Contributed By Pankaj Barla
నేపధ్యంలో శాస్త్రీయ సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న వేదిక, దాని ముందు ప్లాస్టిక్ కుర్చిలలో కొంతమంది కుర్చుని ఉన్నారు. కుర్చీల వెనుక మరికొంతమంది నిల్చుని చూస్తున్నారు. హాలు అంతా నిండలేదు కొన్ని కుర్చీలు ఖాళీగా కూడా ఉన్నాయి. అది ఒక శాస్త్రీయ నృత్య పోటి, ఆ వెనుక నిల్చున్న వాళ్ళలో గెడ్డంతో ఉన్న ఒకతను పక్కన నిల్చున్న అతనితో "ఏంట్రా ఇది? అసలే మనకు డాన్సులు అంటే పడవు, అందులోను క్లాసికల్ డాన్సు, పదరా వెళ్దాం" పక్కన ఉన్న అతను నల్లటి చొక్కాలో, సన్నగా, చిందర వందర జుట్టుతో "ఎంతసేపురా, ఒక అరగంట చూసి వెళ్దాము, అసలు ఎవరికీ ఆసక్తి లేకపోతే, ఎవరు చూస్తారు ఇలాంటి కార్యక్రమాలు, ముందు తరాల వారికి ఎలా తెలుస్తుంది అందులో ఉన్న గొప్పతనం" గెడ్డం తో ఉన్న వ్యక్తి "ఛా, చెప్పావులేరా, నేను వెళ్లి దమ్ముకోడుతుంట, నువ్వు అయ్యాకనే రా" అని వెనుక తలుపు నుంచి వెళ్ళిపోతాడు.
స్నేహితుడు వెల్లిపొయాక, వెనుక ఖాలీగా ఉన్న కుర్చిలో కూర్చుని రొహిత్ చూస్తుంటాడు. ఇంతలో ఒక అమ్మాయి నాట్య ప్రదర్శన ప్రారంభిస్తుంది. తనను రొహిత్ ఆసక్తిగ చూస్తాడు. అది చూడగానే రోహిత్ కి బాగా నచ్చింది, అమ్మాయో లేక నృత్యమో కాదు రెండీటి కలయిక. కాలక్షేపానికి బయట ఉన్న బోర్డు చూసి విశ్రాంతి కోసం వస్తే లోపల ప్రశాంతత దొరికింది అతనికి. తను అక్కడ ఉన్నందుకు ఒక అర్థం వచ్చినట్లు అనిపించింది. ఆ అమ్మాయి ప్రదర్శన అయి వెళ్ళాక కుడా తనే అతని మనసులో మెదులుతుంది. కొంత సమయం తర్వాత, ఆ అమ్మాయి వెనుక ఉన్న కుర్చిలలో కూర్చుని మిగతా ప్రదశన దీర్ఘంగా చూస్తుంటుంది. ఆలోచనలో ఏదో రాసుకుంటున్న రోహిత్ అమ్మాయి తన పక్కన ఉన్న విషయం గమనిస్తాడు. కూచిపూడి దుస్తులలో, కొంచెం అమాయకత్వం, కొంచెం భయంతో అలసిపోయిన ముఖంతో చూస్తూ ఉంటాది. వెంటనే రోహిత్ ఆ అమ్మాయిని చూసి చిరునవ్వు ఇస్తాడు, అమ్మాయి కూడా భయంగా కనపడుతూనే కళ్ళతో చిరునవ్వు పంచుకుంటుంది.
"చాల బాగా నాట్యం చేసారండి" అంటాడు రోహిత్. "అవునా, థాంక్స్ అండి" అని మళ్ళి ప్రదర్శన చూస్తూ ఉంటాది అమ్మాయి "మిమ్మల్ని చూస్తే టెన్షన్ గా కనపడుతున్నారు, ఎందుకండీ అంత భయం?" అంటూ సంభాషణ కొనసాగిస్తాడు. ఆ అమ్మాయి "ఇదే ఆఖరి ప్రదర్శన, దీని తర్వాత విజేతలు ప్రకటిస్తారు, అందుకని"
రోహిత్: "ఓహ్, ఆల్ ది బెస్ట్, మీరు చాల బాగా చేసారు, బాగా చేసినట్లు మీకు అనిపిస్తే చాలు గెలవడమనేది కార్యకర్తల అభిరుచిని బట్టి ఉంటాది" అప్పుడు అమ్మాయి "నీ నృత్యం నీకు నచ్చితే అది సంతృప్తి అదే సభకు నచ్చితే అది కళ, నాకు కళాకారిణిగా పేరు తెచ్చుకోవాలని ఉంది" అని సమాధానం ఇస్తాది రోహిత్: "బాగా చెప్పారు అండి, తనని కాకుండా ఎవరినైనా తన కళతో ఆనందపరిచేవాడే కళాకారుడు" అమ్మాయి నవ్వుతు "హహ, సరిగ్గా చెప్పారు, అయితే నేను టెన్షన్ పడొచ్చని ఒప్పుకుంటారా మరి" రోహిత్ నవ్వుతూ "టెన్షన్ పడొచ్చు, తప్పులేదు, ఎంత టెన్షన్ పడితే అంత పెద్ద బహుమతి వస్తుంది అంటే పడొచ్చు" అమ్మాయి: " ఇంక చాలండి మీ ఎకసక్కెము , ఇన్ని రోజులు నేను చేసిన కృషి , గెలుపు అనే లక్ష్యం చేరుకునే క్షణం కోసమే కదండీ " రోహిత్: "కళాకారిణి అవ్వడం మీ లక్ష్యం అయినపుడు గెలుపు గురించి ఆలోచించకూడదు" అమ్మాయి: "అదెలా? గెలిస్తేనే కదండీ ఎవరైనా కళాకారులను గుర్తించేది" రోహిత్: "కాదు, కళాకారులను గుర్తించేది వారిలో ఉన్న కళను చూసి, గెలుపును చూసి కాదు" అమ్మాయి: "కానీ వారిలోని కళను ఇతరులు గుర్తించారో లేదు ఎలా తెలుస్తుంది?" రోహిత్: "అది తెలిసినపుడు వారిలో గెలవాలి అనే కోరిక ఉండదు" అలా ఆ అమ్మాయి కాసేపు అంతా మర్చిపోయి రోహిత్ తో మాట్లాడుతాది, ఇంతలో ఆఖరి ప్రదర్శన అయిపోద్ది. అమ్మాయి: "మాటల్లో మీరెవరో అడగడమే మర్చిపోయాను, నేను వందన, మీరు?" రోహిత్: "మీరు కళాకారిణి అని నమ్మిన వాడిని" అని వందన చేతిలో ఒక కాగితం పెడతాడు వందన అర్ధం కానట్లు చూస్తూ ఏంటిది అని అడిగేలోపే, మూడవ బహుమతి అని ప్రకటిస్తూ ఉంటారు. వందన “ ఒక్క నిమిషం” అని ఆసక్తిగా చూస్తూ ఉంటాది, తన పేరు ఉండదు. రెండు, ఒకటవ బహుమతులు కూడా ప్రకటిస్తారు కాని వారిలో కూడా వందన పేరు ఉండదు. అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, వందన చాలా నిరాశతో బాధపడుతుంటుంది, కంట్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి పక్కన చూస్తే రోహిత్ ఉండడు. చేతిలో ఉన్న కాగితం చూసి తెరుస్తాది...
అందులో
"తను ఎవరో పరిచయం లేదు, కాని తన నాట్యం ఆనందాన్ని పరిచయం చేసింది. తన ముఖం లోని భావాలు, ఇంతవరకు ఏవీ చేయలేదు అన్ని ప్రభావాలు, తన గజ్జెల శబ్దం, ప్రబలించింది హాల్లోని నిశ్శబ్దం, తన నృత్యం లోని కదలికలు, అద్భుతమైన కలయికలు, తను అలా చేస్తుంటే నాట్యం, ఆడనవసరం లేదు ఎలాంటి సంగీత వాయిద్యం అనిపించింది ఆ క్షణం, వరంలా ఉంది ఈ వీక్షణం తన ప్రదర్శన ఒక గొప్ప జ్ఞాపకం, స్వర్గం ఉందనడానికి నాదెగ్గరున్న సాక్ష్యం నిరాశతో ఉన్న నాలో ఆలోచనలు పరాకు పడ్డాయి నాలోని నిరుత్సాహం చేయమంది మరొక ప్రయత్నం వనానికి కరిగిన వర్షంలా నాలో వచ్చింది కవిత్వం ఇలా తనకు నా అభివందన "
అని రాసి ఉంటాది. అప్పుడు అర్ధమవుతాది వందనకు, తను పక్కన కూర్చున్నపుడు రోహిత్ తన గురించే రాస్తున్నాడు అని. ఆ క్షణం తను గెలవలేదు అనే బాధకన్నా, అసలు తను ఎవరో పరచియంలేని వ్యక్తిని ప్రభావితం చేసిన అనుభూతి గొప్పగా అనిపించింది వందనకు. తన కళ్ళలో నీరు ఆనందభాష్పాలుగా జారి నేలను తాకుతాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.