Click here to view Episode 1
ప్రేమ అంటే పోరాటం ప్రేమిస్తున్న వారితో ఆ ప్రేమ గురించి చెప్పటం ఓ పోరాటం ఆ ప్రేమను నిజం అని నమ్మించటం ఓ పోరాటం వద్దు అంటే ఆ ఊహల నుండి బయటకు రావటం ఓ పోరాటం కాదన్నాక ఎదురైతే తనని చూస్తూ ఏమి మాట్లాడకుండా ఉండటం ఓ పోరాటం నవ్వుతు నటించటం ఓ పోరాటం నవ్వుతు లోపలున్న బాధని కప్పేయటం ఓ పోరాటం
ఒకవేళ ఔనంటే
ప్రతి క్షణం తనను ఆనందంగా ఉంచాలి అనుకోవటం ఒక పోరాటం తనని ఆనందంగా ఉంచటానికి మనం చేసే ప్రతి ప్రయత్నం ఒక పోరాటం తను కనే కలలను నెరవేర్చటం ఒక పోరాటం అతి ప్రేమ వల్ల వచ్చే కలహాలను ఎదురుకోవటం ఒక పోరాటం నాతో ఉండాలి, నాతో మాత్రమే ఉండాలి అనే ఆలోచనల మధ్య నలిగిపోవటం ఒక పోరాటం ఆ ఆలోచనల నుండి దూరం ఎలా బయటకు రావాలి అనే ఆలోచన ఒక పోరాటం ప్రేమించిన అమ్మాయిని గెలుచుకోవటం, ప్రేమను గెలిపించటం ఒక పోరాటం
"రేయ్ పిచ్చెమన్న పట్టిందా? పాకిస్థాన్ పోతావా?" "ప్రేమిచిన వారికోసం సప్త సముద్రాలూ దాటి పోతున్నారు, పక్కనున్న పాకిస్థాన్ పోలిన!" "ప్రాణాలు పోతాయ్ రా" "నన్ను తను ఎప్పుడైతే ప్రేమిస్తున్న అని చెప్పిందో అప్పుడే ఈ ప్రాణం తనదైపోయింది. ఇపుడు నాతో ఉంది దేహం మాత్రమే.." "నిజంగానే పిచ్చిపట్టింది నీకు!" "ఇపుడు నువ్వు అక్కడికి వెళ్లి తిరిగి ఒద్దామనే?" "ఒక్కడినే అయితే మాత్రం రాను. వస్తే తనను తీసుకుని మాత్రమే వస్తా." "అంటే??" '....." "రేయ్ ఆ నవ్వుకు అర్ధం ఏంటి? నిన్ను చుస్తే భయమేస్తుంది. " "ఇన్నాళ్లు భయపడుతూనే బ్రతికారా .. ఇపుడు బ్రతుకుతా.. తన కోసం .." "నేనేం అంటున్న నువ్వు ఏం చెప్తున్నావ్?" *******After A Week - Samajhauta Express******** "తార" "అర్జున్" "మీరు కూడా పాకిస్థాన్ చూడటానికి వెళ్తున్నారా" "ప్రేమను గెలుచుకుంటానికి వెళ్తున్నా" "What?? you sound crazy!!" "మీరు?" "I just love travelling.. I wanna explore!" "Great" "తన పేరేంటి?" "జోయా" "చాలా బాగుంది పేరు." "తను కూడా చాలా బాగుంటుంది. నాలోనే దాచుకున్న ప్రేమను నెల రోజులు ముందు బయటపెట్టేలా చేసింది. భయపెట్టిన మరుక్షణం తనకు పెళ్లి అని చెప్పింది. అయినా నువ్వే కావాలి అని అంది. ఈ నెల రోజుల్లో అలా దగ్గరయ్యి మళ్ళా దూరం అయింది. ప్రేమ గెలవదు అనే భయమో, నాకు దూరం అయిపోతున్నాను అనే అనుమానమో నాకు ఇలా దగ్గరయ్యి అలా దూరం అయిపొయింది. తను నన్ను నమ్మింది, తన నమ్మకాన్ని గెలిపించడానికి ఇపుడు నేను తన దగ్గరకి వెళ్తున్నా..!" ||To be continued||