చిన్నప్పుడు మనకు ఒకరి మీద ఇష్టం ఏర్పడితే ఆ తరువాత ఏది ఏమైనా ఆ ఇష్టం పోదు. అలా నేను ఇష్టపడిన వాళ్లలో మణిశర్మ గారు ఒకరు. ఇప్పటికి పాత మణిశర్మ గారి పాటల్ని కొత్త పాటలు వినేంత ఉత్సాహం తో వినే వాళ్లలో నేను ఒకడ్ని. "అంతలా ఎందుకు ఇష్టం మణిశర్మ?" అంటే కారణాలు అనేకం..
చిన్నప్పుడు మెట్లు దిగుతున్నప్పుడు, తెలియకుండానే ఇంద్ర సినిమా లో మెగాస్టార్ మెట్లు దిగుతుంటే వచ్చే background మ్యూజిక్ ఊహించేస్కునే వాడ్ని, ఎవరైనా పాట పాడమంటే "అమ్మాయే సన్నగా" "నలుగురికి నచ్చినది" పాడేసే వాడ్ని. అలా నా జీవితం అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు అయిపోయారు.
చిరంజీవి, బాలయ్య లను మొదలుకుని, అప్పుడే కొత్తగా వచ్చిన మహేష్ బాబు వరకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చేవారు. టీ షాపుల్లో ప్లే అయ్యే "రామ్మా చిలకమ్మా" నుండి, పెళ్లి లో వినిపించే "అలనాటి రామ చంద్రుని" పాట వరకు ఆయన కంపోజ్ చేయలేని పాట ఏది లేదు.
ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. "ఈయన మాస్ పాటలు బాగుంటుంది" "ఈయన మెలోడీస్ బాగుంటాయి" అని. కానీ మణిశర్మ గారి పాటలు అన్ని బాగుంటాయి. "Lux papa" లాంటి ఊపున్న ట్యూన్ ఇవ్వగలరు. "యమహా నగరి" లాంటి పాట తో అంతే శ్రావ్యంగా మనపై ప్రభావం చూపగలరు.
చిన్నప్పుడు సంగీతం అంటే తేలినప్పుడు విన్నప్పటినుండి, ఇప్పుడు సంగీతం అంటే అవగాహన వచ్చిన తరువాత , విన్నా కానీ ఆయన మీద అభిప్రాయం ఇంతైనా మారలేదు. అభిమానం ఇంకా పెరిగింది. 2000 కాలం లో ఆయన పరిచయం చేసినన్నీ ట్యూన్స్‌ని, సింగర్స్ ని ఇంకెవరు పరిచయం చేయలేదేమో, వెస్టర్న్ మ్యూజిక్ అయినా, క్లాసిక్ మ్యూజిక్ అయినా, సినిమా కి అడాప్ట్ చేయడం లో ఆయన తరువాతే ఎవరైనా.
ఆయన మాట్లాడటం నేనెప్పుడూ ఎక్కువ చూడలేదు. కానీ ఆయన పాటలు మాత్రం ఆయన గురించి చాలా చెప్పేవి, సాహిత్యానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యం గురించి చెప్పేది, ప్రతిభావంతులైన కొత్త సింగర్స్ ని ఆయనెంత ప్రోత్సహహించేవారో చెప్పేది. సంగీతం లో ఆయనకున్న జ్ఞానం గురించి ఇంకా చెప్పేది. ఇలా ఆయన పాటలు విన్న ప్రతి సారి ఆ పాట ఆయన గురించి ఏదోకటి చెప్పేది. బహుశ "మనం చేసే పని మాట్లాడాలి, మనం కాదు." అంటే ఇదేనేమో.
ఆయన గురించి నాకు గట్టిగా చెప్పిన కొన్ని పాటలని ఇక్కడ పొందుపరుస్తున్నాను.. మీరు కూడా మీకు నచ్చిన పాటలని కామెంట్ చేయండి. "Let's talk with music"
అప్పటికి ఇప్పటికి ఎప్పటికి, నా మ్యూజిక్ లిస్ట్ లో చెరగని పేరు మణిశర్మ, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అంటే గుర్తొచ్చే పేరు మణిశర్మ, BGM అంటే గుర్తొచ్చే పేరు మణిశర్మ.. ఇప్పటికి ఏ సినిమాలో అయిన పాటలు బాగోక పోతే, "మణిశర్మ కొట్టుంటేనా వేరేలా ఉండేది" అని అనిపిస్తుంది . మణిశర్మ గారు, మీరలా మా చేత అనిపిస్తూనే ఉండాలి, మీ పాటలు లూప్ లో మాకు వినిపిస్తూనే ఉండాలి అని మనసా వాచా కర్మనా కోరుకుంటున్నాను.