This Honest Introspection On The Present Day Educational System In Our Telugu States Is A Must Read!

 

We are all drowning in the Era of Information and Starving for Knowledge and Wisdom – E.O.Wilson

 

నాలుగేళ్ల వయసు లో K.G లో చేరినప్పటినుండి దాదాపుగా 23,24 ఏళ్ళవరకు PG పూర్తిచేసేదాకా మన జీవితం లో రెండు దశాబ్దాలు Education కి అంకితం చేస్తున్నాం.కానీ నిజంగా మన చదువుకున్న చదువులు మన జీవితం లో మనకి ఎంత వారికి ఉపయోగపడుతున్నాయి??? ఇది అందరికి ఉన్న సందేహమే,సమాధానం దొరకని ప్రశ్నే.

Hydrogen helium lithium beryllium boron,అంటూ కంటస్థం చేసిన Periodic Table మనకి ఎంత వరకు పనికొచ్చింది ???All silver tea cups అంటూ బట్టీ పట్టిన Trigonometry Table 100లో దాదాపు 97 మందికి గుర్తుకూడా లేదు. చిన్న వయసు నుంచీ ఒక పందెంలో లో పరిగెతించినట్టు వేగంగా పరిగెడుతున్నాం కానీ ఏ దిక్కులో లో వెళ్తున్నామో మనకే తెలియకుండా పరిగెత్తాం.మార్కులకోసం పరీక్షలు,పరీక్షల కోసం ట్యూషన్లు,ట్యూషన్లకోసం ఎక్సట్రా హావర్స్,ఇలా ఆడుతూ పాడుతూ సాగాల్సిన బాల్యాన్ని ఆపసోపాలు పడుతూ గడిచిపోతుంది .24 గంటలలో నిద్రపోయే “కాసేపు” తప్ప మిగతా సమయమంతా పుస్తకాలతో కుస్తీలే, ఇంకా Physical Fitness ,Sports అనేవి బూతుమాటలే.

ఈ గందరగోళాలలో కనీసం పక్కవాళ్ళతో ఎలా మాట్లాడాలి,నలుగురిలో ఎలా కలిసిపోవాలి లాంటి అతి సాధారణ విషయాలకి కూడా సమయం లేదు. సహజంగా వయసుతో పాటు రావాల్సిన Communication Skills కి కూడా సెపెరేట్ గా coachings తీసుకునే దాకా దిగజారిపోయింది మన వ్యవస్థ. రేపటి కోసం తీసుకునే శిక్షణ లా ఉండాల్సిన చదువు,శిక్ష లా మారింది ఈరోజు 6th క్లాస్ నుంచీ IIT కోచింగ్,8th నుంచీ IAS కోచింగ్ అంటూ తల్లిదండ్రుల జీతాలు, పిల్లల జీవితాలు Competition అనే పేరుతో దర్జాగా కార్పొరేట్ల దోపిడీకి గురవుతున్నాయి. IIT లో సీట్ రాకపోతే,కనీసం NIT లో సీట్ కొట్టకపోతే ఇంకా జీవితం లో ఏమి సాధించలేవు అనే స్థాయికి ప్రభావితం చేస్తున్నాయి .ఇంత చదువు చదివి,క్యాంపస్ లో ప్లేసెమెంట్ సాధించి ఒక పరిమిత ప్రపంచం లో, అద్దాలమేడలో బందీగా మెషిన్ ముందు కూర్చొని చేసే ఉద్యోగం కోసమా ఇన్ని త్యాగాలు అని ఉద్యోగం లో చేరిన 6నెలకే చిరాకు….

మన విద్యా వ్యవస్థ మార్కుల కోసం,ర్యాంకులకు ఇచ్చే ప్రాధాన్యత విద్యార్థుల Character Building,Personality Development,Social Behaviour,Confidence building లాంటి వాటికి అస్సలు ఇవ్వట్లేదు అందుకే చిన్న చిన్న సవాళ్ళని కూడా ఎదుర్కోడానికి ఇబ్బందులు పడుతున్నారు. Workplace లో వచ్చి చిన్న చిన్న సమస్యలకి కూడా depressions, Target రీచ్ అవ్వకపోతే Inferiority Complex లతో Sucidal tendencies. Work Pressure ని హేండిల్ చేయలేక resignations ఇవన్నీ షరా మామూలే. విద్య అనేది మనిషిని ఒక మెట్టు పైకి ఎదిగేలా చేయాలి. కానీ ఇప్పుడున్న విద్యా వ్యవస్థ మార్కుల కోసం,ర్యాంకుల కోసం, సీట్లకోసం పేపర్ లీకేజీ అంటూ ఎంతవరకైనా దిగజారే దాకా తీసుకొచ్చింది.

20 ఏళ్ళు,ఇదే చదవాలి,ఇది చదవకపోతే ఇంకా ఏది చేతకాదు,దేనికి పనికి రావు,బ్రతకలేవు అని ఒక limited syllabus ని పిల్లలపై రుద్ది వాళ్లలో ఉన్న Talent ఏంటో కనీసం వాళ్ళకి కూడా తెలియకుండా చేస్తుంది. ఎవరికోసమో తయారు చేసిన చొక్కాలో మనల్ని ఇరికిస్తుంది. ఒకప్పుడు గురువు ప్రభావం ప్రతీ విద్యార్థి మీద ఉండేది,ఒక inspiration లాగా,ఒక Friend,Philospher,Guide,గా ఎంతో అనుభందం ఉండేది,విద్యార్థికి,గురువుకి కానీ ఇప్పుడు ఒంటిస్తంభం మేడల్లో బడులు and Thanks to those e -Techno schools,అసలు టీచర్ తో కనీసం ముఖపరిచయం కూడా లేకుండా డిజిటల్ క్లాసులంటూ మొదలుపెట్టాయి. మనిషిని కాస్త మరమనిషిగా మారుస్తున్నాయి.

Competitve ప్రపంచం లో ఎదురింటి అబ్బాయిలాగా foreign లో స్థిరపడాలనో,పక్కింటి అబ్బాయ్ లాగ MNC లో ఉద్యోగం చేయాలనో,మంచి position లో ఉన్నతంగ స్థిరపడాలనే తల్లిదండ్రుల తొందరలో ఆయా వ్యక్తులకి కార్బన్ కాపీ లా మారుస్తున్నారే తప్ప, వాళ్ళ origiality ని నిక్కచ్చిగా చెప్పాలంటే Identity ని కూడా కోల్పేయేలా చేస్తున్నారు. నచ్చిన రంగం లోకి వెళ్లలేక Society Pressure వల్ల Passion కోసం దైర్యంగా ముందుకు వెళ్లలేక వచ్చిరాని చదువుతో,అంతంతమాత్రం Percentage తో నామ్ కే వాస్తే Degree సర్టిఫికెట్స్ తో చాలీచాలని జీతాలతో రోజుకోసారి రాజీ పడుతూ ఉన్నవాళ్ళు మనలోనే చాలా మంది ఉన్నారు.

ఎప్పటికైనా Knowledge Centric Value Based Education రావాలని కోరుకుందాం
కనీసం రాబోయే తరానికైనా బాల్యాన్ని భారంగా కాకుండా,ఒక మంచి జ్ఞాపకంలా ఉండేలా చూద్దాం .

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,