"ఏరా ఈ సంవత్సరానికన్నా సెటిల్ అవుతావా లేదా ఇంతేనా?"
"ఈ కంప్యూటర్ లు కోడింగ్ లు నా వాళ్ళ కాదు బాబాయ్, ఏదైనా గట్టిగా కొట్టాలి."
"అరేయ్ మీ నాన్నకి వయసయిపోతుంది. ఇపుడు ఆయన బాధ్యతలు పంచుకోవాలి కానీ ఆయనకీ భారం కాకూడదు. నీ వయసులో సచిన్ ఎంత గొప్ప వాడయ్యాడు. ఇంటి బాధ్యతలే కాదు క్రికెట్ లో దేశ బాధ్యతలే మోసాడు."
"సినిమాలు ఎక్కువ చూస్తున్నావు కదా బాబాయ్ మంచి డైలాగు లే చెప్తున్నావ్. 100 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లో ఒకడే సచిన్ బయటకి వచ్చాడు. అంటే ఎంత మంది ఇంకా మన గల్లీల్లోనే ఉండిపోయి ఉంటారో?"
"అవన్నీ ఎందుకు రా ఇపుడు.. నువ్వేమన్న మారుస్తావా ఏంటి?"
"ఔను బాబాయ్.."
"అసలేం అంటున్నావో ఎం అర్ధం కావట్లేదు.."
"రాజకీయాల్లోకి వెళదాం అనుకుంటున్నా... "
*************************
(రాత్రి 9 గంటలు ... రెండు బీర్ బాటిల్స్ ఖాళీ అయ్యాక)
"ఒరేయ్ అర్జున్ , ఉద్యోగం దొరక్క పోతే, రెండు ప్రాంక్ వీడియో లు చేసి యూట్యూబ్ లో పెట్టు, లేదా నాలుగు dubsmash లు చేసి instagram లో పెట్టు, ఇంకా కాదంటే ఏదో పెద్ద హీరో టీజర్ కో లేదా వాడు చేసే పనులకు రివ్యూ లు ఫేస్ బుక్ లో పెట్టు. కళ్ళ కద్దుకుని ఏదో టీవీ ఛానల్ వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ లు తీసుకుంటారు. ఇంకా పైసలే పైసల్. ఇవన్నీ వదిలేసి రాజకీయాలు అనే రొచ్చు లో కి ఎల్తా అంటావేంట్రా ?"
"రేయ్ శివ నువ్వు ఆపు. కనీసం వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు రా. మనం మాత్రం వాళ్ళ వీడియో ల కింద కామెంట్ లు కొడుతూ ఇదిగో ఇలా మందు బాటిల్ లు ఖాళీ చేస్తూ ఖాళీగా తిరుగుతున్నాం. అర్జున్ నువ్వు చెప్పావంటే ఏదో ఒకటి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటావ్ ... Lag లేకుండా కక్కేయి."
"ఇందులో ప్రిపేర్ అవ్వటానికి ఏమి లేదురా. ప్రతి ఒకరికి ఒక కల ఉంటుంది. ఒకరు రచయిత అవ్వాలి అనుకుంటారు, ఒకరు క్రికెటర్ అవ్వాలి అనుకుంటారు, నాకు అంతే ఒక కల ఉంది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను కాబట్టి అది ఒక అసాధారణ కల. ఒక రాజకీయ నేత కావాలని. ప్రజల్లోకి వెళ్లాలని, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని."
"ఈయన్ని టైం వేస్ట్ యవ్వారాలు సార్.. అవ్వవు. రేయ్ అర్జున్, వారసత్వాలతో నిండిపోయిందిరా అంతా, వాళ్ళకే సీట్లు దొరకట్లా, మనకేం దొరుకుతాయి. అయినా ఇంత చదువుకున్నావ్ ఇవన్నీ ఎందుకు మనకి? "
"మావ, టీచర్ కొడుకు టీచర్ అవ్వాలనుకుంటాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు వాటిల్లో తప్పులేదు, ఇక్కడ మాత్రం అందరికి ప్రాబ్లెమ్ వస్తది. దాని పైన మల్లి పెద్ద డిబేట్లు. మార్పు తేవాలని ఉంటె ఎవరన్నా రాజకీయాల్లోకి వెళ్లొచ్చురా. మంత్రి పదవుల్లో నలుగురు ఈ కులపోల్లు ఉన్నారు, ఇద్దరు ఈ కులపోల్లు ఉన్నారు అని వినాల్సిన దౌర్బాగ్యం పట్టింది. మన హెల్త్ మినిస్టర్ ఒక డాక్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక టీచర్ ఇలా చెప్తే ఎంత బాగుంటుంది.. ఇపుడు ఉన్నవాళ్లు uneducated అని అనటల్లేదు. కానీ కులం వాళ్ళ qualification ని dominate చేస్తుంది. మన లాంటి యూత్ పాలిటిక్స్ ని కెరీర్ ఆప్షన్ లా చుస్తే atleast ఒక 5 - 6 years తరువాత అయినా కొంచెం change రావొచ్చు"
"లీడర్ లో అర్జున్ ప్రసాద్ లా ఫీల్ అవుతున్నాడు వీడు .... ఒకడివి అనుకుంటే అయిపొద్దరా ?? ఇన్ని సంవత్సరాలు ఎంతో మంది చేయలేనిది నువ్వు చేయగలవా?"
"ప్రయత్నిద్దాం.. పోయేదేమీ ఉంది. శివ సినిమా లో సైకిల్ చైన్ సీన్ inspire అయ్యి ఎంతో మంది అలా చేతికి చైన్ లు కట్టుకుని తిరిగారు. సినిమా లో నెగటివిటీ కి inspire అయ్యాం, ఫాలో అయ్యాం. కొన్ని మంచి మెసేజ్ లు వచ్చాయిగా వాటిని ఫాలో అయితే తప్పేంటి ? "
"ఫైనల్ గా ఏమంటావు.. ఒక్కడివే ఆ బురదలోకి పోతా అంటావ్? అంతేనా ?"
"ఇపుడు మాత్రం ఒకడినే..... "