Contributed by Hari Atthaluri
నా పేరు నిద్ర... కొన్ని మొహాలకి నా పేరే పెడతారు... నిద్ర మొహం అని... అదేంటో కొంత మంది అంటేనే నాకు ఇష్టం... వాళ్ళు పిలవకుండానే టైమ్ కి వచ్చేస్తా... వాళ్ళు షెడ్యుల్ అన్ని కరెక్ట్ గా ఉంటూ నాకంటూ importance ఇస్తారు.. ఓ టైమ్ ఇస్తారు... అందుకే అడగకుండానే వచ్చేస్తా...
మిగతా వాళ్ళు ఎంత పిలిచినా రాను ... వీళ్ళు ఒక్కో రోజు ఒక్కో టైమ్ కి పడుకుంటారు... నాకు నచ్చని వాటిని నేను వచ్చే ముందు మెక్కుతారు.. వీకెండ్ వస్తె ఇంకంతే... నాశనం...నేను అసలు గుర్తు ఉండను... అస్సలు టైమ్ సెన్స్ ఉండదు... నేను వచ్చినప్పుడు పట్టించుకోరు కాని how to sleep, tips to proper sleep అని నా కోసం గూగుల్ చేస్తారు..
నాకు నచ్చేవి తినరు... మా ఆజన్మ శత్రువు టీ ని కాఫీ ని ఏడా పెడా తాగుతారు.... పెద్ద పికే పనేదో ఉన్నట్టు.... లేట్ నైట్ దాకా ఉండి.. నైట్ అంతా నెట్ ఫ్లిక్స్ లు.. యూట్యూబ్ లు... అమెజాన్ లు.. అడ్డ మైన వీడియో లు అన్ని చూసి...
morning ఏమో అస్సలు నైట్ నిద్ర రాలేదు అని మళ్లీ నన్నే అంటారు.... మీరు అలా అన్ని ప్రతి సారి పిచ్చిగా కోపం వస్తుంది...మిమ్మల్ని ఓ పీకు పీకి... నన్ను మీకు దూరం చేసే ఆ ఫోన్ నేలకేసి కొట్టాలి అనిపిస్తుంది.... నేను రావటం లేదు అని అర్థం అయ్యేలా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఇచ్చినా make up తో కవర్ చేస్తారు కానీ టైమ్ కి తిని తొంగోరు.... ఊరికే వచ్చే నన్ను costly చేస్తారు.... Diet maintain చేయరు... డాక్టర్స్ చుట్టూ మాత్రం తిరుగుతారు....
రోజూ రాని నిద్ర ని ఎగ్జాం ముందు రోజు మాత్రం ఆవాహయామి అన్నట్టు పిలుస్తారు... మొత్తం ఒకే రోజు చదవాలి అని ట్రై చేసి నీరసం అయిపోయి... ఏం అయిపోతారో అనే నేను వస్తా కాని మిమ్మల్ని exam లో ఫెయిల్ చేయాలని కాదు... ఓ ప్రతి దానికి టెన్షన్ పడిపోయి... లేని pressure నుంచి నెత్తి మీద పెట్టుకుని నన్ను దూరం చేసుకుంటున్నారు.... మీరు అలసిపోయి.. నేను వస్తున్నా అని తెలిసి కూడా నిద్ర పోకుండా డ్రైవ్ చేస్తారు... మీతో పాటు నలుగురు ప్రాణాలు ని కూడా రిస్క్ చేస్తారు...
నాది మత్తు కాదు.. ఇది మీ అజాగ్రత్త.... నేను ఏం చేయను... ఒకప్పుడు పొద్దు పోగానే పనులు అన్నీ చేసుకుని నా కోసమే వెయిట్ చేసే వాళ్ళు...హాయి గా నిద్ర పోయి పొద్దునే మళ్లీ ఫ్రెష్ గా పనుల కి వెళ్లిపోయే వాళ్ళు... ఇప్పుడు నేనంటే ఎవరికీ లెక్క లేదు... అందుకే మీకు ఇన్ని రోగాలు...జబ్బులు.... పొద్దున లేచినప్పటి నుంచి మీకు ఇన్ని tensions frustrating feelings...mood fluctuations.... ఇవన్నీ వద్దు అనుకుంటే... నేను చెప్పినట్టు చేయండి... మీరు అడగకుండానే వస్తా..... ఆరోగ్యం తో పాటు అన్నీ ఇస్తా.... ఇప్పటికి ఇంక ఉంటా.. మీ నిద్ర