(Contributed By Somasekhar Kodipalli)
నా అందమైన చెలికి,
పువ్వు పూసింది...
కాయ కాసింది...
నీపై నాకు ప్రేమ పుట్టింది.
నీ అందమైన కళ్ళు, తెల్లటి బుగ్గలు, ఎర్రటి పెదాలు.. ఇలా మొత్తం..
మొత్తంగా చాలా అందంగా ఉన్నావ్. అందుకే నాకు నచ్చావ్.
నీ రింగుల జుట్టు నన్ను రింగులోకి దింపి, నీ చుట్టూ తిప్పుతోంది.
నీ బర్తడేరోజు లంగావోణిలో చూసినప్పటినుండి గాలిలో తేలుతున్నాను..
నా చేయి అందుకుని నేలపైకి లాగవా..
నిన్న నేను ప్రేమిస్తున్నాను..
మై నే ప్యార్ కియా..
నాన్ ఉన్నై కాదలిక్కిరన్..
I love you..
I love you.. so much
Note:నిన్ను మరోసారి లంగావోణిలో చూడాలనివుంది.. అనుమతిస్తే.
ఇట్లు,
నీ ప్రేమకొసంవేచి ఉన్న
@@@@@@@
ప్రియాతి ప్రియమైన ప్రేయసికి,
ఆకాశం నీలంగా ఉంటుంది,
వానకురిసే ముందు నల్లగా ఉంటుంది,
కురిసాక తెల్లగా మారుతుంది.
నువు నాకెప్పుడూ అందంగా కనిపిస్తున్నావు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
ప్రకృతిలో మార్పులోస్తాయోమో కానీ,
నీమీద నా ప్రేమ ఎప్పటికీ మారదు.
నీపై ఎంతప్రేమో తెలుసా..?
మాథ్స్ లో cent మార్క్స్ వచ్చినా రాని ఆనందం, నువు నా వైపు చూస్తే వస్తుంది.
నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా..?
నిన్ను తిట్టాడని physics lecturerకి lights ఆపి దుప్పటేసామ్.
నీకోసం నేనేదైనా చేస్తా....
I love you..
I love you... so much..
No. అని చెప్పొద్దు plz.
Note: నీతో సినిమా చూడాలనిఉంది... అనుమతిస్తే.
ఇట్లు,
నీ ప్రేమకొసంవేచి ఉన్న
@@@@@@@
ప్రియా,
నిను చూడాలనివుంది,
చూస్తూ మాట్లాడాలనివుంది,
మాట్లాడుతూ తాకాలనివుంది,
తాకుతూ జీవితాంతం బతికేయాలనివుంది...
నిను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలి..?
నువు లేకపోతే బతకలేనని ఎలా చెప్పాలి..?
నాలోని సాగరమంత ప్రేమ ప్రశాంతంగా కనిపించినా..
ఉప్పొంగే అలలు ఎగిసి ఎగిసి తీరానికి.. నీ ముందుకు తీసుకోచ్చాయి.
ఇంద్రధనస్సు మదిలో బాణాలు వేస్తోంది,
ఒంటరిగా వానలో తడుస్తున్నానని.. నీతోడు లేక.
సూర్యుడు ఎదలో మండుతున్నాడు,
నా నీడగా నువు లేక.
నా ప్రాణం తల్లడిల్లుతోంది,
నువు దూరమైతే.. ఊపిరందుకోలేక.
నాకు తోడుగా, నీడగా, ఊపిరిగా ఉంటావా...??
Note: నీ చేయి పట్టుకుని నడవాలనివుంది.. అనుమతిస్తే
ఇట్లు,
నీ ప్రేమకొసంవేచి ఉన్న
@@@@@@@
విరిసిన సన్నజాజికి....
శ్రవ్యమైన స్వరానికి....
అడగక వచ్చిన వరానికి...
ప్రేమతో రాస్తున్న ప్రణయగీతిక,
నీ విజయానందంలో వజ్రకిరీటి అలంకరణలా..
చల్లని కన్నులచాటు నల్లని కాటుకలా..
ముఖారవిందంపై అరుణోదయ కిరణంలా..
ఎదపై కురిసే వెచ్చని వెన్నెలలా..
నల్లని ధుపాల్లాంటి కురులు దాచిన బొండుమల్లెలా..
ఉండాలనే ఆశ...
మన బంధాన్ని సాగరతీరాన జంటపక్షుల్లా సాగించాలనే ధ్యాస...
నా శ్వాస విడిచేవరకు..
నీ దీపము కొండెక్కేవరకు..!
శ్రీ శ్రీ కవితలో యతి-ప్రాస లా
త్యాగరాయ కీర్తనలో శ్రుతి-లయలా..
మన బంధం అభ్యుదయమో... లేక అవ్యయమా...
రక్తసంభంధాన్ని మించిన అనుబంధమో... ఆకాశానకేసి చూస్తే తెలుస్తుంది..!!
చివరి మాటగా..
గాల్లో దీపమైన నా మదికి గూడులా చేరి, గుడిలా మారావు.
నా ఎదలో ఒదిగిన గుడికి పూజారిలా మారి ఉపవాసం చేయాలో...
సన్యాసిలా మారి ఉపన్యాసం ఇవ్వాలో...
చెప్పవామరి..??
Note: నీ చేతిని ముద్దుపెట్టుకోవాలనివుంది.. అనుమతిస్తే
ఇట్లు,
నీ ప్రేమకొసంవేచి ఉన్న
@@@@@@@
ఇది,
కళ్యాణ శుభలేఖకై
ప్రేమలేఖా...?
ఏంటో తెలుసుకోలేక
నా మదిలో తికమక.
సుకుమారికి ప్రేమతో,
మీరు నాకు నచ్చారు.
మా అమ్మను మెప్పించేలా ఉన్నారు.
మా నాన్నను గౌరవించేలా ఉన్నారు.
నన్ను నాలాగే బతకనిచ్చేలా ఉన్నారు.
మీరు నాకు బాగా నచ్చారు.
నా ప్రేమనంతా మీకే ఇచ్చేలా నచ్చారు.
మీ ప్రేమనంతా నాకివ్వుగలరా...?
నన్ను పెళ్ళి చేసుకుంటారా..?
Note: మిమ్మల్ని హత్తుకోవాలని ఉంది... అనుమతిస్తే.
ఇట్లు,
నీ ప్రేమకొసంవేచి ఉన్న
@@@@@@@