చిన్నప్పుడు 10 వ తరగతి లో కుస్తీ పడుతూ.. బట్టి పడుతూ నేర్చుకున్న సంధులు సమాసాలు మీకు గుర్తున్నాయా? "లేవు కానీ నువ్వు చెప్పుతుంటే ఆ రోజులు గుర్తొకూస్తున్నాయి" అని పాట వేసుకుంటున్నారా?.. అక్కడే ఆగిపోండి. ముందు క్రింద ఉన్న ప్రశ్నలను పూర్తీ చేసి, తెలుగు మీదున్న పట్టుని నిరూపించుకోండి. తరువాత మెల్లగా మీ తెలుగు పాఠాలా జ్ఞాపకాలను గుర్తుచేసుకోండి...
కష్టంగా ఉందా మాష్టారు.. ఇక్కడ సూచనలను ఇచ్చాము చూస్కోండి 1. ఇస్మార్ట్ శంకర్ - ఇస్మార్టు అయినా శంకర్ 2. గూఢచారి - గూఢ + ఆచారి 3. బ్రోచేవారెవరురా - బ్రోచేవారు + ఎవరురా 4. ఫలక్-నుమా దాస్ - ఫలక్-నుమా యందు ఉండేటి దాస్ 5. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ - ఫన్ యూ ఫ్రస్ట్రేషన్ నున్ను.. 6. ఒకేఒక్కడు - ఒక్కడు + ఒక్కడు 7. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ - సాయి శ్రీనివాస ఆత్రేయ అను పేరు గల ఏజెంట్ 8. మహానుభావుడు - మహా + అనుభావుడు 9. స్పీడున్నోడు - స్పీడు + ఉన్నోడు 10. ఆరుగురు పతివ్రతలు - ఆరు సంఖ్య గల పతివ్రతలు
మీకు నచ్చితే మీ స్నేహితులతో, సన్నిహితులతో పంచండి.. నవ్వుని పెంచండి.. (ఇప్పుడు వేసుకోండి గుర్తుకొస్తున్నాయి పాటని)