ఇంట్లో లక్ష్మి పూజ, కమ్మ కమ్మని పిండి వంటలు,టుస్సుమని కాంతులు విరజిమ్మే చిచ్చుబుడ్లు, సుయ్యుమని ఎగిరే రాకెట్లు, గిర్రుమని తిరిగే భూచక్రాలు, బొమ్మ తుపాకులు, ధడేల్ మని పేలే లక్ష్మీ బాంబులు,అన్నటికంటే మించి enjoy చేయడానికి ఒక occasion.(అంటే ఈ నెలలో అందరికి బాగా పరీక్షలు రాసి, మానసికంగా అలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్ కనుక) దీపావళి అనగానే గుర్తొచ్చే విషయాలు ఈ కాలం లో ఇవే ఉంటున్నాయి. కాని మన దీపావళి కి అంతకంటే గొప్ప చరిత్ర ఉందండోయ్. చరిత్ర అంటే గుర్తొచ్చింది, ఏ యుగమైనా, ఎవరి కాలమైనా, చివరికి సినిమా అయినా, మంచి చెడు పైన గెలవాల్సిందే, Hero villain ని ఇరగ్గోట్టేయాల్సిందే. దీపావళి కూడా అందుకు మినహాయింపు కాదండి.ప్రపంచం లోని ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ పవిత్ర గ్రంధమలో అయినా, చెడు పై మంచి గెలవడం గురించే చెబుతాయి. ఆ గెలుపే ఒక ఆశయంగా, ముందు తరాల వారు గుర్తు పెట్టుకునేలా ఉండేందుకే మన ఈ పండగలు, కాంతులు.
త్రేతా యుగంలో శ్రీరాముడు రావణాసురుడిని యుద్ధం లో సంహరించి, సీతా లక్ష్మణులతో కలిసి అయోధ్యా పట్టణానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆ రాజ్య ప్రజలు దీపాలను వరుసగా పేర్చి, చూడముచ్చటగా కాంతులతో వారికి స్వాగతం పలికారు అని మన రామాయణం చెబుతుంది. అలాగే యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామాదేవి తో కలిసి నరకాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించి ప్రజలను కష్టాల నుండి దూరం చేశారని, నరక సంహార కారకమైన ఆ రెండు రోజులను, నరక చతుర్దశి, దీపావళి గా జరుపుకోవడం మొదలుపెట్టారు అని మన భాగవతం చెబుతోంది. దీపావళి కి ఇంకొక గొప్ప quality ఉందండోయ్. దీనికి మతం తో పనిలేదు. ఎవరు కాల్చినా వచ్చేది ఒకటే కాంతి, ఒకటే ఆనందం. మా హమీద్ గాడు, మా జోసెఫ్ గాడు, అందరూ కలిసే ప్రతి సారి టపాకాయలు కాలుస్తామండి బాబు. మా రామకృష్ణ నగర్ లో, ఒక చిన్న బుడ్డోడు పాపం మిగతా పిల్లలు కాలుస్తూ ఉంటె చూస్తూ ఉన్నాడండి. ఏ రా నువ్వు కాల్చట్లేదేంటి అని అడిగా.. అప్పుడు వాడన్నాడు, డబ్బులు లేవన్నది అమ్మ అని. పాపం అన్పించి, నా టపాకాయల బాక్స్ లో నుండి కొన్ని చిచ్చుబుడ్లు, భూ చక్రాలు తీసి ఇచ్చాన్లెండి. వాడి కళ్ళలో ఆనందం చూడాలి, వెయ్యి రాకెట్లు పేలినంత! పండగ అంటే పంచుకోవడమే కదా, టపాకాయలు, ఆనందాలు.
ఈ మధ్య crackers కు ఎవడు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే వాడే తోపు ఒక feeling ఎక్కువైపోతోందండి. పెద్ద పెద్ద మొత్తాల్లో కొని రోడ్లు అన్ని చెత్తతో, శబ్దాలతో నిమ్పేస్తున్నాం Next.రోజు, corporation వాళ్లకి clean చేసుకోవడానికి దూల తీరిపోతోంది.కాబట్టి మనం పోగేసిన చెత్త మనమే చేసేస్కున్నమనుకోండి, ఇంకప్పుడు పండగ జరుపుకున్న ఆనందం, వీధి బాగుపడింది అన్న సంతృప్తి కూడా మిగులుతాయి.
పెద్ద పెద్ద బాంబులు, harmful chemicals ఉన్న బాణసంచా పేల్చి ప్రశాంతతకు, ఆనందాలకు, ఆరోగ్యానికి ప్రతీక అయిన దీపావళి కి చెడ్డ పేరు రాకుండా చేయడం మనందరి బాధ్యత. ఇప్పటికే ఎక్కువ వాగేసినట్టున్నా కదండి, కింద మా శీను గాడు ఏదో కొత్త రకం చిచ్చుబుడ్డి కొన్నాడు అంట, అన్న నువ్వొచ్చెయ్, కుమ్మేద్దాం అన్నాడు, మరి వెళ్లి ఒస్తానే, Happy Deepavali!