Contributed By Sai Ram Nedunuri
సూక్ష్మ పరిశీలనా తత్వంతో పదాల మధ్య తన అస్తిత్వంతో పరమార్థానికై నిరంతర శోధనతో అనుక్షణం జ్ఞాన దాహంతో నిరంతర ప్రస్థానం సాగిస్తోంది తను
సమాజపు సంకెళ్ళు తెంచుకుంటూ వెక్కిరింపుల వనవాసాన్ని తట్టుకుంటూ తనకి ఇష్టమైన దారిని ఎంచుకుంటూ సాహితీ హృదయుల పట్టాభిషేకం అందుకుంటూ నిరంతర ప్రస్థానం సాగిస్తోంది తను
ఏకాగ్రతని నిప్పుల కొలిమిగా మార్చి ఇనుమంటి ఆలోచనలని అందులో కాల్చి తను పంచాలనుకున్న భావాలుగా మలచి రచనా ప్రపంచానికి ప్రతినిధిగా నిలిచి నిరంతర ప్రస్థానం సాగిస్తోంది తను
ప్రసంశలకి పొంగిపోకుండా విమర్శలకి విసిగిపోకుండా అహంభావం దరి చేరనీయకుండా ఏనాడూ అలసిపోకుండా నిరంతర ప్రస్థానం సాగిస్తోంది తను
వేల భావాలతో సహవాసం చేస్తూ వాటిని ప్రపంచానికి పంచాలని తపిస్తూ కృంగదీసే జడత్వాన్ని గెలుస్తూ నిత్యం ఈ విశ్వంలో ధ్వనిస్తూ
నిరంతర ప్రస్థానం సాగిస్తోంది తను అనిర్వచనీయమైన ఆనందంలో ఓలలాడుతోంది తను