This Hard Hitting Video Of A Journalist's Anguish On Politicians & Their 'Gimmicks' Is An Eye Opener!

Updated on
This Hard Hitting Video Of A Journalist's Anguish On Politicians & Their 'Gimmicks' Is An Eye Opener!

“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని “ అని అన్నాడో రచయిత. అదే చేసింది ఓ పాత్రికేయురాలు,మిర్రిర్ నౌ చానెల్ లో ఒక చర్చ కార్యక్రమంలో ఫాయే డి సౌజా అనే పాత్రికేయురాలు ప్రజలని మభ్యపెట్టి దిగజారుడు రాజకీయాలు చేసే రాజకీయ నాయకులని తన ప్రశ్నలతో నిలదీసింది.ప్రజలని చైతన్యవంతులుగా మారమని లేదంటే మనుగడే లేదని జరుగుతున్న దుష్పరినామానలను ఉదాహరిస్తూ వివరించింది. తనేమందో విపులంగా చెప్పాలంటే...... “ఒరేయ్ వెర్రి నాగన్నా...... నీకొచ్చే కష్టాల గురించి ఎవరికీ పట్టదురా......నీకు జరిగే నష్టాల గురించి ఎవరికీ అవసరం లేదురా.... నిన్ను మతాల మత్తులోకి దిన్చేస్తారురా,నిన్ను కులలా ఉచ్చు లోకి లాగేస్తారురా.... పేదా ధనిక అంతరాలు ఎవరూ తగ్గించరు కాని నీకు నీ వాళ్ళకి మధ్య విభేదాలు మాత్రం సృస్టిస్తారురా..విద్వేషాలు రగిలిస్తారురా....నీకు తెలియని విపరీత ధోరణులను నీకు నేర్పిస్తారురా.... నీ ఆకలి కేకలు వాళ్ళకి వినిపించవురా.....నీ ఆర్తనాదాలు అసలే పట్టవురా..... నువ్వు పీల్చే గాలి,తిరిగే నేలా,తినే తిండి,తాగే నీరు కలుషితం అయినా అదేమంత పెద్ద విషయం కాదురా వాళ్ళకి.... రోజులు,నెలలు,ఏళ్ళు చెమట ధారపోసి నువ్వు సంపాదిస్తూ పన్నులు కట్టే సొమ్ము .....ఉఫ్ ..అదెంతరా వాళ్ళకి నువ్వసలు లెక్కలోకే రావురా పిచ్చి భద్రయ్య..... నిన్నసలు మనిషిగా కూడా చూడరురా.....నువ్వొక ఓటువి అంతే.....కేవలం ఐదేళ్లకోసారి మాయామాటల్తో నిన్ను ఆ నిమిషంలో నమ్మించగలిగితే సరిపోతుంది....తరువాత నీగతేమైనా పట్టించుకోరురా...... ప్రజాస్వామ్యం అంటే అదో పరిహాసంరా వాళ్ళకి,నువ్వు ప్రభువువి కాదురా,కనీసం ప్రజలుగా కూడా గుర్తించరురా,నువ్వో పీడితుడివి నీ ఆలోచనల్ని కూడా ప్రభావితం చేసేస్తారురా వెర్రి నాగన్న......నువ్వు నమ్మేలా అబద్దాలని సృష్టిస్తారు... ఇప్పటికైనా మేలుకుందాం....నీ కులం,నీ జాతి,నీ మతం ఇవి కాదు...నీ కష్టం,నీ భాధ,నీ సమస్య వీటి గురించి చర్చించమని నిలదీయి....”

ఓ జాతీయ వార్తా చానెల్ లో ప్రైమ్ టైం లో జాతీయ స్థాయి నాయకులతో చర్చలో ధైర్యంగా, నిర్భయంగా, నిర్మొహమాటంగా తను సందించిన ప్రశ్నలు చాలా మందిని ఆలోచించేలా చేసాయి.... నోరు పెద్దది చేసి అవతలి వాళ్ళ మీదకి అరిచేయడం,చిల్లర తగువులని,పనికిమాలిన విషయాలని రోజుల తరబడి, గంటలకొద్దీ చర్చలు జరిపే మన తెలుగు వార్తా చానళ్ళు చూసే మనకి ఇలాంటి ఒక జర్నలిస్టుని చూసి చాలా కాలమే అయ్యింది.....మీరు ఓసారి చుడండి.....తను చెప్పినదాని గురించి ఆలోచించండి....