Contributed by Sunjay Murari
ఈక్షణం మీ ప్రపంచం అంటే మీ కళ్ళకు కనిపించేది ,చెవులకు వినిపించేది ,మనసుకు అనిపించేది మాత్రమే మిగిలిన ప్రపంచం గురించి ఆలోచన కానీ అవగాహన కానీ వుండవు. కానీ మనకి కనిపించని,వినిపించని,అనిపించని ఈ ప్రపంచంలో ఈక్షణమే చాల జరుగుతాయి అవి మనం మంచి అని పేరు పెట్టుకున్నవి ,చెడు అని చీదరించుకునేవి,ప్రమాదం అని భయపడేవి ఇంకా చాలా ఉదా:ఈక్షణమే ఒక లేడీ పులి నుండి తప్పించుకుని ప్రాణాల కోసం పోరాడుతూ ఉండొచ్చు,అదే క్షణంలో సుబ్బారావు ఇంట్లో T.V రిమోట్ కోసం వెతుకుతూ ఉండొచ్చు..
ఈ క్షణమే ప్రపంచంలో వున్నా ఇన్ని తలకాయల్లోని ఎదో ఒక మెదడు లో ప్రపంచ గతిని మార్చగలిగే ఆలోచన పుట్టి ఉండొచ్చు ,సుబ్బారావు కి రిమోట్ దొరికి T.V ఆన్ చేసి సోఫాలో సెటిల్ అయి ఉండొచ్చు ఈ క్షణమే దేశం మొత్తం గర్వపడేలా చెయ్యగల ఒక మనిషి పుట్టుకకు కారణం అయ్యే శుక్ర కణం అండాన్ని చేరుకొనే ప్రయాణం ప్రారంభించి ఉండొచ్చు ,T.V లో సుబ్బారావు ఇరిటేషన్ కి ప్రాధాన కారణం అయిన యాంకర్ రావడం వల్ల ఛానెల్ చేంజ్ చేస్తూ ఉండొచ్చు ..
ఈ క్షణమే ఈ అనంత విశ్వంలోని ఎదో ఒక గ్రాహం లో ఎక్కడో ఒక చోట నాలాంటి వ్యక్తి రాసిన అర్ధం లేని అక్షరాలని నీ లాంటి మేధావి చదువుతూ ఉండొచ్చు,చేంజ్ అయిన ఛానల్ లో టైమ్ పాస్ చెయ్యడం ఎలా ?అనే పనికిమాలిన ప్రోగ్రామ్ ని సుబ్బారావు కళ్ళార్పకుండా చూస్తూ ఉండొచ్చు ఈ క్షణమే 7,619,117,700 గణాంక లెక్కల ప్రాణాలు వున్నా ఈ భూమి మీద ఎక్కడో ఒక మనిషికి నేను ఎందుకు పుట్టాను?అనే ప్రశ్న కు సమాధానం దొరికి ఉండొచ్చు ,ప్రోగ్రాం మధ్యలో కరెంటు పోయిందని సుబ్బారావు ఎలక్ట్రిసిటీ వాళ్ళని తిట్టుకుంటూ కొవ్వొత్తి కోసం వెతుకుతూ ఉండొచ్చు.. ప్రతీ క్షణం ప్రతీ చోటా ఎదోకటి జరుగుతుంది... ఈ క్షణాన్ని నువ్వెలా గడిపావు?