మహానటి- ఒక గొప్ప మహిళ కథను, నేటి తరం మహిళలు కలిసి తీర్చి దిద్దిన ఒక మహాకావ్యం. ఒకరు కాదు ఇద్దరు కాదు, కథను నిర్మిచిన నిర్మాతల నుండి దర్శకుడు వెన్నంటే నడిచిన అసిస్టెంట్ డైరెక్టర్ ల దాకా వందల మంది మహిళలు ఈ కథను తమ భుజాల పై వేసుకున్నారు. సినీ పరిశ్రమ మహిళలకు కాదు అన్నవారందరికి ఈ సినిమా తో సమాధానం ఇచ్చారు. ఒక గొప్ప కథను వెండితెర పై అద్భుతంగా ఆవిష్కరించిన ఒక ప్రయత్నం వెనుక ఉన్న శక్తి ఈ క్రిందనున్న మహిళలు మరియు వారి తపన.
The Daring Producers : Swapna dutt-Priyanka dutt- కథను నమ్మి, కష్టాలను అధికమించి ఒక మంచి సినిమాను కాదు కాదు తెలుగు సినిమా గర్వించే ఒక మహానటి కథను మనకు అందిచారు.
The Voice of Mooga Manasulu - Shreya Ghoshal- తన స్వరం తో మళ్ళీ మనల్ని చందమామ దాకా తీసుకువెళ్ళింది. మూగ మనుసుల ప్రేమ మాటలను ఈ పాట ద్వారా మనకు పరిచయం చేసారు.
The Voice Behind Sada Ninnu - Charulatha Mani- "సద నన్ను నడిపే" ఈ పాట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ మధ్య ఎవరి ప్లే లిస్ట్ చుసిన ఇది పాట వినిపిస్తుంది అనటం అతిసయోక్తి కాదు. ఆ గానం, ఆ స్వరం చారులత మని గారికే సొంతం. ఎంత విన్న తనివితీరదు, వింటూ ఉంటె మన మనసు మన దగ్గర ఉండదు.
The Voice of Agipo Balyama - Ramya Behara - ఆగిపో బాల్యమా అంటూ చిన్నతనం లో సావిత్రి గారి చలాకితనాన్ని, చురుకుతనాన్ని మనకి తన గానంతో అలా ఆ రోజుల్లోకి తీసుకువెళ్ళింది.
Evergreen Sunitha- చివరకు మిగేలేది .. పాట వింటున్నప్పుడల్లా అందరికి కంట కన్నీరు మాత్రం తప్పవు. సావిత్రమ్మ కథను ఒక పాటలో చెబుతూ, ఎంత గొప్ప మనిషినైనా మనం మోసం చేయటం, మరచిపోవడం మనిషి నైజాం అంటూ మన మట్టి బుర్రలకి అర్ధం అయ్యేలా తన గాత్రం తో తెలియచేసింది సునీత.
Always active ADs - దర్శకుడు వెన్నంటే ఉంటూ, తను నమ్మిన కథను తెర పైకి తీసుకురావటాని రేయింబవళ్ళు కష్టపడుతూ, ఆర్టిస్ట్ ల నుండి కాస్ట్యూమ్స్ దాక ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఒక అద్భుత మైన కావ్యాన్ని మనకు అందించటం లో తమ వంతు పాత్ర వహించారు. Assistant directors: Aishwarya iyer, Bhavya salapu and Pallavi Penupaatruni
Set Designers
- విజయవాహిని స్టూడియోస్ నుండి మాయాబజార్ సెట్ దాక, సావిత్రమ్మ మొదటి ఫోటో నుండి శశిరేఖ ఘటోత్గజుడు లా ప్రవర్తించే ఆ సన్నివేశం దాక ప్రతి చిన్న డీటెయిల్ ని అదే విధంగా చూపించటానికి ప్రయత్నించారు. మనందరినీ ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్లారు. Production design team: Chandrika gorrepatiConstume Designers- సావిత్రి గారి చిన్నతనం నుండి ఆమె చివరి క్షణం వరకు, నిజాన్ని నాటకాన్ని ప్రతి దానిలో చాల డిటైలింగ్ తో కాంస్టూమ్స్ ని డిజైన్ చేసారు. Head costume stylist: Indrakshi Ria Pattanaik and Her assistants Geetha Gautham, Shilpa GNS and Vidya Costume designer: Archana rao
The Magical Annie master- నృత్య దర్శకురాలు గా అన్ని సన్నివేశాలను మళ్ళీ ఆ రోజులు తలపించేలా చేసారు. "అహనా పెళ్ళంటా" అనే పాట మళ్ళీ తెర మీద చూస్తుంటే మళ్ళీ సావిత్రి గారిని చూస్తున్నట్టు అనిపించేలా తీర్చిదిద్దారు.
The Women Cast
Malavika nair as Alemelu-
Shalini Pandey as Susheela
Nisankara- Child Savitri
Bhanu Priya - Savitri's Peddamma
Tulasi - Madhuravani's mother
Divya vani- Savitri's Mother
Samantha as Madhuravani
Keerthy Suresh as Mahanati Savitri
On the eve of Mother's day the team of Mahanati released a video on Women crew behind this biopic. Have a look!!