సుశీలమ్మ, జానకమ్మ, చిత్రమ్మ వీళ్ళందరిని అమ్మ అని గౌరవంగా పిలుచుకుంటాం.. కాని వారి తర్వాతి స్థానం అయినా సునీతను మాత్రం అమ్మ అని అసలు పిలవలేం ఎందుకంటే తన గొంతులోని యవ్వనపు మాధుర్యం అలాంటిది మరి. తన ప్రతిభ కేవలం పాటలకు మాత్రమే పరిమితం అవ్వలేదు.. డబ్బింగ్ అర్టిస్ట్ గా కూడా ఒక సింగర్ కున్నంత అభిమానులను సంపాదించుకున్నారు.. 1978 మే 10న గుంటూరు జిల్లాలో జన్మించిన సునీత తన సంగీతాన్ని నేర్చుకొని కేవలం 10 వ ఏట నుండే స్టేజ్ షోస్ ఇవ్వడం మొదలుపెట్టారు. కృష్ణవంశి గులాబి సినిమా లోని ఈ... వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు... పాటతో తన పాటల పూదోటను ప్రారంభించారు.. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 3,000 పాటలను, దాదాపు 750 సినిమాలలోని హీరోయిన్లకు తన స్వరం ద్వారా వారిలోని భావాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఒక రూపమిచ్చారు.. ఒక పెళ్ళి కాని అమ్మాయిలోని వగలు, కోప తాపాలు, ప్రేమ తాను పలికించినంతంగా ఇప్పటి కాలంలో ఇంకెవ్వరు పలికించలేరేమో అన్నంత హాయిగా ఉంటుంది.. ఉత్తమ గాయనీగా అతడే ఒక సైన్యం(నా పాట), గోదావరి(అందంగా లేనా) సినిమాలకు ఉత్తమ గాయనీగా, జయం, ఆనంద్, పోతేపోని, శ్రీరామ రాజ్యంలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం నుండి నందులను గౌరవంగా గెలుచుకున్నారు.. ఇళయరాజా, ఏ.ఆర్. రెహమాన్, కీరవాణి, మణిశర్మ, దేవీశ్రీప్రసాద్ లాంటి అత్యత్తమ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు..
తన గాత్రంలోని కొన్ని మధుర గీతాలు 1. ఈ.. వేలలో నీవు ఏం చేస్తు ఉంటావు..
2. అందంగా లేనా..
3. నా పాట..
4. ఏం సంబందం లేదు..
5. నునుగు మీసలోడు..
6. వెలుతున్నా వెలుతున్నా..
7. పెదవి దాటని..
8. గుండు సూది..
9. చందమామ కథలో చదివా..
10. నన్నేదొ సెయ్యమాకు..