Nikhil career lo one of best films "Karthikeya". Oka manchi well packed thriller ga ippatiki ee movie ante chaala mandhiki ishtam. Ee movie sequel ga "Karthikeya 2" vasthondi. Recent ga Concept video release chesaaru. Eesari Dwaraka Mystery ni deal cheyabothunnadu Karthikeya. Click here to know more about Dwaraka Mystery
ఈ concept video lo మొదట "కలియుగే ప్రథమ పాదే" అనే మంత్రం వస్తుంది. ఆ మంత్రాన్ని "సంకల్పం" అంటారు. సంధ్యావందనం చేస్కుంటున్నప్పుడు, ఏదైనా వ్రతం, యాగం చేస్కుంటున్నా కానీ సంకల్ప మంత్రం చెప్పాక మొదలు పెడతారు. పూర్తి మంత్రం ఇది.
ఓం మమోపాత్త దురితక్షయద్వారా (దేవుని పేరు) ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,షోడశోపచార పూజాం కరిష్యే (ఆ పూజ చేసే సందర్భం బట్టి, కారణం బట్టి ఈ మంత్రం కొన్ని మార్పులు ఉంటాయి).
ఒక పూజ కానీ, యాగం కానీ, చేయడం వల్ల జరిగే మంచి కలిగే ఫలం ఆ యాగం చేసే వ్యక్తి ఒకరికే కాదు, ఈ ప్రపంచం (కలియుగ మొదటి పాదం లో ఉన్న జంబూద్వీపమనే ఈ ప్రదేశం లో భారతవర్షం అనే దేశానికి చెందిన భారత ఖండం లో) ఉన్న ప్రతి ఒక్కరికి దక్కాలి. అందరికి క్షేమం, విజయం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్షు దక్కాలని, ధర్మం, అర్ధం, కామం, మోక్షం ఈ నాలుగు రకాల ఫలాలు అందరికి చేకూరాలని, అందరి తరుఫున ఆ యాగం చేసే వ్యక్తి సంకల్పించుకుని ఆ యాగాన్ని మొదలు పెడతాడు. వసుదైక కుటుంబం(అందరం ఒక్కటే కుటుంబం) అనే నిస్వార్థమైన ఆలోచన ఈ సంకల్ప మంత్రం వెనుక ప్రధాన ఉద్దేశం.
మురారి సినిమా లో చెప్పినట్టు "అన్నిటికన్నా సంకల్పం గొప్పది". నాకే దక్కాలి అనే స్వార్ధం కన్నా, దక్కిన ఫలితం అందరికి పంచాలి అనే సంకల్పం చాలా గొప్పది. రుగ్వేదం లో ఉండే ఈ మంత్రం, ఆ మాటని ఇంకా బల పరుస్తుంది.
ఈ concept video లో ఈ మంత్రమే కాకుండా, నీతి శాస్త్రం కి సంబంధించిన ఒక వాక్యం కూడా ఉంటుంది. మహాభారతం అప్పటి మన ఇండియన్ మ్యాప్ illustration ఉంటుంది.
పైన picture లో హిందీ లో ఉన్న లైన్స్ కి అర్థం: నీతి శాస్త్రం లో ఇలా రాశారు ధనం పుత్రుడు కళత్ర అంటే భార్య మొదలైన వాటి కంటే కూడా ఎక్కువ మన శరీరం ఎక్కువ కాపాడుకోవాలి దీని కోసం ధన్వంతరీ ముందు నుంచే లోక హితమును గూర్చి ఆలోచించి వైద్య శాస్త్రం లో వివిధ రకాల వైద్య విధానాలు రచించారు.
ఈ మూవీ లో హీరో డాక్టర్. అతని characterization కి సంబంధించిన statement ఇది.
మహాభారతం లో కురుక్షేత్రం అయినా తరువాత శ్రీ కృష్ణుడి నిర్వాణం వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ని చాల detailed గా NTR గారి కృష్ణావతారం అనే సినిమా లో చివరి అరగంట లో చెప్పారు.
కృష్ణుడి కాలి బోటనీ వేలుకి ఒక బోయవాని బాణం తగిలి అవతారం చాలించిన తరువాత, అతని రాజ్యం అయినా ద్వారకా సముద్ర గర్భం లో కలిసిపోయింది అని, ఆ ద్వారకా కి చెందిన అమూల్యమైన సంపద, ద్వారకా నిర్మాణం వెనుక ఉన్న శాస్త్ర పరిజ్ఞానం ఇంకా సముద్ర గర్భం లో ఉన్నాయి అని చాలా మంది నమ్మకం. Research కూడా జరుగుతోంది. ఈ mystery ని base చేస్కునే వెంకటేష్ "దేవి పుత్రుడు" సినిమా ఇప్పుడు ఈ సినిమా వస్తోంది . Hope this movie will give good cinematic and thrilling experience.