బ్రహ్మ దేవుడు మా ంచి మూడ్ లో ఉన్నప్పుడు శ్రీదేవిని సృష్టించి ఉంటాడు ఆ కళ్ళు ఆ నవ్వు ఆహా.. ఒక అసలైన హీరోయిన్ ఎలా ఉండాలో అలా ఉంటుంది శ్రీదేవి.. ఇక్కడ మాత్రమే కాదు స్వర్గంలో రంభ ఊర్వశి మేనక కుడా శ్రీదేవీలా ఉండరు కాబోలు.. జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవిని ఒక దేవకన్యలా చుపిస్తారు సినిమాలో మాత్రమే కాదు నిజంగా శ్రీదేవి ఈ భూమి మీద ఉన్న దేవకన్య.
శ్రీదేవి ఆగస్ట్ 13వ తేది 1963వ సంవత్సరములో శివకాశి (తమిళనాడు)లో జన్మించింది. తండ్రి పేరు అయ్యప్పన్, ఆయన ఒక న్యాయవాది. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవి కి ఒక Sister, Brother ఉన్నారు. హిందు సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి. కాని శ్రీదేవి కూతురు అయినప్పటికి, కొన్ని కారణాల వల్ల తన తల్లి అంత్య క్రియలకు తానే చితికి నిప్పు అంటించింది. నాలుగు సంవత్సరాల వయసులో నుండే నటించడం మొదలుపెట్టిన శ్రీదేవి తన 8వ సంవత్సరంలో కేరలలో నటించిన సినిమాకు ఉత్తమ బాలనటిగా అవార్డును అందుకుంది.. ఇక అప్పటి నుండే అవార్డులను అందుకోవడం మొదలుపెట్టింది.
బాలనటిగా మన తెలుగు లో బడిపంతులు సినిమాలో ఎన్.టి.ఆర్ కు మనవరాలిగా నటించి అదే ఎన్.టి.ఆర్ తో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి లో హీరోయిన్ గా నటించింది.. అక్కినేని నాగేశ్వర రావుతో ప్రేమాభిషేకం, బంగారు కానుక లో నటించి నాగార్జున తో ఆకరిపోరాటం లో నటించింది ఇలా అన్ని తరాలవారికి సరైన జోడిగా నిలిచింది. కృష్ణ, శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఏ హీరోతో కలిసి నటించినా Perfect జోడిగా ఉండేది..తెలుగులో 62 హిందిలో 63 తమిళంలో 58 మలయాళంలో 21 నటించి భారతదేశమంతంలో అత్యుత్తమ నటిగా ఇప్పటికి అంతే గౌరవాన్ని పొందుతుంది. నటించిన ప్రతి భాషలో ఎన్నో అవార్డులతో పాటు అభిమానుల కలల లోకంలో ఎంజెల్ గ ఉంది. నటనలో తన సేవకు మెచ్చి శ్రీదేవి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.ఇలా రంగుల ప్రపంచాన్ని తన అందం తో, అభినయం తో ఏలిన ఈ అతిలోక సుందరి, ఇపుడు అందరిని విడిచి నింగికెగసింది. తన చివగమ్యం అయినా స్వర్గాన్ని ఏలటానికి అక్కడికి చేరింది. మనందరినీ శోకసముద్రంలో వదిలిపోయింది.
నటనలో ఎప్పటికి గుర్తుండిపోయే కొన్ని సినిమాలు:
ఆకరి పోరాటం
పదహారేళ్ళ వయస్సు:
జగదేకవీరుడు అతిలోకసుందరి:
క్షణ క్షణం
గోవిందా గోవిందా:
ప్రేమాభిషేకం:
దేవత:
ఇంగ్లీష్ వింగ్లిష్:
వేటగాడు:
ఆకలి రాజ్యం:
వసంత కొకిల: