25 Photos Of Warangal People Proudly Painting Their History On Walls

Updated on
25 Photos Of Warangal People Proudly Painting Their History On Walls

పుస్తకాలలో అక్షరరూపంలో ఉన్న చరిత్రను చదవడం కన్నా చిత్రాలలోని చరిత్ర పిల్లల లేతమనసులపై బలంగా ముద్రపడుతుంది.. వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. కాకతీయుల సామ్రాజ్యం మహా పెద్దది. పరిపాలన ఎలా సాగించాలి, కళలు సాంప్రదాయలను ఎలా పెంచి పోషించాలి లాంటి విషయాలలో వారు ఎప్పటికీ ఆదర్శప్రాయులే. వరంగల్ అర్బన్ కలెక్టర్ చొరవ, మున్సిపల్ కమిషనర్ సహకారంతో వరంగల్ కోటకి ఒక కొత్త రూపు తీసుకొచ్చేలా మట్టి కోట నుండి రాతి కోట మీదుగా కుష్ మహల్ వైపు వెళ్లే దారిలో ఉన్న గృహాల గోడలపై వ్యవసాయం, అనుంబంధ వర్గాలకు చేయూత నిచ్చేలా పాలించిన కాకతీయుల వైభవాన్ని చిత్రాల రూపంలో అందరికీ తెలియజేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా కాకతీయుల పరిపాలన కేంద్రం ఖిలా వరంగల్‌లోని ప్రస్తుత గృహాలపై వారి పరిపాలన ప్రస్థానాన్ని, వైభవాన్ని చిత్రీకరిస్తున్నారు. వరంగల్ అర్బన్ టూరిజం కన్సల్టెంట్ అరవింద్ ఆర్య వీటికి గాను ప్రణాళికలు రూపొందించారు. జిల్లా పర్యాటక శాఖ & కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (Kakatiya Urban Devolopment Authority) సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో జవహర్‌లాల్‌ నెహ్రూ హస్తకళల విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) విద్యార్థులు భాగస్వాములు అయ్యారు .

200 ఇతివృత్తాలు: ఖిలా వరంగల్‌లో కాకతీయుల నాటి సంఘటనలు గుర్తుకు తెచ్చేలా 200 ఇతివృత్తాలను పర్యాటక శాఖ ఎంపిక చేసింది. ఖిలా వరంగల్, కాకతీయ కీర్తితోరణాలు, ఖుష్‌ మహల్‌ చూసేందుకు వచ్చే పర్యాటకులకు కాకతీయ యుగంపై అవగాహన వచ్చేలా ఈ చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. శైవారాధన చేసే చిత్రాలు, కాకతీయ కళా తోరణం, హన్మకొండ ప్రవేశద్వారం, హన్మకొండ కోట, ఎండ్ల బండ్ల వరుస, భూమిలో బండి కూరుకుపోవడం, ఇనుప కమ్మి బంగారంలా మారడం, రాజుగారికి తెలియజేయడం, ప్రోలరాజు గురువులతో కలసి రావడం, పరుసవేది శివలింగం, కోట నిర్మాణం ప్రారంభం, పరుసవేది ప్రతిష్టాపన, స్వయంభూ ఆలయ నిర్మాణం, 7 కోట గోడలు, మట్టి ఆకారం కోసం అగడ్తల తవ్వకం, తోరణ స్తంభాల ఏర్పాటు, మట్టికోట–రాతికోట–ఇటుక కోట–పుట్టకోట నిర్మాణాలు, గొలుసుకట్టు చెరువులు, మెట్ల బావుల నిర్మాణం, సైనికుల శిక్షణ, వ్యవసాయం, చేనేత, కళలు, తోటలు, రెండు అంతస్తుల బంగ్లాలు, ఏకశిల గుట్ట, ఐనవోలు తోరణం, జైన–శైవ–వైష్ణవ, భైరవ పూజ, పేరిణి నాట్యం, సింహద్వారం, మోటుపల్లి రేవు, వెయ్యి స్తంభాల ఆలయం, రామప్పలోని నంది, కుష్‌ మహల్, రుద్రమదేవి అబ్బాయిగా వేషధారణ వంటి ఎంపిక చేసిన ఘట్టాలను బొమ్మలుగా వేస్తున్నారు. ఇలాంటి చరిత్రను వివరించే చిత్రాలు ప్రతి ఊరిలో ఉంటే కనుక స్థానికంగా నివసిస్తున్న వారికి గర్వంగానూ, కొత్తగా తెలుసుకునే వారికి మరింత స్పష్టంగాను అర్ధమవుతుంది.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.

12.

13.

14.

15.

16.

17.

18.

19.

20.

21.

22.

23.

24.