ప్రస్తుతం చుట్టూ ఉన్న సమాజం, కుటుంబ పరిస్థితులు ఒక చిన్న పిల్ల కోణం లో - A Short Story

Updated on
ప్రస్తుతం చుట్టూ ఉన్న సమాజం, కుటుంబ పరిస్థితులు ఒక చిన్న పిల్ల కోణం లో  - A Short Story

Contributed by Bharadwaj Godavarthi

Hi, నా పేరు సంస్కృతి, ఇదే మా స్కూల్, నేను ఇప్పుడు '4th' క్లాస్ చదువుతున్నాను. ఇవాళ నాకు చాలా 'Special Day'! ఏంటో చెప్పండి చూద్దాం?

Friend: "Many Happy Returns Of The Day 'SAMSKRUTHI' ". సంస్కృతి: Thank you ? "NO, You are wrong"!! ఏంటీ, ఈ రోజు 'నా' 'Birth Day' కాబట్టి నాకు స్పెషల్ అనుకుంటున్నారా? కాదు! ఈ రోజు మా 'నాన్నే' నన్ను స్కూల్ నుండి ఇంటికి తీసుకువెళ్తున్నారు. నేను స్కూల్ జాయిన్ అయ్యాక, ఇది ఫస్ట్ టైం తెలుసా!! అందుకే ఈ రోజు నాకు చాలా స్పెషల్! ఇంకో విషయం తెలుసా? మా నాన్న ఈరోజు 'నా' కోసం "Home Work" చేస్తున్నారు.

నాన్న(Conversation on SKYPE): "Ya David, I am 'Working from Home' today. Yes I will be available 24*7 on Skype. Please don't hesitate to make a call if anything needed on priority" నాన్న,నాన్న???(Samskruthi shouting loudly) అదిగో, మా నాన్న వచ్చేసారు. సరే మరి, సాయంత్రం మళ్ళీ నా birthday ఫంక్షన్లో కలుద్దాం. BYE. అయ్యో, మర్చిపోయా, మీకో surprising విషయం చెప్పనా ? ఈ రోజు నాన్నతో పాటు అమ్మ కూడా వచ్చింది. తను కూడా 'HOME WORK' ఈ రోజు .

అమ్మ(Conversation on SKYPE): "Ya Dileep, I am 'Working from Home' today. Yes I will be available 24*7 on Skype. Please don't hesitate to make a call if anything needed on priority".

ఈపాటికే అర్ధమైపోయిందిగా, 'అమ్మ,' 'నాన్న' ఇద్దరు 'software engineers'. ఎప్పుడూ Busyyyyyyyy. ఎంత 'BUSY' అంటే 'డిన్నర్ ' చేసేటప్పుడు కూడా 'HOME WORK' చేస్తూ ఉంటారు. ఏంటో, నేను సంవత్సరానికి ఒక రోజు 'సివిల్ డ్రెస్' వేసుకొని స్కూల్కి వెళితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను??. కానీ, 'నాన్న', 'అమ్మ' రోజు సివిల్ డ్రెస్ వేసుకున్నా, ఎప్పుడూ డల్ గానే ఆఫీసుకి వెళ్తారు?!!

'అప్పుడప్పుడూ' మా 'తాతయ్య' నన్ను పిలిచి, "సంస్కృతీ, నువ్వు కూడా 'అమ్మ, నాన్న' లాగా బాగా చదువుకొని పెద్ద software ఇంజనీర్ కావాలి". అని అంటూ ఉంటారు! వామ్మో, 'Software Engineer' అవ్వాలా? అంటే జాబ్ చేస్తున్నపుడు కూడా మళ్ళీ 'Home Work' చేయాలా? 'నా వాళ్ళ కాదు'!! నేను ఇలానే చిన్న పిల్లలా ఉండిపోతే బాగుండు.

Time: 6:30 PM Location: సంస్కృతి ఇల్లు? "Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to you dear Samskruthi, Happy Birthday to you. ???????" "'అమ్మ', 'నాన్న' నాకు ఫస్ట్ cake తినిపించారు, అందరూ ఈ రోజు నన్నుస్పెషల్ గా చూస్తున్నారు, 'Like a Princess'?. ఆ చప్పట్లు, నవ్వులు, అందరూ 'Birthday Girl' అని pamper చేయడం, బలే గడుస్తోంది ఈ evening . కానీ ఎక్కడో ఏదో భయం ఈ రోజుకు మాత్రమే ఇవన్నీ పరిమితమా??

గెస్ట్(Nanna Friend): 'సంస్కృతి', బావున్నావా నాన్న? ఏంట్రా ఇంత నల్లగా అయిపోయావ్?? ఏమి సమాధానం చెప్పాలి ఇప్పుడు? పెయింటింగ్ క్లాసులో మా టీచర్ 'రంగులు' వేసేటప్పుడు అన్ని రంగులు ఇచ్చి వేయమనేవారు. ఎప్పుడూ నలుపు మంచిది కాదు అని చెప్పలేదు, అయినా టీచర్ ఎప్పుడూ మంచిది కానిది స్టూడెంట్స్ కి ఇవ్వరు కదా!! మరి ఎందుకు అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, బాబాయ్, అంకుల్, ఇలా అందరూ నన్ను ఎప్పుడైనా, ఎక్కడైనా కలిస్తే మొదటిగా అడిగే ప్రశ్న "ఏంటి సంస్కృతి, ఇలా నల్ల పడిపోయావ్"?? అంటే నలుపు మంచి రంగు కాదా???

గెస్ట్2(Amma Friend): హలో సర్, ఎలా ఉన్నారు? నాన్న: బావున్నాను! మీరు ఎలా ఉన్నారు? గెస్ట్: బావున్నాను. ఇంకేంటి సర్ అమ్మాయి ఇప్పుడేం క్లాస్? నాన్న: 4th క్లాస్ అండి!! గెస్ట్: Oh Very Good. మా అబ్బాయి కౌశిక్ కూడా పాప చదువుతున్న స్కూల్లోనే చదువుతున్నాడు. కౌశిక్ చెప్పాడు పాప కొంచం స్టడీస్ లో డల్ అంట కదా?? నాన్న: అంటే బానే చదువుతుంది అండి, కాకపోతే Topper కాదు, అంతే!! గెస్ట్: అదేంటి అండి, అంతే అని అలా వదిలేస్తున్నారు, See Kaushik he always tops the class?. ఈ కాలంలో averageగా ఉంటె కుదరదు. Competitive world, we should be extremely careful about our children education. ఈ అంకుల్ ఎప్పుడూ ఇంతే? !! ఇంటికి వచ్చినప్పుడల్లా మా అబ్బాయి బాగా చదువుతాడు, మా అబ్బాయి బాగా ఆడుతాడు, మా అబ్బాయే బెస్ట్, ఎలా పెంచాలో నన్ను చూసి నేర్చుకోండి అని చెప్తూవుంటారు. వాళ్ళ అబ్బాయి పేరు కౌశిక్, నాకు తెలుసు, చాలా బాగా చదువుతాడు, కానీ ఎప్పుడూ, 'చేసినా, చేయకపోయినా' పరిస్థితినిబట్టి గొప్పలు చెప్తూ ఉంటాడు(ఉట్టి గొప్పలు), వాళ్ళ నాన్నలాగా. అవి గొప్పలని అందరికీ తెలుసు కానీ ఎవ్వరు మాట్లాడారు. మా టీచర్ ఎప్పుడూ అంటుంటారు, మనం ఒక విషయంలో నిజంగా బెస్ట్ అయితే అది మనం చెప్పుకోవాల్సిన అవసరంలేదు అని. ఆటోమెటికగా పక్కనవాళ్ళకి అర్ధమయిపోతుందిట. ఇంకో విషయం కూడా చెప్తారు? మనకి ఇది రాదు అని ఒప్పుకొటంలో చాలా గొప్పదనం ఉంది అంట!!అలా అని వదిలేయకూడదు, రాని విషయాన్నీ కష్టపడి నేర్చుకోవాలి. ఇలా ఆలోచిస్తూ అటుగా వచ్చిన కౌశికతో నాకొచ్చిన గిఫ్ట్స్ చూపిస్తూ ఆడుకుంటున్నాం అది చూసిన నాన్న??

నాన్న: సంస్కృతి(Shouting Loudly), ఎప్పుడూ ఆటలేనా, ఈ రోజు నీ birthday కాబట్టి వదిలేస్తున్నాను, రేపటినుండి నిన్ను కౌశిక్ చదువుతున్న ట్యూషన్లో జాయిన్ చేస్తున్నాను. నువ్వు కూడా తనలానే ఫస్ట్ 5 ranksలో ఉండాలి. ఏంటో నాన్న, ఎప్పుడూ ఎవరు ఏమి చెప్పినానన్ను ఏదోకటి అంటూ ఉంటారు!! కొన్నిసార్లు, నీకు ఫస్ట్ రాంక్ రాకపోతే వాతలు పెట్టేస్తా అంటారు!! కొన్నిసార్లు, మార్కులే కాదు సంస్కృతి, అన్నిట్లోనూ నువ్వు చురుకుగా ఉండాలి అంటారు!!! కొన్నిసార్లు, అడ్డపిల్లవి నువ్వు సంస్కృతి, గుర్తుంచుకో, ఇలా ఏవిపడితే అవి ఆడకూడదు అంటారు!!!!

నాకర్ధంకాని విషయం ఏంటీ అంటే?? నాన్న అంత చదువుకున్నారు, చదువుకునే రోజులలో నాన్న ఎప్పుడూ ఫస్ట్ అని చెప్పేవారు. మంచి ఉద్యోగం వచ్చింది. కానీ నాన్న రోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక "అబ్బా ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాను, చచ్చే చావొచ్చింది" అంటారు? దానికితోడు రోజు ఆ "home work" ఒకటి, సండే రోజు కూడా!!అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది "రేపు బాగా చదువుకొని ఉద్యోగం వచ్చాక నా పరిస్థితి కూడా ఇంతేనా అని??

ఎందుకో ఇలా ఆలోచిస్తూ నా మోహంలో ఉన్న ఆనందంపోయింది. అమ్మమ్మ: ఏంటే సంస్కృతి, ఆలా కూర్చున్నావ్?? సంస్కృతి: ఏమి లేదు అమ్మమ్మ!! అమ్మమ్మ: పుట్టినరోజు నాడు అలా మొహం ముడుచుకొని ఎవరైనా కూర్చుంటారా??పిచ్చిది ఎక్కడో??చింటూ చూడు అందరితో ఎలా కలిసిపోతాడో, అందరితో కలిసిపోవాలి తల్లీ.

"చింటూ, మా మామయ్య వాళ్ళ అబ్బాయ్, మా అమ్మమ్మకు ఎప్పుడూ వాడంటేనే ఇష్టం. అందుకే కాబోలు ఎప్పుడూ నన్ను వాడివైపు చూపించి 'వాడిలా కలిసిపోవాలి, వాడిలా మాట్లాడాలి, వాడిలా గెంతాలి అంటుంది'!! వాడిలా బ్రతకడానికి వాడున్నాడు కదా, నేనేందుకు వాడిలా ప్రవర్తిస్తా. ఈలోపల మా అమ్మమ్మ వచ్చి నన్ను గట్టిగా పైకి రమ్మని లాగింది!!

అమ్మమ్మ: సంస్కృతి రావే, అందరూ నీకోసమే చూస్తున్నారు. సంస్కృతి: నేను రాను, నువ్వు పో!! అమ్మ: యాయ్ సంస్కృతి, అమ్మమ్మని నువ్వు అని పిలవచ్చా, నీకన్నా పెద్దవాళ్ళని ఎప్పుడూ నువ్వు అని పిలవకూడదు, సారీ చెప్పు. సంస్కృతి: సారీ

బోడి సారీ, అమ్మ నాకేమో ఇలా చెప్తుంది. తను మాత్రం తనకన్నా వయసులో పెద్దవారైన మా పనిమనిషిని, ఇస్త్రీ అతనిని, డ్రైవర్ని నువ్వు అని పిలుస్తుంది. మరిపెద్దవాలైన అందరినీ మీరు అనే పిలవాలి కదా??. అంతెందుకు మా నాన్నని కూడా చాలా సార్లు నువ్వు అనే పిలుస్తుంది. తనకన్నా వయసులో 10 ఇయర్స్ నాన్నపెద్ద తెలుసా మీకు.

ఏంటో అందరు నన్ను వాళ్ళలా వుండూ, వీళ్ళలావుండూ అంటారు, అమ్మ నాన్న కూడా ఎప్పుడూ నన్ను ఎవరోఒకరితో పోలుస్తుంటారు. నాకేమో నాకు నచ్చినట్టు ఉండాలనిపిస్తుంది??. ఇలా ఆలోచిస్తూ ఉండగా నా giftని ఆ చింటుగాడు లాకొనిపోయాడు. నాకు కోపం వచ్చి ఒక్కటిచ్చాను. దూరం నుండి గమనిస్తున్న నాన్న నన్ను ఒక్కటి కొట్టి.

నాన్న: అలా కొట్టచ్చా చింటూని, నీకన్నా చిన్నోడు కదా, సారీ చెప్పు. సంస్కృతి: సారీ ఇవాళ నా birthday కదా, కొట్టచ్చా నన్ను. చింటూ లాకుంటే కోపం వచ్చింది, అయినా మీకు తెలుసా 'అమ్మని నాన్న అప్పుడప్పుడు కొడుతుంటారు, ఇప్పుడేమో నాకొచ్చి చెప్తున్నారు పెద్ద good boyలా'. ఇద్దరూఎప్పుడూ నా ముందు బాగా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అప్పుడుడప్పుడు అమ్మ, నాన్న 'Bad Words ' కూడా వాడతారు. నేను మధ్యలో ఆపితే నన్ను తిడతారు!! కాసేపాగి తలుపు మూసేసుకుంటారు? పొద్దునొచ్చి నాన్న "అమ్మకి నేను సారీ చెప్పారా రాత్రి గదిలో అంటారు". అదేదో నాముందే చెప్పచ్చుగా.?? ఫ్రెండ్: సంస్కృతి, ఆడుకుందామా?? సంస్కృతి: ఏం ఆట?? ఫ్రెండ్: అందరూ తలొక కధ చెప్పాలి. కధ, నాకు కధలు చెప్పడం రాదే, 'నాన్న కానీ', 'అమ్మ కానీ', నాకు ఎప్పుడూ కధలు చెప్పలేదు!! ఎప్పుడూ homework చేస్తూనే ఉంటారు!! ఎప్పుడైనా కధ చెప్పమని అడిగితే youtubeలో ఎవరో నాన్న ఒక చిన్నపాపకి కధ చెప్పే వీడియో పెట్టి ఇస్తారు. వాళ్ళు చెప్పేది కధే, కానీ నాన్న నన్ను దెగ్గరకు తీసుకోని కధ చెప్తే బాగుండు అనిపిస్తుంది. అమ్మ దెగ్గరికి తీసుకోని అన్నం తినిపిస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడు BUSYYYYYYYYYY. 'Birthday Celebrations' అయిపోయాయి, అందరూ ఇంటికి వెళ్లిపోయారు, అమ్మ, నాన్న, homework చేసేసుకుంటున్నారు. ' 'David', 'Dileep' Are you able to see my screen? Do you able to hear my screen? Sorry, I am speaking on mute? వాళ్లిదరు అలా బిజీగా ఉన్నపుడు, నేనొక్కదానినే, నా రూమ్ లో పడుకున్నా, రేపటిగురించి ఆలోచిస్తూ!! రేపు, నన్ను ఎవరూ నల్ల పడ్డావ్ ఏంటీ? అని అడగకుండా ఉంటే బాగుండు, రేపు, నన్ను ఎవరితోనూ పోల్చకుండా ఉంటే బాగుండు, రేపు, అమ్మ, నాన్న మళ్ళీ స్కూల్ నుండి నన్ను ఇంటికి తీసుకువెళ్తే బాగుండు, రేపు, అమ్మ నాన్న homework చేయకుండా, నాకు కధలు చెప్తే బాగుండు, దెగ్గరిగా హత్తుకొని కూర్చుంటే బాగుండు. రేపు, నన్ను, నాలా చూస్తే బాగుండు, రేపు, కొత్తగా మొదలైతే బాగుండు, స్వేచ్ఛగా. Goodnight Friends సంస్కృతి.