కోపం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చూసారా ?
బాధ కన్నీరు పెడితే ఏమవుతుందో తెలుసా?
ఆవేశం అరుపు ఎప్పుడైనా విన్నారా?
భావావేశం బులెట్ లా మారుతుందని కలగన్నారా ?
పోనీ... కనీసం
రక్తం మరిగి రచనలా పలుకుతుందని,
హృదయం కరిగి కవితలా మారుతుందని,
ప్రేమ పొంగి పద్యమై పాడుతుందని,
ద్వేషం పెరిగి దండయాత్ర చేస్తుందని మీరెప్పుడైన అనుకున్నారా. కనీసం ఎవరైనా అంటుంటే విన్నారా. లేదు కదా. అయితే ఈ వ్యాసం చదవాల్సిందేనండి(తెలిసినా చదవండి తప్పు లేదు కదా).
పదండి...
పైన చెప్పిన వాటిని అన్నిటిని అనుభవించిన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయన గురించి ఇప్పటివరకు మనం వినకపోయుండొచ్చు, మన పెద్దోళ్ళు చెప్పకపోయుండొచ్చు, వాళ్ళ పెద్దొళ్ళకి తెలియకపోయుండొచ్చు.కాని, అలాంటి వ్యక్తి గురించి మన తరానికి తెలియాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది.
ఆయన తను అనుభవించిన ప్రతీది ప్రజలందరికి పంచాలని కవితలు ,పద్యాలూ, వ్యాసాలు, కథలు ఇలా ఉన్న పద్దతులు అన్నిటిలో ప్రయత్నించారు. కనుక, ఆయన రచనలలోని కొన్ని ముఖ్య పంక్తులు అయినా మనకి తెలిసుంటే బావుంటుంది అనే ఉద్దేశంతో...
తామే గొప్ప, తాము చేసిందే వేదం,తాము లేకపోతె అసలు సృష్టే లేదు అన్నటు ప్రవర్తించే వారిని ఉద్దేశించి...
తాము చెప్పినట్టు జరుగుతుంది, తమకు ఎదురు నిలిచే వారే లేరు అన్నట్టు ప్రవర్తించే వారిని ఉద్దేశించి...
జరుగుతున్నా పరిణామాలకు ఏమి చేయలేక...
ప్రకృతిలో తానూ ఒక భాగం అంటూ...
నీకెందుకింత అశాంతి, నీకెందుకింత ఆవేశం అంటే...
ఏది లేకపోయినా...
ఎందుకు ప్రజలకు జ్ఞానం భోదపడదు అన్నప్పుడు...
పట్నం జీవితంలో ఇమడలేక...
జీవితం గురించి ఒక్క మాటలో...
మీరెలా ఇలా కవితలు రాయగలరు అన్నప్పుడు...
నిజంగా కోల్పోవటం అంటే...
ఈ దేశంలో బ్రతకటం గురించి...
దేశం లోని దౌర్జన్యాలు చూడలేక...
ఆత్మాభిమానం గురించి...
ఆయన, జనం మేలుకొని ప్రభంజనం అవ్వాలని కోరుకున్నారు. నేల విడిచి సాము చేయటం మాని, నేల సాగు చేయటం తెలుసు కోవాలన్నారు. పట్నం లో ఇనుప గోడల మధ్య బందీగా ఉండటం కన్నా, పొలంలో దుక్కి దున్నటం గొప్పని ఆయన అభిప్రాయం. ఆయన రచనలు చదివితే ఉత్తెజితులు అవ్వటం ఖాయం. కుదిరితే ప్రయత్నించండి, గూగుల్ తల్లిని అడగండి ఆయన గురించి.
రవీంద్ర నాథ్ టాగూర్ తర్వాత నోబుల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ చేయబడిన సాహితీవేత్త... గుంటూరు శేషేంద్ర శర్మ గారు!