Presenting You Our Funny ‘Amma Thitla’ Version Of Samajavaragamana Lyrics

Samajavaragamana entha popular ante nen description ravalsina avasaram kuda ledu. So, Presenting you the ‘Amma Titla’ Version of Samajavaragamana….
Tenglish lo easy ga chadive batch kosam 🙂
Nee Chekkillu Mattuku Vadalanannavi Choodoy Naa Jollu
Aa Towel-ni Alaa Visiri Vellaku Siggu Ledaa Asalu
Aa Kallaki Mantalu Teshtaayoyy Mudanashtapu Phonlu
Adi pakkna petti padukokunte tirigenu cheepurlu
Stove pakkana undi kattakapothe vacchaka moodu eelalu
Ninnu tittestu alaa, kottestu unte nee yedupu valavalalu
Samajavaragamana ninu kannadi nenenaa
Potta kosthe aksharamaina undaa nee lonaa?
Samajavaragamana ninu kannadi nenenaa
Entha tittinaa maaravu asalu manishivenaa?
Nee Chekkillu Mattuku Vadalanannavi Choodoy Naa Jollu
Aa Towel-ni Alaa Visiri Vellaku Siggu Ledaa Asalu
Pareekshala maasamaa
Rankula kosamaa
Oka kshanamu kooda kuduruleni pillodivammaa
Yedaganai kunchemaa
Yedagava Konchem-Maa
Kotlanni mokkulannitiki idi pratiphalamaa
Are! Nenenta tittinaa… Mee nanne kottinaa
Chalaname erugavaa… Raamaaaa
Ento batimaalinaa kotaina maaravaa
Telivileni telusukoni tingari tanamaa!
Samajavaragamana ee paapam maadhenaa
Pranamivvagalamu kaani gnaanamivvagalamaa?
Samajavaragamana ninu kannadi nenenaa
Aashalanni vammu chesi pokoy emainaa!
Nee Chekkillu Mattuku Vadalanannavi Choodoy Naa Jollu
Aa Towel-ni Alaa Visiri Vellaku Siggu Ledaa Asalu
Aa Kallaki Mantalu Teshtaayoyy Mudanashtapu Phonlu
Adi pakkna petti padukokunte tirigenu cheepurlu
– Saradaaga raasinade, evvarini kinchaparachadani Aashisthu!
తెలుగులో చదవగలిగిన వారికోసం 🙂
నీ చెక్కిళ్ళు మట్టుకు వదలనన్నవి చూడోయ్ నా జోళ్ళు
ఆ టవల్ ని అలా విసిరి వెళ్ళకు సిగ్గులేదా అసలు
ఆ కళ్ళకి మంటలు తెస్తాయోయ్ ముదనష్టపు ఫోన్లు
అది పక్కన పెట్టి పడుకోకుంటే తిరిగెను చీపుర్లు
స్టవ్ పక్కన ఉండి కట్టకపోతే వచ్చాక మూడు ఈలలు.
నిన్ను తిట్టేస్తూ అలా, కొట్టేస్తు ఉంటే నీ ఏడుపు వలవలలు.
సామజవరగమనా నిను కన్నది నేనేనా
పొట్ట కొస్తే అక్షరమైన ఉందా నీలోనా!
సామజవరగమనా నిన్ను కన్నది నేనేనా
ఎంత తిట్టినా మారవు అసలు మనిషివేనా!
నీ చెక్కిళ్ళు మట్టుకు వదలనన్నవి చూడోయ్ నా జోళ్ళు
ఆ టవల్ ని అలా విసిరి వెళ్ళకు సిగ్గులేదా అసలు!
పరీక్షల మాసమా
ర్యాంకుల కోసమా
ఒక క్షణము కూడా కుదురులేని పిల్లోడివమ్మా
ఎదగని కుంచెమా
ఎదగవ కొంచంమా
కోట్లన్ని మొక్కులన్నిటికి ఇది ప్రతిఫలమా
అరే! నేనెంత తిట్టినా… మీ నాన్నే కొట్టినా
చలనమే ఎరుగవా రామా…
ఎంతో బతిమాలినా కొంతైనా మారవా
తెలివిలేని తెలుసుకోని తింగరి తనమా
సామజవరగమన ఈ పాపం మాదేనా
ప్రాణమివ్వగలము కానీ జ్ఞానమివ్వగలమా!
సామజవరగమనా నిను కన్నది నేనేనా
ఆశలన్ని వమ్ముచేసి పొకోయ్ ఏమైనా!
నీ చెక్కిళ్ళు మట్టుకు వదలనన్నవి చూడోయ్ నా జోళ్ళు
ఆ టవల్ ని అలా విసిరి వెళ్ళకు సిగ్గులేదా అసలు!
ఆ కళ్ళకి మంటలు తెస్తాయోయ్ ముదనష్టపు ఫోన్లు
అది పక్కన పెట్టి పడుకోకుంటే తిరిగెను చీపుర్లు!
– సరదాగా రాసినదే, ఎవ్వరిని కించపరచదని ఆశిస్తూ! స్వస్తి!
If you wish to contribute, mail us at admin@chaibisket.com