31 సర్జరీలు.., నడుము నుండి కాలి వరకు జరిగిన వివిధ ఆపరేషన్ లో 183 కుట్లు.., వెన్నుముక కు ట్యూమర్ సోకడంతో డాక్టర్లు బ్రతకడం కష్టం అని చేతులెత్తేశారు అతి కష్టం మీద ఒకవేళ బ్రతికిన ఇక జీవితాంతం బెడ్ యే ఇంకో శరీరంలా అంటిపెట్టుకుని ఉండాలన్నారు ఐతే ఏంటి..! ఇవ్వన్నీ మామూలు వ్యక్తులకైతే అదోక చావు కాని దీప మాలిక్ కి మాత్రం "తనని తాను మరొకసారి నిరుపించుకోవాడినికి, మరొక్కసారి పుట్టడానికి దొరికిన అద్భుత అవకాశంగా భావించింది." ఇదంతా 17 సంవత్సరాల క్రితం.. కాని ఇప్పుడు 2016 పారాలింపిక్స్ షార్ట్ పుట్ విభాగంలో ఇనుపగుండును 4.61 మీటర్ల దూరం విసిరి రజత పతకం సొంతంచేసుకున్నారు. ఇది మామూలు గెలుపు కాదు పారాలంపిక్స్ చరిత్రలోనే ఒక భారతీయ మహిళ పతకం గెలుచుకోవడం ఇదే మొదటిసారి.
దీప మాలిక్ పేరు దేశమంతటా మారుమోగి పోవడం ఇదేం మొదటిసారి కాదు తనేం ఒక్క షార్ట్ పుట్ లో మాత్రమే ప్రావీణ్యురాలు కాదు 'స్విమ్మింగ్, జూవెలిన్ త్రో ఇలాంటి విభాగాలలో నేషనల్ స్థాయిలో 54 బంగారు పతకాలు అంతర్జాతీయ స్థాయిలో 13 పతకాలు గెలుచుకుని దేశం గర్వించదగ్గ క్రీడా కారినిగా గుర్తింపు తెచ్చుకుని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి గారి చేతులమీదుగా 'అర్జునా' అవార్ఢును అందుకున్నారు. అంతేకాదు రాజస్థాన్ మహిళ క్రికెట్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తూ స్పోర్ట్స్ బైకర్ గా, ఒక మంచి వ్యాపారవేత్తగా పలు విభాగాలలో ఉన్న ప్రతిభకు గాను భారతీయ గిన్నిస్ బుక్ గా పరిగనించే లిమ్కా బుక్ ఆఫ్ రికార్ఢ్స్ లో నాలుగుసార్లు స్థానం సంపాధించుకున్నారు.
దీప భర్త ఆర్మీలో పనిచేస్తారు. వీరి పెళ్లి విచిత్రంగా జరిగింది. చిన్నప్పటి నుండి ఆటలు అడ్వెంచర్లు ఇష్టపడే దీప మొదట 20 సంవత్సరాలకే పెళ్లిచేసుకోవడానికి నిరాకరించింది.. కాని బైక్ కొనిస్తే చేసుకుంటా అని మెలిక పెట్టేసరికి Kawasaki Bajaj 100cc కొనిచ్చారు. కేవలం ఆటలకు మాత్రమే దీప పరిమితం అవ్వలేదు మెడల్స్ ఎలా సాధించారో ప్రజా సమస్యలపై కూడా అంతే విధంగా విజయం పొందారు. పంచవర్ష ప్రణాళిక(2012-2017)లో స్పోర్ట్స్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో తన విలువైన సూచనలు ఇవ్వడానికి ఎంపికయ్యారు. ప్రెసిండెంట్ రోల్ మోడల్ అవార్ఢ్(2014), అర్జునా అవార్ఢ్(2012), మహారాష్ట్ర ఛత్రపతి స్పోర్ట్స్ అవార్ఢ్(2009) ఇలా ఎన్నో గొప్ప అవార్డులను అందుకున్నారు. Dee's Place Restaurant విజయవంతంగా నడిపిస్తూ వాటిలోని లాభాల ద్వారా తనకు తోచినంతగా సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.