పాటశాల కాదు పాఠశాల అని రాయాలి, శపధం కాదు శపథం అని రాయాలి, భాద అని కాదు బాధ అని రాయాలి.. స్వాతి మ్యాగజైన్ లో ఇప్పటికి తెలుగులో మీ తప్పొప్పులు తెలుసుకోండి అని ప్రచురిస్తున్నారు. ఐతే ఇప్పుడు చేతిలో బుక్స్ కన్నా మొబైల్ ఎక్కువసేపు ఉంటుందని తెలుసుకున్న ఒక ఔత్సాహికుడు 'తెలుగు పదాలతో ఒక ఆటను తయారుచేశాడు'.
ఇందులో వివిధ రకాల తెలుగు పదాలతో 125 ప్రశ్నలను అడుగుతారు. 125 ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానాలు బట్టి మీ తెలుగు స్థాయి ఏ విధంగా ఉందని తెలియజేస్తారు. ఎప్పటికి ఇంగ్లీష్ లోనే స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోవడం మాత్రమే కాదు మన తెలుగులోనూ మన స్థాయి తెలుసుకుంటే తెలుగును కాపాడినవారమవుతాము. ఓసారి ట్రై చేసి మీ స్కోర్ ఎంత వచ్చిందో సరదాకి కామెంట్ పెట్టండి..