15 Thought-Provoking Quotes By Yaddanapudi Sulochana Rani Garu

Updated on
15 Thought-Provoking Quotes By Yaddanapudi Sulochana Rani Garu

నా(యద్దనపూడి సులోచనారాణి) ప్రపంచం ఒక విధంగా చిన్నది అని, నేనెక్కడికి రానని, మనుష్యులతో కలవనని ఒక విమర్శ నా మీద బాగా ఉంది. నేను బయటకు ఎక్కువ రాని మాట నిజమే. కానీ నన్ను వెతుక్కుంటూ, ప్రపంచమే నా దగ్గరికి వస్తుందని చాలామందికి తెలియదు. నా దగ్గరికి వచ్చే రకరకాల మనుష్యులు, నాకు రకరకాల గ్రంధాలుగా అనిపిస్తారు. వాళ్ళ బాధల్ని పంచుకోవడంలో, సమస్యలను వినడంలో, సంతోషంతో వారు చెప్పే మాటలకు స్పందించడంలో, నేను వారి నుంచి చాలా నేర్చుకున్నాను. మనిషి అంతరంగంలోకి తొంగిచూడగల విద్య అలవడింది. నైపుణ్యం పెరిగింది. నా యీ నవలల్లో మూల సంఘటనలు, ఇతి వృత్యాలు, వ్యక్తిత్వాలు, వారి మంచిచెడుల, భిన్నభిన్న స్వభావాల అందమైన కలనేతకి, నా సృజనాత్మక నగిషీలు మాత్రమే చెక్కింది అనటం యదార్ధం. వీరికి నాకూ మధ్య స్వభావంలో, ఒక నమ్మకంలో సారూప్యత ఒకటి బలీయంగా ఉంది. అది "కుటుంబం" గురుంచిన నమ్మకం.

కుటుంబాల్ని ద్వేషించే మనిషి మనసులో ఎక్కడో అంతర్గతంగా సైకాలజికల్ శిథిలావస్థ ఉందని నా దృఢ నమ్మకం. రాష్ట్రపతి దగ్గరి నుండి రాళ్లు కొట్టే వ్యక్తి వరకూ, ప్రతి వారి యొక్క అంతర్యాలలో ఒదిగిపోయివున్న నివురుకప్పిన నిప్పులు, ఒయాసిస్ లు తెలుసుకోవాలనే ఆరాటపడే మనస్తత్వం నా కలానికి ప్రాణంగా మారింది. నా యీ నవలలు చదువుతుంటే, ఇందులో సంఘటనలు, పాత్రలు, వారి స్వభావాలు, ఇంతగా చిత్రించగల నైపుణ్యం కాలం, నా కలానికి ఎప్పుడు పదును పెట్టిందా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవి గొప్ప నవలలు కాకపోవచ్చు కానీ, నేను పయనించిన యీ కాల గమనంలో, కొంతమంది నాతోటి బాటసారుల జీవనదర్పణాలు అని ఖచ్చితంగా చెప్పగలను.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

Designs by Madhav Sai Jaswanth