You Must Check Out These Mesmerizing Paintings By Director Devi Prasad!

మిగిలిన వారు ఈ ప్రపంచాన్ని ఒకరకంగా చూస్తే ఆర్టిస్టులకు ప్రపంచం మరో రకంగా కనిపిస్తుంది.. అలాగే ఆర్టిస్ట్ కూడా మనకు ఎప్పుడు ప్రత్యేకంగానే కనిపిస్తారు.. డైరెక్టర్ దేవి ప్రసాద్ (బ్లేడ్ బాబ్జీ, కెవ్వు కేక, లీలామహల్ సెంటర్, మిస్టర్ పెళ్ళికొడుకు) లో ఇంత గొప్ప పేయింటర్ ఉన్నారా అనిపిస్తుంది ఒక్కో ఆర్ట్ చూస్తుంటే. బొమ్మలు గీయడం, అందులో వారి తాలుకు ఆత్మ, జీవం కనిపించేలా వేయడం అనేది మనం చాలా తక్కువ మందిలోనే చూస్తుంటాం ఇందులో దేవి గారు కూడా ఒకరు. బొమ్మలలో ప్రాణాన్ని చూపిస్తున్న దేవి ప్రసాద్ గారి ప్రతిభను ఆయన వర్ణనలోనే చూద్దాం..

ఆర్ట్ ఎప్పటికీ పూర్తి కాదు. ఆర్టిస్ట్ వదిలి వెళ్ళిపోతాడంతే. “అన్నాడు ‘లియోనార్డో డ విన్సీ.”బాపు”గారు వదలివెళ్ళిన ఆర్ట్‌లో ఆయనెప్పటికీ సజీవంగానే వుంటారు.తన ప్రేరణతో కుంచెపట్టుకున్నవారినీ,పట్టుకోబోయేవారినీ చిటికెన వ్రేలు పట్టుకుని తరాలు ముందుకు నడిపిస్తూనే వుంటారు..

తన ఆశ,ధ్యాస,శ్వాస,బతుకు,మెతుకు అంతా సినిమాయే ఐన శతాధిక దర్శకులు, మా గురువుగారు “కోడి రామకృష్ణ”గారికి జన్మదిన శుభాకాంక్షలు. గత సంవత్సరం నేనాయనకు బహూకరించిన నీటిరంగుల చిత్రం ఇది..

పుట్టిన అందరిలో పుట్టుకను సార్ధకం చేసుకునే సాధకులు కొందరే..
తొందరపడి మధ్యాహ్నమే అస్తమించిన సూర్యుడు “రియల్ స్టార్”..

మహాకవి “శ్రీ శ్రీ” గారి జయంతి సందర్భంగా నా గీతలతో శ్రధ్ధాంజలి..

నాకు ఊహ తెలిశాక నేను చూసిన మొట్టమొదటి సినిమా “కృష్ణ” గారిదే. చిన్నతనంలో నేను అభిమానించిన మొదటి హీరో, నేను చూసిన మొదటి హీరో కూడా ఆయనే. తన 50 వసంతాల నటజీవితాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా నా రంగుల్లో “సూపర్‌స్టార్”..

బాపూ గారి బుధ్ధిమంతుడు సినిమాలోని ఈ స్టైలిష్ ఏ.యన్.ఆర్ స్టిల్ చూడగానే బొమ్మ గీయాలనిపించింది..

గత సంవత్సరం “కీరవాణి” గారి జన్మదిన సందర్భంగా ఈ బొమ్మ గీసి ఎఫ్.బి.లో పెడితే, గీతరచయిత చైతన్యప్రసాద్ గారు దీన్ని ఆయనకు చూపిస్తే స్వయంగా నాకు ఫోన్ చేసి నా బొమ్మ బాగాగీశారు థాంక్స్ అంటూ ధన్యవాదాలు తెలియజేశారు కీరవాణి గారు. అది ఆయన సంస్కారానికి నిదర్శనం. ఏ తరహా సంగీతాన్నైనా పాటలో మాటలు కూడా వినిపించేలా స్వరపరిచే సంగీత స్రష్ట “మరకతమణి కీరవాణి”..

మూగమనసులు, మంచిమనసులు, తేనెమనసులు వంటి మంచిసినిమాల దర్శకులు కీ’శే’ఆదుర్తి సుబ్బారావు గారు నా గీతల్లో..

గాన కోకిలమ్మ సుశీలమ్మకు నా రేఖలతో..

పూర్తికాని నా మొదటి సినిమాలో మాత్రమే నా దర్శకత్వంలో నటించిన “ఏ.వీ.యస్.”గారు…అప్పుడప్పుడూ ఫోన్ చేస్తుండేవారు.ఒకసారి ఆయన నిర్మాతగా నా దర్శకత్వంలో సినిమా చెయ్యాలని ప్రయత్నించారు గానీ జరగలేదు. ఆ మధ్య ఫోన్ చేసి మీరు బొమ్మలుకూడా గీస్తారని తెలీదు, ఫేస్‌బుక్‌లో చూశాను.చాలా బాగున్నాయ్ అన్నారు.నేనూ మీ “ఉత్తుత్తినే” చదువుతున్నాను, బాగున్నాయ్ అని చెప్పాను.వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేస్తూ,”ఏ.వీ.యస్.”గారికి శ్రధ్ధాంజలి ఘటిస్తున్నాను..

“ఈ సావిత్రి మరణించదు.. మరో సావిత్రి జన్మించదు”..

యన్.టి.ఆర్ = తెలుగు.. తెలుగు బ్రతికున్నంతవరకూ ఆ తేజానికి మరణం లేదు. ప్రాచీన భాష హోదాని సంపాదించినప్పటికీ అంతరించబోతున్న భాషల జాబితాలోకి జారబోతున్న తెలుగుని పట్టి బ్రతికించే నాయకమణ్యులెంతమంది తెలుగు రాష్ట్రాల్లో వున్నారన్నదే ప్రశ్న? యన్.టి.ఆర్ కి ఎప్పటికీ మరణం వుండకూడదని ఆశిద్దాం..

“స్వార్ధం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాధమిక స్వార్ధానికి అంతరాయం కల్గించనంతవరకే” అని కుండ బద్దలుకొట్టి సాహితీలోకంలో “అమృతం కురిసిన రాత్రి”ని సృష్టించిన కీ:శే: దేవరకొండ బాలగంగాధర తిలక్ నా పెన్సిల్ స్కెచ్‌లో..

తెలుగు సాహితీలోకపు బంగారుకొండ “రాచకొండ”..

“ప్రసన్నత కళాకారుడిలో వుంటే అతను సృష్టించే కళావిశేషంలోనూ అది ప్రాణమై నిలుస్తుంది”. అన్న వేటూరిగారి మాటలు నూరుశాతం ఆయనకు వర్తిస్తాయి.
వేటూరి గారికి
ఆకు మెదిలినా పాటే
అలలు కదిలినా పాటే
కలలు చెదిరినా పాటే
కలత చెందినా పాటే
అందుకే ఆయన పాటకు పతనం లేదు .ఆయన అక్షరానికి మరణం రాదు.
ఆ పాటల పూదోట కి నా రంగుల నీరాజనం..

భళా.. బాహుబలి..

నా రంగుల్లో ఆర్.జి.వి..

“దర్శకరత్న” అతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా..

స్వచ్చమైన ఆలోచన నుండి పుట్టే మాటలు మంత్రాలవుతాయి.
ధర్మమైన ఆగ్రహం నుండి పుట్టే మాటలు తూటాలవుతాయి.
“గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమాలోని మీ మాటలు మంత్రాలు రాల్చుతూనే తూటాలు పేల్చాయి.
మునుముందు మీ కలం తెలుగు సినిమాకిలాగే మరింత బలాన్నివ్వాలని కోరుకుంటూ మీకు నా రేఖాభినందనలు (సాయి మాధవ్ గారూ)

తెలుగు సినీ హాస్యాన్ని సింహాసనమెక్కించిన దర్శకుడు “ఈ.వి.వి. సత్యనారాయణ” గారి జయంతి సందర్భంగా నా రంగుల నీరాజనం..

మరణం లేని మహానటుడు “యశస్వి” యస్.వి.రంగారావు నా గీతల్లో..

దిగ్దర్శకులు “సత్యజిత్ రే” జయంతి[మే 2] సందర్భంగా నేనెప్పుడో గీసిన పెన్సిల్ స్కెచ్ మరోసారి..

సిరివెన్నెల గారు..

చంద్రబోస్ గారు..

సుద్దాల అశోక్ తేజ గారు..

ఆత్రేయ గారు..

మాటలను కోతికొమ్మచ్చిలాడించి “ముళ్ళవాడి వ్యంగ్యట రమణ” అనిపించుకున్న అచ్చతెలుగు హాస్యానికి నా రేఖాంజలి..

“కళాతపస్వి”..

బాలచందర్ గారు..

అజరామరమైన సంగీతాన్ని మనకందించి అమరులైన సంగీతదర్శకులు ” ఎం.ఎస్.విశ్వనాధన్” గారికి నా రేఖాంజలి..

తాను పోరాడిన క్యూబా విప్లవోద్యమం విజయవంతం అయ్యాక,తనను వరించిన అత్యున్నత పదవులన్నింటినీ త్యజించి,విదేశాల{కాంగో,బొలీవియా}లో జరుగుతున్న విముక్తి పోరాటాలలోకి సైతం దూకిన గెరిల్లా యోధుడు “చేగువేరా”, అమెరికా శిక్షణ పొందిన విప్లవ ప్రతీఘాత దళంతో పోరాడి,పట్టుబడి,
వీరమరణం పొందినరోజు అక్టోబర్ 9, 1967….ఆయన జీవితకధ ఆధారంగా తీసిన “చే” సినిమా 2008లో రెండు పార్ట్‌లుగా విడుదలయ్యింది.39 సంవత్సరాలవయసులోనే నేలకొరిగిన ఆ విప్లవజ్యోతి వర్ధంతి సందర్భంగా జోహార్లర్పిస్తూ నేను గీసిన కలర్‌పెన్సిల్ స్కెచ్..

మీ దేవీ ప్రసాద్ గా..

“నీదీ నాదీ ఒకే కధ” సినిమా దర్శకుడు “వేణు ఊడుగుల” నా రంగుల్లో…

“కృష్ణ వంశీ” గారూ! మీకు నా రేఖలతో “ఆల్ ద బెస్ట్” చెబుతున్నా..

“నువ్వు చేపట్టాలనుకుంటున్న గమ్యం నీకు చేరువలోనే ఉంది. ఇంత సేపు నీలో సాగిన అన్వేషణ,ఆవేదన,మధనం,జ్వలనం
నీ ఆశయసిధ్ధికి దిక్సూచికలు. ఇది ఇలాగే కొనసాగితే ఉద్దిష్ట లక్ష్యం నీ ముంగిట్లో వచ్చి వాలుతుంది.”
అంటూ ఉత్సాహపరిచి ధైర్యం చెప్పే కలం మూగపోయినా, ఆ కలం ప్రసవించిన అక్షరాలు ఆశయాన్ని తట్టి లేపుతూనే వుంటాయి.
మహాకవి “సి.నారాయణరెడ్డి” గారికి నా రేఖాంజలి.

If you wish to contribute, mail us at admin@chaibisket.com