Revisiting Our 10th Class Telugu 1st Lesson “Bondu Mallelu” On This May Day

Contributed By Hari Atthaluri
బొండు మల్లెలు
అప్పట్లో పదవ తరగతి గద్య భాగం లో మొదటి పాఠం గా ఇదే ఉండేది…
రచయత చాగంటి సోమయాజులు గారు..
(చాసో గా నుప్రసిద్దుడు)
ఈ చిన్న కథ ప్రపంచాన్ని చూసే నా దృక్పథం ని పూర్తి గా మార్చేసింది..
షార్ట్ గా స్టోరీ చెప్తే…
మల్లె పూలు కి మార్కెట్ లో మంచి రేటు ఉంది అని రచయత , ఖాళీ గా ఉన్న తన ఇంటి పెరడు లో ఈ పూలు పెంచితే మంచి లాభం వస్తుంది అనుకుంటాడు…
ఎలాగూ డబ్బు ఉన్న వాళ్ళే ఈ మల్లె పూలు కొంటారు కాబట్టి వాళ్ళకి ఈ మల్లె పూలు ఎక్కువ రేట్ కి అమ్మినా, వాళ్ళని ఇలా దోపిడీ చేసినా పెద్ద అన్యాయం ఏం కాదు అనుకుంటాడు…
కానీ గోతులు తీయటానికి ఓ మనిషి అవసరం పడితే, పని ఉందా బాబు అనుకుంటూ పొట్ట వెన్నుకు అంటుకుపోయిన ఓ తాత ఎదురు వస్తాడు…
తమకి తోసింది ఇయ్యిండి బాబు అనగానే , తాత అవసరం లో తనకి ఓ అవకాశం కనపడి..
చాలా తక్కువ కి బేరం ఆడతాడు…
పని అవసరం కాబట్టి తాత కూడా మారు మాట్లాడకుండా చిత్తం బాబూ ! కానీ మధ్యాన్నం కాసిన్ని గంజి నీళ్ళు పోయమంటాడు…
ఎలాగూ తక్కువ కే పనికి కుదిరాడు అని సరేలే అని రచయత ఒప్పుకుంటాడు…
చివరలో పేచీ ఏమైనా పెడతాడు ఏమో అని అనుకున్నా..పని ఐపోయాక ఇచ్చినంత తీసుకుని తాత వెళ్ళిపోతాడు…
కానీ మళ్ళీ పని ఉందా బాబు అంటూ వస్తాడు..
ఎలాగూ తాత కి పని అవసరం..నాకు ఆ తోట పని కి ఒకరు అవసరం అని, ఎలాగూ తక్కువకు వస్తాడు.. గంజి నీళ్ళు పోస్తే చాలు..గమ్మున ఉంటాడు అనుకుని పని లో పెట్టుకుంటాడు..
తాత కుదురుకున్నాడు అనే కంటే తేర గా దొరికాడు అని లోపల లోపలే సంబర పడతాడు..
అలా ఓ నెల తాత ఏం చెప్పినా చేసే వాడు.. చీకటి తోనే వచ్చి..చీకటి పడే దాకా ఎదో ఒక పని చేసి…వెళ్లే వాడు…
అలా మొదటి నెల జీతం అందుకున్న తర్వాత రోజు తాత చాలా ఆనందంగా ఉంటాడు..
ఏంటి తాత, ఏంటి విశేషం అంటే…
మీరు ఇచ్చిన జీతం చేతిలో పెట్టాక,
రాత్రి నా కూతురు పట్టెడు అన్నం పెట్టింది బాబు అంటాడు…
తనకు ఎవరూ లేరు అని..ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోయాడు అని..కూతురు డబ్బు మనిషి అని.. ఇంక పని ఉంది కాబట్టి తన కష్టం తీరుతుంది అని సంతోషం గా చెప్తున్న తాత గతం ని విని రచయత చలించిపోతాడు…
అప్పటి నుంచి కొంచెం అన్నం కూడా రోజూ పెడుతున్నాడు….
ఇంతలో మల్లెలు మొగ్గలు తొడిగి, రెండు విడతలుగా పూశాయి.
తాతే వాటిని కోసి మార్కెట్ కి వెళ్లి అమ్ముకొచ్చేవాడు…
తాత కష్టం కి ఇచ్చింది పోను రచయత కి బాగానే మిగిలింది..
తర్వాత కొన్ని రోజులకు తాత పని లోకి రావటం మానేశాడు…
అన్ని రోజులు పని చేసినా, తాత ఇల్లు ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి అని కానీ, నిజం చెప్పాలి అంటే తాత అసలు పేరు కూడా తెలుసుకోలేక పోయా అని మథన పడుతూ ఉంటాడు… అలా అలా మర్చిపోయాడు…
కొన్ని రోజుల తర్వాత, కూరగాయలు అమ్మే మనిషి మాటల్లో తాత చచ్చిపోయాడు అని తెలుసుకుని షాక్ అవుతాడు…వంట్లో బాగోలేక..చూసే దిక్కు లేక చచ్చిపోయాడు అని చెప్తుంది…కూతురు ని అనటానికి కూడా ఏం లేదు…దానికి ఉంటేనే గా..కొంత ఐనా తీసి తాత కి పెట్టడానికి అని తను చెప్తుంటే రచయత ఆలోచనల్లోకి వెళ్ళిపోతాడు….
బొండు మల్లెలు వేసింది..పెంచింది..డబ్బు చేసింది తాతే…నిజం గా చెప్పాలి అనుకుంటే పెరడు మాత్రమే నాది…కష్టం అంతా తాత దే..
వచ్చిన లాభం నేను నా జేబు లో వేసుకున్నా , ఇదే డబ్బు తాత ది ఐతే తన చివరి దశ లో ఎంతో కొంత సాయం అయ్యేది కదా !!
మల్లెలు అమ్మి డబ్బు ఉన్న వాళ్ళని దోపిడీ చేస్తున్నా అనుకున్నా కానీ తాత ని నేనే పెద్ద దోపిడీ చేశాను అని బాధపడతాడు…
ఆ కష్టం కి వచ్చిన ఫలితం తాత కి కాకుండా చేసా అని పశ్చాతాప పడతాడు..
నా అవసరం ఉన్న అన్ని రోజులు
అన్నం పెట్టా కానీ, అవసరం తీరాక న్యాయం చేయలేదు అని అనుకుంటాడు…
– చాసో
చూడటానికి చిన్న కథ లాగే ఉన్నా…
శ్రమ దోపిడీ అనే ..మాయం అయిపోతున్న మానవత్వాన్ని మనకి చాలా క్లియర్ గా అర్ధం అయ్యేలా సింపుల్ గా చెప్పారు…
మనకి తెలియకుండానే మనం చేసే తప్పు ని
తెలియ చేసే ప్రయత్నం చేశారు…
ఇలాంటి కథలు..అలాంటి తాత లు ఇప్పటికీ మన చుట్టూ చాలా మంది ఉన్నారు
కష్టపడినా కష్టం కి తగిన జీతం దొరక్క,
చాలీ చాలని జీతం తోనే జీవితాలు నెట్టుకొస్తున్నారు…
ఈ కథ తో ఐనా మనలో కొంత మార్పు కనిపిస్తే చాలు…బడుగు జీవితాలు కొంచెం బాగు పడినట్టే..
మూడు పేజీల మూల కథ మీ కోసం pdf రూపం లో..
If you wish to contribute, mail us at admin@chaibisket.com