Contributed By Lokesh Sanam
అలసిన హృదయాలు చూసాను...సాగలేక ఆగిపోదామా అనే ఆలోచనలతో సతమత మైపోతున్న హృదయాలను చూసాను, "పట్టుదల అంటే పట్టుకోవడం కాదు...పట్టుకున్న దాన్ని వద్దలకుండా ఉండడం" అని చెప్తూ... పోరాట స్ఫూర్తి ఉన్న ప్రతి హృదయం యొక్క స్ఫూర్తిని నా హృదయం తో వ్రాసాను.
నీలో ఒక ప్రపంచం నీతో ఒక ప్రపంచం నువ్వే ఒక ప్రపంచం నువ్వై ఒక ప్రపంచం ఆశలు తీరక, అడుగులు ఆగక, అలుపెరగక నువ్వు పరిగెడతావ్, అలిసిన ఆపక నిలబడతావ్.
నువ్వే నీ ధైర్యంగా నువ్వే నీ స్థైర్యం గా నువ్వే నీ సైన్యంగా నువ్వై నీ యుద్ధంగా సమస్య తీరక, సమాధానం దొరకక, సహనం వదలక పరిగెడతావ్, సమయస్ఫూర్తితో నిలబడతావ్.
నలుదిక్కులు నిన్ను ఒంటరి చేయని, నలుగురు కలిసి మోసం చేయని, ఒడిదొడుకులు నీ ఓర్పుని చూడని, ఓర్చనోళ్ళు నీ ఓటమి కోరని, అయినా...! ఓపిగ్గా నువ్వు పరిగెడతావ్, వదిలేయకుండా నిలబడతావ్.
ఈ ప్రయత్నం నీది,దీని ఫలితం నీది ఈ ప్రశ్న నీది,దీని సమాధానం నీది ఈ సమస్య నీది,దీని పరిష్కారం నీది ఎందుకంటే..., ఈ ప్రయాణం నీది,దీని ప్రమేయం నీది. కొన్నిటినరవని కొందరు మొరగని ఆశే శ్వాసకి ధ్యాసై లాగని ఆగని పయనం నీదై సాగని. ఎక్కడా తగ్గకు,ఎక్కడా లోంగకు సంకల్పమే నీ పెట్టుబడి, సంకల్పమే నీ రాబడి. ఏదేమైనా,ఎన్నేమైనా, ఎన్నాళ్లైనా అడుగులు ఆగవు,ఆశలు తీరవు.
