Contributed By Masthan Vali
చైనా లో పుట్టా ప్రపంచాన్ని చుట్టుముట్టా ఎన్నో ప్రాణాల్ని మట్టుపెట్టా ఇప్పుడు భారత్ లో అడుగు పెట్టా చూస్తా ఉండండి అట్టా... కబలిస్తా మీ ప్రాణాల్ని కూడా ఇట్టా!
ఆపెహే, ఎట్టెట్టా... నీ మొహానికి రైమింగొకటి..అలానే కానీ!
హట్... జాస్తయింది తీ నీయ్యాట! ఇక కాస్త తగ్గవోయ్ అంటా!
నీ అమ్మమ్మ లాంటోల్లనే చుసామంటా... నువ్వసలు లెక్కే కాదంటా!
నువ్వెంత డేంజరో మాకు ఎరుకేనంట... ఆ మాత్రానికే ను తోపనుకోకంటా!
నీ గురించి అంతా తెలుసుకున్నామంటా... నిన్ను అంటించుకోకుండా ఎలా ఉండాలో మాకు తెల్సంటా!
మా బంటి యాడ్ ను చూల్లేదనుకుంటా... నిన్నెలా ఎదుర్కోవాలో మా బాగా తెల్సంటా!
ఎండా కాలం మొదలయ్యిందంటా... ఈ వేడికెలా తట్టుకుంటావో చుస్తామంటా!
తుమ్ములంటా, హ్యాండ్ షేకులంటా... నువ్వెలా చెలురేగుతావో ఆ మాత్రం అవగాహన మాకుందంటా!
గోరు వెచ్చని నీళ్లే తాగుతామంటా... ఆ కాస్త వేడికే ను చస్తావంటా!
గుంపులు గుంపులుగా మేం కనబడమంటా... ను ప్రబలించే వేగాన్ని తగ్గించేమంటా!
నువ్వు మమ్మల్ని ఏం చెయ్యలేవంటా... మా జాగ్రత్తలో మేమున్నామంటా!
ఇది గుర్తుపెట్టుకో... ఫాల్తు ఫాల్తు వార్తల్ మేం నమ్మమంటా... పోయే కాలం దాపరించే...ను మా దేశానికి వచ్చావంటా!
నిన్ను చంపే మందు లేదని మురిసి పోకంటా... నీకు ముందున్నదంతా ముసళ్ల పండగేనంట!
