఛీ దీనమ్మ జీవితం" అనే పదమే చాల ప్రసిద్ధిచెందింది. ఆ ఒక పదమే కాదు ఇంకా "అమ్మ" అనే అందమైన పదం లో ఒకటి-రెండు అక్షరాలు కలిపి వాటిని మన కోపం తీర్చుకోవడానికి వాడుతుంటాం. For example ఒక అక్షరం 'నా' కలిపితే నానమ్మ అవుతుంది. మరి 'నీ' కలిపితే? అదేంటో వాడే ఉంటారు చాలామంది. అసలెందుకు ఈ పదాలు వాడుతున్నాం? కారణం- మన చిన్న కోపం తీర్చేసుకోవడానికి! అంతే కదా! ఆ పదాలు వాడితే కోపం తీరిపోతుందా అంటే అదీ లేదు. నిక్కచ్చి గా చెప్పాలంటే కోపం తీరిందని ఒక satisfaction మాత్రం ఆ పదం వాడటం లో ఉంది.

చిన్నప్పుడు మనకి కొన్ని నెలలు ఉన్నప్పుడు అమ్మ వచ్చి 'అ' అంటే 'అమ్మ', 'ఆ' అంటే 'ఆవు' అని అందమైన, సరళమైన పదాలు నేర్పిస్తుంది. గురువులా పాఠాలు నేర్పించడమే కాదు, ఒక responsibility తో మన వెన్నంటే ఉంటుంది అది కష్టం ఐనా, ఇష్టం ఐనా ! అందుకేనేమో సృష్ఠి లో ఎన్ని మంత్రాలున్నా "మాతృదేవోభవ" కన్నా ఖ్యాతికెక్కింది మరొకటి కనిపించదు. ఆ స్వరూపాన్ని మనం ప్రేమతో పిలిచే పదం "అమ్మ" అని.

పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనిషి తనని తానూ నిర్మించుకుంటాడు. అలాగే "బూతులు" అనే పదాలని కూడా! కొన్ని పదాలు వింటుంటే మనసు కొంచెం బాధగా అనిపిస్తుంటుంది. చెప్పాలంటే చాలా బాధేస్తుంటుంది. కొన్ని English పదాలు చెప్తాను మీకు అర్ధం కావడం కోసం. s/o bitch , Bloody Slut , Fuck off ఇలాంటి కోవలోకి వచ్చేవి. మన దేశంలో అన్ని మతాల వారు స్త్రీలని ఎంతో గౌరవం తో మాతృమూర్తి గా భావిస్తారు. పైన చెప్పిన పదాలు తెలుగు లో అనువదిస్తే ఎంత అగౌరవం గా అనిపిస్తాయో!

ఈ రోజుల్లో చదువుకునే చాలా మంది students కేవలం విద్యని మాత్రమే నేర్చుకుంటున్నారు and సంస్కారాన్ని వదిలేస్తున్నారు. Hostels లోనూ, బయటా ఈ పదాలని ఊత పదాలు గా వాడేస్తున్నారు . ఇంటికి వచ్చాకా వాళ్ళ అమ్మగారితో ఏంటో ప్రేమ గా మాట్లాడతారు. కానీ ఎవడికి కావాలి ఆ ప్రేమ ? ప్రేమ ఎవరికైనా ఇచ్చేటప్పుడు దాని విలువ తెలియాలి కదా ! వీరు hostels లో చేసే comments girls' hostel లో ఉన్న అమ్మాయికి చేరలేకపోవచ్చు . కానీ బయట మీలాంటి వాళ్ళే మీ చెల్లి ని అంటే మీరు ఊరుకుంటారా?

నేను starting లో చెప్పిన పదాలూ, ఇప్పుడు చెప్పినవీ ఎక్కడ నుండి పురుడుపోసుకున్నాయి ? ఏ భాష లోనివి ? తెలుగు అనే అక్షరాలా అందమైన భాష లోనివే కదా! తెలుగు అనే మధురమైన భాష లో కర్కశమైన ఆ బూతు పదాలు తయారయ్యాయి. మన లాంటి వారికీ తెలుగు భాష లో ఉన్న కవులు, సంస్కర్తల గురించి 10% కూడా సరిగ్గా తెలీదు to be frank. కానీ మన తాతల కాలం లో ఎంతమంది దీనికి అభిషేకం చేశారో తెలుసా? మనలా సరదాకి friends ముందు బూతు పదాలని jokes గా శ్రీశ్రీ గారు వేసుంటే, విప్లవ భావాలు మనకి అందేవా ? నన్నయ గారి తెలుగు భారతం, పోతన గారి భాగవతం గురించి technical era లో ఉన్న మనలాంటి చాలా మందికి అస్సలు తెలియనే తెలీదు. గురజాడ, విశ్వనాధ సత్యనారాయణ గార్లు చేసిన కృషి దేని గురించి ? ఇలాంటి నీచమైన పదాలు వాడటానికా ? College లో కోపం తో hostel కి వచ్చి lecturer ని బూతులు తిట్టడానికా ? మీరు తిట్టేస్కున్నంటా మాత్రమున వారికి ఏమి అయిపోదు కదా . May be ఆ పదాల వల్ల మీ కోపం చల్లారింది అని అనుకుంటుంటారు. అంతే కదా !

మీలో అందరూ stylish గా English మాటాడుతుంటారు. కొంతమంది GRE వ్రాసేవాళ్లయితే ఇంక ఏ America , UK లో పుట్టినట్టు ఊహించేస్కుంటారు. మనలో ఎంతమందికి ఒక Britisher C.P. Brown గురించి తెలుసు? ఎంతమందికి తను తెలుగు లో వ్యాసాలు, నాటికలు వ్రాసాడని తెలుసు ? ఈరోజుల్లో Engineering చదువుతున్న ఏ ఒక్కరిని పిలిచి అడిగినా ఒక్క వేమన పద్యం ఐనా చెప్తారా ?ఈ C.P. Brown గారు ఎన్నో కనిపించకుండా పోయిన వేమన పద్యాలన్నింటిని వెదికి తీసి ఒక "వేమన పద్య రత్నాకరం" అనే గ్రంథాన్నీ అందించారు.

నేను ఈ article ద్వారా చెప్పదలచుకుంది ఏమిటీ అంటే తెలుగు ని ఆదరించకపోయినా ఫర్వాలేదు. కానీ తెలుగు భాషనీ, ఒక స్త్రీ నీ తక్కువచేసినట్టు గా ఉండేమాటలు మాత్రం మాట్లాడకండి. దీనివల్ల మన తల్లిని మనమే అవమాన పరిచినట్లు అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి!!!