Contributed By Divya Vattikuti
మనం పెద్దయ్యే టైం లో మన ఇంట్లో తప్పకుండ ఉన్న ఒక పుస్తకం పెద్ద బాల శిక్ష. ఆవకాయ, పెద్ద బాల శిక్ష లేనిదే తెలుగు ఇల్లు పూర్తి కాదు అని అంటారు చాల మంది. తెలుగు భాష, తెలుగు ఆచారాలు, సంప్రదాయాలు అన్నిటి గురించి సవివరంగా ఉండే పుస్తకం మన పెద్ద బాల శిక్ష. గూగుల్ యుగంలో కూడా తెలుగు ప్రజలు ఇప్పటికీ పెద్ద బాలశిక్ష ను తెలుగు భాష మరియు సంస్కృతికి మూలస్తంభంగా భావిస్తున్నారు అంటే ఆ పుస్తకం గొప్ప తనం అలాంటిది.
తెలుగు వర్ణమాలలు, ప్రాసలు, కవితలు, వ్యాకరణం మరియు వివిధ విషయాలు ఐన సైన్స్ సోషల్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఇలా అన్ని సబ్జక్ట్స్ గురించి ఉండే పెద్ద బాలశిక్ష తెలుగు భాషలో ఎన్సైక్లోపీడియాగా మారింది.
ఈ పుస్తకం అన్ని వయసుల పిల్లలకు మాత్రమే కాకుండా, సాహిత్యం, కళలు, సంస్కృతి, నైతికత, ఆటలు మరియు పరిశోధనా అంశాల యొక్క గరిష్ట పరిధికి సంబంధించిన పూర్తి తెలుగు సంస్కృతి, సంప్రదాయం మరియు ఆచారాలను కూడా కలిగి ఉంది. తెలుగుకు సంబంధించిన భారీ విషయాలతో, పెద్దా బాలశిక్ష ఇప్పటికీ కొన్ని స్కూల్స్ లో సిలబస్ గా ఉంది.
How did the book evolve?
1857 లో వచ్చిన ఈ బుక్ ఇప్పటికి 167టైమ్స్ పబ్లిష్ అయ్యింది. ఇప్పుడు ఈ పుస్తకం పేరు పెద్ద బాలశిక్ష, కానీ దీని ఫస్ట్ ఎడిషన్ 1832 లో రిలీజ్ చేసినప్పుడు, దీనికి పెట్టిన పేరు, " బాలల వివేక కల్ప తరువు". పి సీతారామ శాస్త్రి మొదటి పుస్తకాన్ని 1856 లో 78 పేజీలతో నవీకరించారు. తరువాత, అనేకమంది రచయితలు ఇలాంటి పుస్తకాలు రాశారు. 1960 నుండి, అనేక ఇతర ప్రచురణలు ఇలాంటి విషయాలతో మార్కెట్లోకి ప్రవేశించాయి, కాని గాజుల సత్యనారాయణ యొక్క పెద్ద బాలశిక్ష నవీకరించబడిన సంస్కరణతో పోటీ పడలేకపోయాయి. తెలుగు భాష మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి ఒక బలమైన భావనతో, ప్రచురణకర్తలు ఈ పుస్తకాన్ని రూ .116 కు అమ్మారు. అయితే, న్యూస్ ప్రింట్ ఖర్చు పెరగడం మరియు ఇతర వ్యయాల వ్యయం పెరగడంతో, పుస్తక వ్యయం రూ .153 కు పెరిగింది.
Content of the book
మహాభారతాన్ని గుర్తుకు తెచ్చేలా ఇందులోనూ పద్దెనిమిది భాగాలు కూర్చారు. భాషా విజ్ఞాన పర్వము, సంస్కృతీ సంప్రదాయ పర్వము, బాల పర్వము, ఆధ్యాత్మిక పర్వము, గణిత శాస్త్ర పర్వము, శతక పర్వము, నీల) పర్వము, కంప్యూటర్ పర్పము, క్రీడారంగ పర్వము, ఆరోగ్య పర్వము, ఆంధ్రప్రదేశ్ప ర్వము, భారతదేశ పర్వము అన్నవి పెద్ద బాలశిక్షలోని కొన్ని పర్వముల పేర్లు. ఇందులో ఉన్న విషయాలు ఈ విశాల ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి. ఇందులో లేని విశేషాలు మాత్రం మరెక్కడా లేవన్న మహాభారత వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని వెలువరించిన అమూల్య గ్రంథం తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష. ఈ పుస్తకం ఇప్పుడు 1200 పేజీలలో మార్కెట్లో అందుబాటులో ఉంది. తెలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్లలో కొందరు పెద్ద బాలశిక్షపై PhD చేస్తున్నారు.
బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించిన కాలం లో ఆంధ్ర దేశంలో పాఠశాలల్లో పిల్లలకు పెద్దబాలశిక్ష సిలబస్ గా ఉండేది. అయితే అప్పట్లో పిల్లలు మొట్టమొదట తమ విద్యాభ్యాసాన్ని ఈ పెద్ద బాలశిక్ష తో ప్రారంభించే వారు. పాఠ్య పుస్తకాల లో భాగంగా ఈ పెద్ద బాలశిక్ష ఉందంటే దీని యొక్క ప్రాముఖ్యత గురించి మనం చెప్పుకొని తీరాలి.
Pedda Balasiksha across the Globe
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు వందల ఏళ్ల క్రితమే తెలుగు గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారు. ఫారిన్ లో ఉంటున్న తెలుగు పిల్లలు కూడా పెద్ద బాల శిక్ష దగ్గర అవ్వాలి అనే ఉద్దేశం తో నవసమాజ్ దర్పణ్ అనే సాంస్కృతిక స్వచ్ఛంద సంస్థ బ్రిటన్లోని తెలుగు చిన్నారులకు అమ్మ భాషను చేరువ చేసేందుకు కంకణం కట్టుకుంది. యూకేలోని పబ్లిక్ లైబ్రరీల్లో తెలుగు పెద్ద బాలశిక్ష పుస్తకాలను ఉచితంగా అందుబాటులో ఉంచుతోంది.
With so much information available in the book, covering wide range of topics, Pedda Bala Siksha is one book we all must read, to understand and love the Telugu language a little more.
Have you read the book? Did it help you in any way? Let us know in the comments section.