A Real Life Love Story Documented In A Girl’s Diary. Will They Meet Or Not?

 

Contributed By Pranaya

Episode- 1 link
Episode- 2 link

Episode – 3 (Total – 5)

ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం మరియానా ట్రెంచ్ అని మనిషి కనిపెట్టగలిగాడు కానీ అంతకంటే లోతైనది ఆడదాని మనసు అని అర్థం చేసుకోలేకపోయాడు. సముద్రంలో అలల అలజడిలాగే ఆడదాని జీవితం కూడా అల్లకల్లోలంల ఉంటుందని నాకు ఈ ఆరు సంవత్సరాలలో బాగా అర్థం అయింది. సముద్రం లో ఎన్నో నిధులు, ఖనిజాలు ఉన్నట్టు అమ్మాయి మనసులో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకునేవాడు దొరికినపుడే ఆ అమ్మాయి జీవితం ఆనందంగా ఉంటుంది. నా జీవితంలో అర్జున్ అలాంటివాడే అని అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది.

అర్జున్… కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. మొదట్లో తక్కువే మాట్లాడేవాడు. ఎక్కువగా అబ్బాయిలతో మాట్లాడలేదు కాబట్టి నేను కూడా అంత మాట్లాడేదాన్ని కాదు. కానీ “ఫోన్ మాట్లాడిన ఆ పది నిమిషాలు నాకు తెలియకుండానే నా పెదాలపై చిరునవ్వు వాలేది.” ఈ విషయం అర్థం చేసుకోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఫ్రెండ్స్ తో రూమ్ లో ఉండే అర్జున్ కొన్ని రోజుల తరువాత నేను ఉండే హాస్టల్ పక్కన బాయ్స్ హాస్టల్ కి షిఫ్ట్ అయ్యాడు.

అర్జున్ కి కొంచెం కోపం ఎక్కువ. కోపం వస్తే ఆ నిమిషం ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు. ఇది తెలిసిన నా స్నేహితులు, తన స్నేహితులు నాకు చాలా సార్లు చెప్పారు. అర్జున్ తో స్నేహం వరకు పర్లేదు కానీ అంతకు మించి రిలేషన్ అంటే ఒకసారి ఆలోచించు అని. కానీ స్నేహం తో మొదలైన మా ప్రయాణం ఎప్పుడు ప్రేమ గా మరిందో తెలియలేదు.

అప్పటిదాకా కేవలం ఫోన్ లో మాట్లాడే మనిషి ఇంత దగ్గరగా వచ్చాక కూడా కలవవా అనగానే నా గుండె చప్పుడు నాకే వినిపించేంత వేగంగా కొట్టుకుంది. అవును ఇప్పటిదాకా నేను అర్జున్ ని గాని తను నన్ను గాని చూడలేదు. ఇద్దరం నెక్స్ట్ డే కాలేజ్ నుండి వచ్చాక కలుద్దాం అనుకున్నాం. ఆ రోజంతా నాకు క్షణం ఒక యుగంలా గడిచింది. హాస్టల్ వెనకాల గుడి దగ్గర ఎదురు చేస్తున్న అని మెస్సేజ్ వచ్చింది. బయటకి రాగానే చల్లని గాలి, నల్లని మబ్బులు, వర్షం పడేలా ఉంది. పరుగున గుడి దగ్గరికి వెళ్ళాను. బ్లూ జీన్స్ వైట్ షర్ట్, చేతిలో వయొలెట్ ఓర్చిడ్స్, డైరీ మిల్క్ చాక్లెట్. అన్ని నాకిష్టమైనవే. అప్పటిదాకా నేను ఫోన్ లో విన్న నవ్వుకి రూపం వచ్చి నా ముందు నిల్చున్నట్టు ఉంది.

ఇన్ని రోజులు పోటీ పడి మాట్లాడుకున్న మేము కలిసాక మాట్లాడడానికి మాటలు లేవన్నట్టు మౌనంగా గుడి లోపలికి నడిచాం. నిజం చెప్పాలంటే మాటలకంటే ఆ మౌనమే బాగుంది. మేము మాట్లాడలనుకున్న మాటలన్నీ ఆ నిశ్శబ్దంలో మా మనసులు మాట్లాడుకుంటునట్టు అనిపించింది.

ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ పెద్ద ఉరుములతో వర్షం. మబ్బులు కరిగి వర్షం అయినట్టు ఆ వాతావరణంకి నాలో ప్రేమ కరిగి అర్జున్ కి నా మనసులో మాట చెప్పేస్తానేమో అని భయమేసింది. వెంటనే నా భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకుని ఆగిపోయాడు అర్జున్. ప్రేమో, భయమొ కంట్లో నుండి నీళ్ళు ఇంకో వర్షపు ధారలా వచ్చాయ్. నా కన్నీళ్లు తుడిచి గుడిలోకి తీసుకెళ్లాడు.

ఆ తరవాత నేను దేవుడిని కోరుకున్నది ఒకటే కోరిక అర్జున్ కి కోపం తగ్గించమని కాదు, ఆ కోపాన్ని భరించే ఓర్పుని నాకు జీవితాంతం ఇవ్వమని. ఆ రోజు నా పుట్టినరోజు. ఆ క్షణం డిసైడ్ అయ్యాను ఇక నా జీవితం తానే అని. “గుడి నుండి హాస్టల్ వరకు నడుస్తూ జాబ్ వచ్చాక మీ ఇంట్లో మాట్లాడ్తా పెళ్లి చేసుకుందాం తరువాత నేను బిసినెస్ స్టార్ట్ చేస్తా అన్నాడు.” (అర్జున్ కి జాబ్ నచ్చదు. బిజినెస్ అంటే ఇంట్రెస్ట్) షాక్ లో ఆగయిపోయా. ఏంటి నాకు ఇష్టం ఉందొ లేదో తెలుసుకోకుండా పెళ్లి ప్రపోజల్ మాట్లాడ్తున్నాడు అనుకుంటున్నావా. నీ కంట్లో నీళ్లు తుడిచేటప్పుడే నీకళ్ల లో నా పై నీకు ఎంత ప్రేమ ఉందొ అర్థం అయింది అన్నాడు. ఆ రోజు మొదలైన మా ప్రేమ ప్రయాణం మూడు సంవత్సరాలు నాకు జాబ్ వచ్చాక మారిపోయింది.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,