మన భారతీయులందరికి 1947వరకు ఒక విజన్ ఉంది. దాని కోసమే విజయమో మరణమో అని అందరూ కలిసికట్టుగా ఉద్యమం చేసి సాధించుకున్నాం.. కాని దాని తర్వాత ఒక బలమైన విజన్, లక్ష్యం లేకుండా పోయింది.. స్వార్ధం పెరిగిపోయింది మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం.. మళ్ళి మనమందరం కలిసి అలాంటి ఉద్యమం చేస్తే తప్ప మనదేశం ఉన్నత స్థాయిలో ఉండదు.. భారతదేశం మారాలంటే ముందు భారతీయులను ఒక్కటి చేయాలి. వారి సమస్యలను అందుకు తగిన సరైన పరిష్కరాలను చేతల ద్వారా వివరిస్తూ వారిలో నెమ్మదిగా ఆలోచనాత్మకంగా చైతన్యాన్ని నింపుతున్నారు "సతీష్ కుమార్ పెండ్యాలా"..
సతీష్ నాన్న గారు అట్టడుగు స్థాయి నుండి వచ్చారు. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా కాని తన మూలాలను మరవలేదు. ప్రతి దీపావళికి తను పనిచేసిన కిరాణా షాపుకు వెళ్ళి యజమానికి స్వీట్ బాక్స్ ఇచ్చి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు.. ఇదేంటి నాన్న? ఎందుకు ఇలా చేస్తున్నావు? వాళ్ళు నీకేమైనా డబ్బులిచ్చారా? అని అడిగితే "నాకు వాళ్ళేమి డబ్బులివ్వలేదురా ఎలా బ్రతకాలో నేర్పించారు".. అని విశ్వాసం నిండిన మనసుతో సమాధానం చెప్పేసరికి సతీష్ వ్యక్తిత్వంలో సమూల మార్పులు వచ్చాయి.. సతీష్ గారి ఇంట్లో దేవుని పాటలు వినపడవు. దేశభక్తిని నరనరాన పెంచేందుకు దేశభక్తి పాటలు వినిపిస్తాయి. వారి ఇంట్లో శ్రీరామనవమికి ఎలాంటి పండుగ జరుగుతుందో రంజాన్ కు కూడా అంతే ఆనందంతో ముస్లిం సోదరులతో పండుగ జరుగుతుంది. అలాంటి వాతావరణంలో పెరిగిన సతీష్ భారతమాతను కూడా తన తల్లిగా భావించి భారతీయులే నా సోదరులు అని వారి జీవితాలను బాగుచేయడమే తన అంతిమ లక్ష్యం అని ముందుకు కదులుతున్నాడు..
అభిలాష ఫౌండేషన్(2008): ఎప్పుడో బాగా చదువుకుని, జాబ్ చేసి డబ్బులు సంపాదించినప్పుడు చూద్దాంలే అని కాకుండా ఒక పక్క చదువుకుంటూనే 19 ఏళ్ల వయసు నుండే సేవా ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఉప్పల్ లో ఉండే Divine Schoolని Adopt చేసుకుని స్లమ్ లోని పేద పిల్లలను ఆ స్కూల్ లో జాయిన్ చేయించారు. జాయిన్ చేయించడం వరకు మాత్రమే కాదు వారిలో చదువు మీద ఇష్టం పెరిగేలా మెరిట్ మార్కులు సాధించిన వారికి స్కాలర్ షిప్స్ ఇచ్చి వారిలో ఒక పోటితత్త్వాన్ని పెంచారు.
Youth For Better India (2011): అవినీతే అభివృద్దికి ఉన్న మొదటి అడ్డంకి అని దానిని దేశం నుండి తరిమికొట్టాలని దేశ రాజధాని వేదికగా డిల్లీలో అన్నా హజారే చేసిన అంతపెద్ద ఉద్యమానికి చిన్న వయసులోనే(22) మన హైదరాబాద్ తరుపున సతీష్ నాయకత్వం వహించారు. ఎంతోమందిని సంఘటితం చేశారు.
Great Trainer: డబ్బు సంపాదించడానికి ఏ పనిచేసినా కాని అంతిమంగా అది దేశానికి ఉపయోగపడాలని, తన జాబ్ కూడా అందుకు అనుగూనంగా ఉండాలని సతీష్ భావించాడు. ఎల్.ఎల్.బి పూర్తి చేయడం ఇంకా వివిధ సబ్జెక్ట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండడంతో Times Institute, Ace Engineering Academy, IAS Brain, Telangana Minority Society లాంటి ఎన్నో ఇనిస్టిట్యూట్ లలో కోచింగ్ ఇస్తు Indian Polity, Current Affairs సబ్జెక్ట్స్ ద్వారా యూత్ ని ఎడ్యుకేట్ చేస్తున్నారు.
Youth Parliament: 2016లో ప్రారంభించిన ఈ యూత్ పార్లమెంట్ కి సతీష్ కో ఫౌండర్, స్పీకర్. దేశంలో ఉన్న ప్రస్తుత సమస్యలకు ఎలాంటి చట్టాలుండాలి అని చెప్పి దేశం మీద భక్తి ఉన్న గొప్ప పౌరులతో ఇక్కడ Deep Discussions జరుగుతాయి అలా జరిగిన వాటిని చట్టాలుగా చేసేంత వరకు ఈ యూత్ పార్లమెంట్ పనిచేస్తుంది. (ఇప్పటి వరకు ప్రభుత్వానికి 3 నమూనా బిల్లులను అందించింది).
Deeds & Drafts: మన ప్రభుత్వం ఒక బిల్ తయారు చేశాక దానిని చట్టంగా అమలు చేసేముందు ప్రజల నుండి ఏమైనా అభ్యర్ధనలు కోసమని చెప్పి ప్రజల ముందు ఉంచుతారు అప్పుడు Deeds & Drafts(సతీష్ కుమార్ టీం) ఆ బిల్ ని నిశితంగా రీసెర్చ్ చేసి ఇందులో ఇంకేమైనా మార్పులు అవసరమా, ఏదైనా లోపాలున్నాయా, ఇంకా బెటర్ గా బిల్ ను తయారు చేయవచ్చా అని చెప్పి ఒక రిపోర్ట్ ను తయారుచేసి ప్రజల తరుపున వారికి అందిస్తారు.. అలా ఇప్పటికి 18 బిల్స్ లలో వీరు ప్రజల తరుపున రిపోర్ట్ లను అందించారు.
ప్రపంచంలో ఎక్కడా లేని యువత మనదేశంలోనే ఉంది అది జనాబాలో 65% పైగానే, (మన సమీప ప్రత్యర్ధి చైనా, 32%). మరో 15 సంవత్సరాలు మాత్రమే ఇంత గొప్ప శక్తిని మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మనకు ఉన్నది చాలా తక్కువ సమయం. సతీష్ తపన అంతా ఒక్కటే ఈ తక్కువ టైంని సరిగ్గా ఉపయోగించుకుంటే మన దేశాన్ని మన ఊహకందని విధంగా మార్చవచ్చు అని అందుకు తగ్గట్టు తన అడుగులు సాగుతున్నాయి.. ఈ ప్రయాణంలో సతీష్ ఎన్నో మార్పులు తీసుకువచ్చాడు, ఎన్నో అవార్డులను అందుకున్నాడు. సతీష్ ఇంకా చేరుకోవాల్సిన గమ్యాలున్నాయి. తనకి ఊహ తెలిసినప్పుడు ఏ లక్ష్యం ఉందో ఇప్పుడు అదే లక్ష్యం ఉంది కాని సందర్భాన్ని బట్టి దారులు మారుతున్నాయి అంతే.