Meet Madhu Babu - The Famous 'Detective' Writer Whose Novels Were On Par With Modern Day Commercial Movies!

Updated on
Meet Madhu Babu - The Famous 'Detective' Writer Whose Novels Were On Par With Modern Day Commercial Movies!

అతనితో పాటు పనిచేసే టీచర్స్ కి కూడా ఆయన ఒక రైటర్ అని చాలా సంవత్సరాలు తెలీదు . రచన మీద మక్కువ తో ఆయన రాసిన డిటెక్టివ్ నొవెల్స్ అంటే అప్పట్లో జనాలు ఎగపడి చదివేవారు . పాకెట్ సైజు బుక్ , చాలా తక్కువ ధర లో జనాలకి మూవీ రేంజ్ entertainment ఇచ్చేవి ఆయన కథలు . “మధుబాబు” అనే పేరుతో ప్రసిద్ధి చెందిన డిటెక్టివ్ తెలుగు రైటర్ అసలు పేరు “మధుసూధన రావు ”, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఒక సాధారణ స్కూల్ హెడ్ మాస్టర్ . కలం అన్నా , కథలన్నా ఆయనకు మహాఇష్టం. దశాబ్దాల పాటు తనదైన డిటెక్టివ్ కథలతో తెలుగు ప్రజలను రంజింప చేసారు. మీడియకి, publicity కి చాలా దూరంగా ఉండే ఆయన తన ముఖం చూసి కాదు తన కథలు చూసి గుర్తుంచుకోవాలి అంటుంటారు.

పునాది : 1970 లో దేశ పర్యటన చేస్తున్న మధుబాబుగారు చివరికి చెన్నై చేరారు . అక్కడ ఆయన ఒక ఇంగ్లీష్ కథను translate చేస్తూ మధ్యలోనే ఆపేసారు . అది చూసిన మధుబాబు గారి స్నేహితుడు బాగుంది కంటిన్యూ చేయొచ్చు కదా అన్నారు . నేను ఇంకా రాస్తే నా సొంత కథనే రాస్తాను అని తన మొదటి రచనకు నాంది పలికారు. మరుసటి రోజే అతని స్నేహితుడు మధుబాబుని తీసుకుని పబ్లిషర్స్ దగ్గరకు వెళ్లారు . మూడు రోజులు తిరిగేసరికి ఆయన మొదటి నవల "Wanted Dead or Alive " తో పబ్లిషర్స్ దగ్గరకు వెళ్లారు. 1973 లో అది పబ్లిష్ అయింది . అయన ఆ నవల పబ్లిష్ అయ్యే టైంకి మరో 25 నవలలు రాసారు. మొదటి నవలకు వచ్చిన విశ్లేషణ ఆధారంగా మళ్ళీ ఆ 25 నవలలను తర్వాత రీరైట్ చేసారు.

“షాడో”: షాడో – ఒక తరం పాటు ప్రజలందిరికి పిచ్చెకించిన క్యారెక్టర్ అది . తెలుగులో జేమ్స్ బాండ్ రేంజ్ characterisation తో ఆధ్యంతం ఉత్కంఠంగా సాగే కథనంతో వేరే లోకానికి తీసుకెళ్లేవారు . షాడో , ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా మారాడు, ఆ పరిణామ క్రమాన్ని ఒక్కో నవల లో వివరించుకుంటూ వెళ్లారు . అయన చెప్పే విధానం, కథను నడిపించిన తీరు పాఠకులకు విపరీతంగా నచ్చింది . చదువుతూ పోతుంటే ఆ charecterlu అన్ని కళ్ళ ముందు కనిపిస్తుంటాయి , ఆయన అక్షరాలకు ఉన్న పవర్ అలాంటిది . ఒక్కో నవల లో హీరో చేసే సాహసాలు చూస్తుంటే వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. ఇవ్వన్నీ ఒక ఎత్తు ఐతే షాడో తాగే “Panama” సిగరెట్ కి కూడా ఒక రేంజ్ క్రేజ్ వచ్చింది అంటే ఆయన రచనలకున్న డిమాండ్ మనం అర్ధం చేస్కోవచ్చు.

ఉదాహరణలు – ఉపమానాలు 10 మంది కలిసున్న చోట ఒక చిన్న గొడవ జరిగింది. దాన్ని చూసి జనాలు పారిపోయారు . ఇది మాములుగా మనం చెప్పుకునే తీరు . దానికి ఉదాహరణలు ఉపమానాలు జోడించి మధుబాబుగారు ఆ situation ని ఇంకా intense గా present చేసేవాళ్ళు. “రాతి మీద కుండ వేసి కొట్టినట్టు చెల్లా చెదురుగా జనం పారిపోయారు ” అని వర్ణించేవారు. ఇలా క్యారెక్టర్ అయినా , వాళ్ళు తిరిగే ప్రదేశం అయినా, జరిగిన సంఘటన అయినా కళ్ళకు కట్టినట్టు వర్ణించే తీరు పాఠకులను బాగా ఆకర్షించేది . Down kick, Flying kick అని karate, kung fu లని కూడా ఆయన తన కథలతో తెలుగు పాఠకులకు పరిచయం చేసారు. మొదట పాఠకులకు అర్ధంకాక అదో అభూతకల్పన అని feel అయ్యేవారు . కానీ బ్రూస్ లీ “Enter The Dragon” మూవీ రిలీజ్ అయ్యాక అది నిజం అని నమ్మారు. దానితో పాఠకుల సంఖ్య నాలుగు ఇంతలు పెరిగింది కూడా.

క్రైమ్ , డిటెక్టివ్ , జానపదం ఏదైతే ఏం అన్నిట్లోనూ మధుబాబు గారి హస్తం ఉంది. నవలలే కాదు చక్రతీర్థం , కాళికాలయం వంటి తెలుగు సీరియల్స్ కి కూడా కథను అందించారు. స్వాతి పత్రిక లో సీరియల్స్ కూడా రాసేవారు . అస్లీలత , అనవసరమైన వర్ణనలు లేకుండా చక్కని కథలతో మధుబాబు గారు దాదాపు 100 కు పైగా డిటెక్టివ్ ఫిక్షన్ , 40 కు పైగా మాములు నవలలు రాసారు. “Creativity ని బావి అనుకుంటే , కథలు అందులో ఊరే నీరు అయితే దాన్ని నేను బకెట్ తోనే తొడుక్కున్న , motor పెట్టాలా . అందుకే నా లోని రచయిత ఇంకా సజీవం గానే ఉన్నాడు ” అని మధుబాబు గారు అంటుంటారు . తనదైన శైలితో , ఆధ్యంతం ఉత్కoటంగా సాగే కథనాలతో తెలుగు పాఠకులను అలరించిన మధుబాబు గారికి ఇదే మా సలాం !!