కోనసీమ అందాలు, రాయలసీమ రాజసత్వం, తెలంగాణా బోనాలు ఇలా అన్నీ కలిపితేనే మన తెలుగు నేల అవుతుంది అని మనం వింటూనే ఉంటాం. ఇదే నేల లో ప్రాంతాలు వేరు, ప్రాంతాలని బట్టి ఒకే భాష లో యాసలు (accent) వేరు. అలా ఒక్కో ప్రాంతాన్ని Ancient age నుంచి Medieval age దాకా ఎందరో పరిపాలించారు. వాళ్లలో డచ్ వారు ఉన్నారు, ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, మెఘల్స్ ఉన్నారు ఇంకా బ్రిటిష్ వారు కూడా ఉన్నారు.
కానీ ఇలా ఎందరు వచ్చినా ఆ ప్రాంతం మాత్రం చివరికి ఫ్రెంచ్ వారికే దాసోహం అంది. కాదు కాదు, ఫ్రెంచ్ వారికే ఆ ప్రాంతం ఓడరేవులకి, షిప్పింగ్ కి, బిజినెస్ కి అనుకూలం గా ఉండటం తో చాలా వరకుఎన్నో సంవత్సరాలు గా అక్కడే స్థిరపడిపోయారు. అదే మన తూర్పు గోదావరి లో ఉన్న యానాం అనే నగరం.
History : Simple గా చెప్పాలంటే, ఫ్రెంచ్ వారికి దేశం లో నాలుగు ముఖ్య పట్టణాలు ఉండేవి. కేరళ లో Mahe , తమిళనాడు లో Karaikal , బెంగాల్ లో Chandenagore, ఆంధ్రప్రదేశ్ లో Yanam. మొదట డచ్ వారు వచ్చారు, వారినుంచి అధికారం ఫ్రెంచ్ వారి చేతుల్లోకి వెళ్ళింది. తర్వాత ముఘల్స్, బ్రిటిష్ వారు వచ్చారు..... ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి. కానీ 18వ శతాబ్దం చివరి నాటికి యానాం తిరిగి ఫ్రెంచ్ వారి చేతుల్లోకి వచ్చేసింది.
మనకి స్వాతంత్య్రం వచ్చిన 7 ఏళ్ళ తర్వాత వరకు యానాం ఫ్రెంచ్ వారి ఆధీనం లోనే ఉంది. 1954లో యానాం కి స్వాతంత్య్రం వచ్చిందనే చెప్పాలి. అప్పటి అధికారుల నిబంధనల ప్రకారం, తమిళనాడు ప్రాంతం లో ఉన్న పుదుచ్చేరి ని రాజధాని గా పెట్టి, యానాం తో సహా ఉన్న మరో నాలుగు పట్టణాలని దానికి constituencies గా ఏర్పరచారు. ఇప్పటికీ పుదుచ్చేరి ఒక Union Territory. కాబట్టి మన తూర్పు గోదావరి లో ఉన్న యానాం కూడా దానికి అనుసంధానమే కాబట్టి అది Central Government ఆదీనం లో ఉంటుంది.
Culture : ఫ్రెంచ్ వారి స్థావరం అయినందువల్ల ఫ్రెంచ్ సంస్కృతి, పుదుచ్చేరి పట్టణానికి ఇది ఉప-పట్టణం అయినందువల్ల తమిళ సంస్కృతీ, కోనసీమ లో ఉన్నందువల్ల తెలుగు సంస్కృతీ మనం ఈ యానాం లో చూడచ్చు.
Versatility - Historical Significance : 1. Venkateswara Temple : ఈ దేవాలయాన్ని 15వ శతాబ్దం లో అప్పటి రాజమహేంద్రవరం నగరాన్ని పరిపాలించిన చాళుక్యులు నిర్మించారు. ఫ్రెంచ్ పరిపాలన లో 1929 వరకు అక్కడ బాల్య వివాహాలు ఈ దేవాలయం లో జరిగేవి. తర్వాత బ్రిటిష్ వారి Sarda Act తో అవి మానిపోయాయి.
2. Mosque : 1848వ సంవత్సరం లో ఫ్రెంచ్ వారిచే ఇవ్వబడిన భూమి లో ఇక్కడ ఒక చిన్నపాటి మసీద్ ఉండేది. అదే చోటు లో ఉన్న కట్టడం ఇప్పటికీ మనకి కనిపిస్తుంది.
3.Catholic Church : అప్పటి ఫ్రెంచ్ కాలోనిలు లోని ఫ్రెంచ్ మిషనరీలు ఈ చర్చి ని 1846వ సంవత్సరం లో కట్టారు.
Facts : 1. 2001 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ దాదాపు 80 కి పైగా ఫ్రెంచ్ కుటుంబాలు ఉండేవి. 2. ఇక్కడి గోదావరి నది పాయ, దగ్గరలో ఉన్న కోరింగ లో ఉన్న మరో పాయ తో కలిసి సముద్రం లో కలుస్తుంది. ఆ పరీవాహక ప్రాంతం అంతా మనకి పచ్చని చెట్లు, ఫిషింగ్ కి అనువైనది గా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ Sea Food చాలా ఎక్కువ.
3. ఇప్పటికీ ఇక్కడ ఇంకా కొందరు ఫ్రెంచి దేశ సభ్యత్వం ఉన్నవాళ్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వీసా అవసరం లేకుండానే Europe వెళ్ళచ్చు అన్నమాట! 4. 200 సంవత్సరాలకి పైగా యానాం ఫ్రెంచ్ వారి హయాం లోనే ఉంది.
5. ఇక్కడ కరెంటు బిల్లులు కానీ, liquor కానీ, పెట్రోల్/డీజిల్ రేట్ లు కానీ చాలా తక్కువ. కేంద్ర పరిపాలిత ప్రాంతం అయినందువల్ల!!! 6. యానాం Constituency కి ఏకధాటిగా 6 సార్లు ఎన్నికైన మల్లాది కృష్ణారావు గారి గురించి మీరు ఇక్కడ చదివారు కూడా. "Meet The 6-Time MLA Of Yanam Who Is A True Leader Of The People!"
ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా ఇంకా యానాం వెళ్లని వాళ్ళు ఉంటే రెడీ అవ్వండి మరి! కాకినాడ నుంచి 33 km, రాజమహేంద్రవరం నుంచి 73 km.