చుట్టూ ఎంత మంది ఉన్నా నీ కోసమే ఎదురుచూడటం, ప్రేమా?? ఎవరెవరో వచ్చి ఏవేవో అడుగుతున్నా నీ పిలుపు కోసం వేచిచూడటం, ప్రేమా? వందల మంది ఎదురుగా ఉన్నా మాట్లాడగలిగే నేను, నిన్ను చూడగానే మాట తడపడటం, ప్రేమా? ఎవరినైనా ఎదిరించగలిగే నేను నువ్వు ఎదురవగానే ఒక్క క్షణం ఆగిపోవటం, ప్రేమా?
నీ నవ్వు చూసి మురిసిపోవటం నీతో కలిసి తిరగాలని పరితపించి పోవటం నిన్ను కలిసిన క్షణం కాలం అలా ఆగిపోవాలి అనుకోవటం ప్రేమా ?
దగ్గరున్నా చెప్పలేకపోవటం దూరమై పోతావని భయపడటం వేరెవరితోనో తిరిగితే అసూయపడటం నాతో ఒక రోజు మాట్లాడకపోతే బాధపడటం ప్రేమా?
కాలమా కాలమా నువ్వే చెప్పమ్మా ? ఈ మనసులోని కలవరానికి కారణం ప్రేమా?
"ఇంతే రాసుకుంటూ కూర్చుంటే, నీ కథ ప్రపంచం అంత తెలుస్తది కానీ తనకి మాత్రం తెలీదు"
"తనకి చెప్పాలంటే భయం రా"
"తనతో మాట్లాడటానికి కారణాలు వెతుకుతావ్, తనను కలవటానికి ఏదో వంక చెప్తావ్, అలానే నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో చెప్పటానికి కూసింత దైర్యం కూడా తెచ్చుకో రా!"
"రేయ్ ఈ కాలం లో ప్రేమ గెలవాలి అంటే రెండు మనసులు కలిస్తే సరిపోదు, కుటుంబాలు కలవాలి, కులాలు కలవాలి, మతాలు కలవాలి.. ఇన్ని ఉంటాయి. తను ఒప్పుకోదు అనే భయం కన్నా, ఈ కారణాల వల్ల ప్రేమ ఓడిపోద్ది అని ఆలోచనే నన్ను ఇలా కట్టిపడేస్తుంది" "అరేయ్ ఒకసారి చెప్తే కదా తెలిసేది. "
"చెప్పి బాధ పడే కన్నా తన ఆలోచనలలో ఆనందం గా మిగిలిపోవటం నాకు మంచిది అనిపిస్తుంది"
"రేయ్ ఒకసారి వెనక్కి తిరుగు"
*****
"జోయా???"
"ఇంత ప్రేమను జీవితాంతం నీతోనే దాచుకుని ఉందాం అనుకున్నావా?"
" పంచుకునే దైర్యం లేక, నిన్ను చుస్తే మాట రాక ఇలా ఈ ప్రేమని ఈ గుండెలోనే ఉంచుకున్న"
"ఒక్క మాట, నీ నుంచి ఆ ఒక్క మాట కోసం నిన్ను కలసిన ప్రతి సరి వేచి చూస్తున్నా"
"నేనంటే అంత ఇష్టమైతే నాతో చెప్పాలనిపించలేదా? "
"చెప్తే నువ్వు ఏమనుకుంటావో అని భయం.. తరువాత మన మధ్య దూరం పెరుగుతుంది అని అనుమానం"
"ఇప్పుడు ఈ క్షణం ఇలా మనం కలవకపోతే ఏం చేసేదానివి?"
"ప్రేయసిగా కాకపోయినా, ఒక స్నేహితురాలిగా నిన్ను ప్రతి క్షణం నవ్విస్తా, ఒకవేళ జీవితం మనల్ని దూరం చేస్తే నువ్వు ఎక్కడ ఉన్నా నవ్వుతూ ఉండాలి అని ఆశిస్తా, ఎంతైనా ఇష్టపడిన వారు ఆనందంగా ఉండాలి అనుకోవటం, వారి ఆనందంలో మన సంతోషం వెతుకోవటమే కదా ప్రేమంటే!!"
"ఐ లవ్ యు జోయా"
"కానీ అరుణ్, నీకు ఒకటి చెప్పాలి? "
"ఏంటి?"
"నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. But నాకు అదేం తెలియదు. I need you!"
ఎక్కడ? ఎప్పుడు?
Next month. Karachi lo..
Ante Pakistan?
||To be continued||