మన భారతదేశంలో ప్రతి మూడు నిమిషాలకు మహిళపైన ఒక దాడి జరుగుతుంది, వంద దాడులు జరిగితే అందులో 10 మాత్రమే అఫీషియల్ గా కేసు నమోదు అవుతుంది, మిగిలిన 90 వరకు కూడా బయటపడని కేసులే.. మహిళలలో చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఒక సమస్య ఐతే, కేసు పెడితే ప్రపంచానికి తెలుస్తుంది ఇంటి పరువుపోతుందనే రకరకాల కారణాల వల్ల కూడా ఈ దేశపు మహిళ నిత్యం రంపపు కోతను అనుభవిస్తుంది. ఇలాంటి ఎందరో మహిళల బాధలకు ప్రతిస్పందనగా లాయర్ మానసి గారు పింక్ లీగల్ సెల్(వెబ్సైట్)ను ప్రారంభించారు.
ఎలా ఉపయోగపడుతుంది: మన భారత న్యాయస్థానం, మరియు న్యాయ వ్యవస్థ ప్రతి మహిళా రక్షణకు అన్ని రకాల చట్టాలను అందిస్తుంది. కానీ వాటిని తెలుసుకోకపోవడం, తెలుసుకున్నా ఉపయోగించుకోకపోవడం మూలంగా ఇన్ని సమస్యలు. "పింక్ లీగల్" వెబ్సైట్ లో డౌరీ కి సంబంధించిన చట్టాలు, డొమెస్టిక్ వయోలెన్స్, ఈవ్ టీజింగ్, రేప్, హరాసింగ్, సైబర్ బుల్లీయింగ్ మొదలైన అన్ని రకాల న్యాయపరమైన సలహాలు ఉచితంగా ఈ వెబ్సైట్ అందిస్తుంది.
ఒక సంఘటన కారణం: పింక్ లీగల్ వెబ్సైట్ మానసి గారి ఆలోచన. ఒకరోజు మానసి గారు కార్లో ఇంటికి ప్రయాణం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో ఒక చిన్న ప్రమాదం జరిగింది, తన తప్పు లేకపోయినప్పటికీ ఇద్దరు వ్యక్తులు దౌర్జన్యంగా కారు సైడ్ వ్యూ అద్దాలను పగులగొట్టారు. మానసి గారు డైరెక్ట్ గా పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ యువకులు తప్పు ఒప్పుకుని క్షమాపణ పత్రం కూడా రాసి ఇచ్చారు. మానసి గారు ఢిల్లీ జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బి పూర్తిచేశారు, హైకోర్ట్, సుప్రీమ్ కోర్ట్ లో కూడా పనిచేశారు. ఇంతటి అవగాహన ఉన్న తనకే ఇంత ఇబ్బంది జరిగితే మిగిలిన సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించి ఈ పింక్ లీగల్ ను మొదలుపెట్టారు. ఈ వెబ్సైట్, అందులోని న్యాయపరమైన అంశాలు ప్రతి ఒక్కరికి సులభంగా అర్ధం అయ్యేరీతిలో ఉండేందుకు కొంతమంది నల్సర్ లా యూనివర్సిటీ విద్యార్థులు సహాయం చేశారు.
Visit here: http://pinklegal.in/