ద్వారకుడు అనే ఒక ముసలి బ్రహ్మణుడు శ్రీ వేంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడు. ప్రతి సంవత్సరం కాలినడకన తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఒకసారి అలానే వెళ్తుండగా కళ్లు తిరిగి పడిపోయాడు అప్పుడు శ్రీవేంకటేశ్వర స్వామి అతని కలలోకి వచ్చి 'నాకోసం ఇంత దూరం అలసిపోయి రానవసరం లేదు కృష్ణ గోదావరి పుణ్యనదుల మధ్య లో ఉన్న శేషాకార పర్వతంపై నేను కొలువై ఉన్నాను తిరుమలకు వచ్చినా ఇక్కడ పూజించినా నీకు అదే ఆనందం కలుగుతుంది" అని కలలో చెప్పారట. కలలో చెప్పినట్టుగానే ఆచోటుకు వెళ్ళిన ద్వారకుడికి ఒక చీమల పుట్టలో స్వామి వారి దర్శనం కలిగింది.
మహా ఆనందంతో ద్వారకుడు చుట్టుప్రక్కల వారికి తెలియజేసి అక్కడే చిన్న గుడి నిర్మించడంతో ఆరోజు నుండి ఆ దేవాలయాన్ని "ద్వారకా తిరుమల" గా పిలుస్తున్నారు. కాలక్రమంలో ఎంతో మంది రాజులు ఈ గుడిని ఆ కాలానికి తగ్గట్టుగా నిర్మించారు. తిరుమల, చిలుకూరి బాలాజీ గుడి తర్వాత కళియుగ ప్రత్యక్షదైవంగా కీర్తించబడుతున్న శ్రీ వేంకటేశ్వరునికి "ద్వారక తిరుమల" మూడో అతి గొప్ప దేవాలయంగా పూజలందుకుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం కొలువై ఉంది.
ఇక్కడికి ప్రతిరోజు కొన్ని వేల భక్తులు ఈ కోవెలను దర్శిస్తుంటారు. ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది .. ఈ గుడి హుండి ఆదాయంలోని కొంత ఆదాయంతో హిందువులు పవిత్రంగా భావించే గోవులకు ప్రత్యేకంగా ఒక గోశాలను ఏర్పాటు చేశారు సుమారు 350కి పైగా గోవుల భాద్యతను ఈ ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా ద్వారకా తిరుమల దేవాలయం సమీపంలో ఉన్న7 ఇతర దేవాలయాలను దత్తత తీసుకొని వాటి యోగ క్షేమాలను చూస్తుంది.
దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వేంకటేశ్వరుడు దక్షిణ ముఖంగా ఉంటారు. ఈ దేవాలయంలో రెండు శ్రీనివాస ప్రతిమలు ఉంటాయి. ద్వారకా తిరుమలలో సంవత్సరానికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వయంభూ గా వెలసిన శ్రీనివాసునికి వైశాఖ మాసంలో, విగ్రహ ప్రతిష్ట చేసిన ప్రతిమకు అశ్వీజ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వయంభూ ప్రతిమను వేడుకుంటే మోక్షాన్ని.., ప్రతిష్టించిన విగ్రహాన్ని అర్ధిస్తే సాధారణ కోరికలను నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.