Contributed By Hari Atthaluri
నిద్ర లేస్తే టీ... నిద్ర వస్తే టీ...
నలుగురు వస్తే టీ.. నలుగురు కలిస్తే టీ..
మత్తు గా అనిపిస్తే టీ.. ఏదైనా మొదలు పెట్టే ముందు టీ...
కొంతమందికి టైమ్ నాలుగు ఐతే టీ... ఇంకొంత మందికి టైమ్ తో సంబంధం లేనిది టీ....
తలనొప్పి కి ఓ టీ... థింక్ చేయటానికి ఓ టీ.. Thanks చెప్పటానికి ఇంకో టీ..
Lazy గా అనిపిస్తే ఓ టీ... లేట్ నైట్ ఉండాలి అనుకుంటే ఓ టీ.. లైట్ గా breakfast చేశాక ఇంకో టీ..
అలసిపోతే ఓ టీ.. అమ్మాయి తో మాట్లాడటానికి ఓ టీ..
Boss మీద కోపం తో ఓ టీ... మనసు బాగోకపోతే ఓ టీ...
మన అనుకున్న వాళ్ళు కలిస్తే ఓ టీ... మన వాళ్ళలా మార్చేసేది ఓ టీ...
పరిచయాలు పెంచేది టీ.. పంచాయతీలకి కావాల్సింది టీ...
డిస్కషన్ కి ఓ టీ... డిస్కషన్ ఐపోయాక ఇంకో టీ...
Frustration కి ఓ టీ... Satisfaction కి ఇంకో టీ...
Work చేయటానికి ఓ టీ... ఆ work ఐపోయాక ఇంకో టీ...
కూల్ గా ఉంటే ఓ టీ... కూల్ చేయటానికి ఇంకో టీ...
మాటలు కలిపేది టీ.. మొహమాటాలు పోగొట్టేది టీ...
భాష తో సంబంధం లేనిది టీ... బాధలో కూడా తోడు ఉండేది టీ..
Climate తో సంబంధం లేనిది టీ.. Complicated వాటికి కూడా solution ఇచ్చేది టీ..
Purse లో చిల్లర పైసలు కి కూడా వచ్చేది టీ.. Purpose అంటూ ఏం లేకపోయినా పక్కా తాగాలి అనిపించేది టీ..
నాటి నుంచి నేటి వరకు మారంది టీ... మన మూడ్ ని instant గా మార్చేది టీ...